Home » జగన్‌కు సీఈసీ నోటీసు

జగన్‌కు సీఈసీ నోటీసు

48 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కి కేంద్ర ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలపై నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ‘మేము సిద్ధం’ బస్సు యాత్రతో జగన్ చేస్తున్న ప్రచారం లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు, తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.

వలంటీర్లను విధులకు దూరం పెట్టడం వల్ల రెండు రోజుల్లోనే 31 మంది చనిపోయారని, అందుకే చంద్రబాబును హంతకుడని జగన్ విమర్శించారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యల పై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ వ్యాఖ్యలపై సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు ఇచ్చింది. తమ నోటీసుకు 48 గంటల్లోగా సీఎం జగన్ సమాధానం ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.తాజా పరిణామాలు వైసీపీని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Leave a Reply