Suryaa.co.in

Andhra Pradesh

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు తిరుగులేదని అభినందించిన ‘ఛాయ్ వాలా’

-డోన్ పుర ప్రగతికి రాచబాట
-సరికొత్తగా మారిన డోన్ ఆర్టీసీ బస్ స్టాండ్
-రూ.45 లక్షలతో ఆధునికీకరించిన ఆర్టీసీ బస్ స్టాండ్ ముఖద్వారం ప్రారంభోత్సవం
-డోన్ ప్రజల గ్రీవెన్స్ స్వీకరించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
-రూ.10 కోట్లతో నిర్మిస్తోన్న డోన్ ఐటీఐ హాస్టల్ భవనం పనులు పరిశీలన
-రూ.17 కోట్లతో పూర్తి దశకు చేరిన కూరగాయల మార్కెట్ పనుల పరిశీలన
-రూ.4.8 కోట్లతో పూర్తి చేస్తోన్న క్లబ్ హౌస్ భవన నిర్మాణ పనుల పరిశీలన
-కొత్త మున్సిపల్ భవనాన్ని జెడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డికి చూపిన మంత్రి బుగ్గన

డోన్, నంద్యాల జిల్లా, డిసెంబర్, 13; ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నాయకత్వంలో డోన్ నియోజకవర్గం ప్రగతి వైపు పరుగులు పెడుతోంది. ప్రారంభించిన పనులు పూర్తి దశకు చేరడంతో ఆర్థిక మంత్రి వరుస ప్రారంభోత్సవాలతో బిజీగా గడుపుతున్నారు. బుధవారం ఉదయం డోన్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆధునికీకరించడంతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో కలిసి ప్రారంభించారు.

బస్ స్టేషన్ ముఖ ద్వారంతో పాటు బస్ స్టాండ్ ఆవరణలో మౌలిక సదుపాయాలను ఆధునికీకరించినట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. రాకపోకలకు సంబంధించి రెండు ముఖ ద్వారాలు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, టాయిలెట్స్, భవనానికి రంగులు, ప్రయాణీకులకు కుర్చీలు తదితర రూ.45 లక్షల విలువైప పనులు పూర్తి చేయించినట్లు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన మౌలిక సదుపాయాలన్నింటినీ ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం డిపోలో నిర్వహించిన సమావేశంలో డోన్ ప్రజలు, మహిళల నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గ్రీవెన్స్ స్వీకరించారు. త్వరలోనే ఇంకా పూర్తి దశలో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకువెళుతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

డోన్ అభివృద్ధిలో మీకు సాటి, పోటీ లేరయ్యా అంటూ మంత్రికి ‘ఛాయ్ వాలా’ ప్రశంసలు
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ డోన్ పట్టణంలో నిర్మిస్తోన్న అభివృద్ధి పనులు పరిశీలించారు. రూ.10 కోట్లతో నిర్మిస్తోన్న డోన్ ఐటీఐ హాస్టల్ భవనం పనులను మంత్రి పరిశీలించారు. తుది దశకు చేరిన నేపథ్యంలో పనులు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. రూ.17 కోట్లతో పూర్తి దశకు చేరిన కూరగాయల మార్కెట్ పనులను మంత్రి బుగ్గన పరిశీలించారు. మార్కెట్ నుంచి నడుస్తూ క్లబ్ హౌస్ కు వెళుతున్న మంత్రి బుగ్గనకు ఓ ఛాయ్ వాలా ఎదురొచ్చి ఆశ్చర్యపరిచారు. మనస్ఫూర్తిగా చేయి కలిపి మీరు చేస్తున్న అభివృద్ధి అంతా ఇంతా కాదని, మీకు తిరుగులేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను కొనియాడారు. ఇన్ని పనులు చేసిన మిమ్మల్ని అభిమానంతో కలవాలనిపించిదయ్యా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అనంతరం రూ.4.8 కోట్లతో పూర్తి చేస్తోన్న క్లబ్ హౌస్ భవన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం కొత్త మున్సిపల్ భవనాన్ని జెడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డికి మంత్రి బుగ్గన చూపించారు. ప్రారంభోత్సవం సమయంలో రాలేదని పాపిరెడ్డి మంత్రికి చెప్పడంతో లోపల మీటింగ్ హాల్ సహా పుర భవనాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేశ్, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, ఆర్డీవో వెంకటరెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, డోన్ ఎంఆర్వో విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE