విజయవంతమైన సర్పంచ్ ల చలో అసెంబ్లీ

– 3.5 కోట్ల గ్రామీణ ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు రాజీలేని పోరాటాలు చేస్తాం
ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసి జగన్ ప్రభుత్వాన్ని లొంగదీస్తాం

– ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం అధ్యక్షుడు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్

అసెంబ్లీ గేటు ముందు, మందడం గ్రామ సెంటర్లో, విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో, ఉయ్యూరు లోని రాజేంద్రప్రసాద్ నివాసం వద్ద… నాలుగు ప్రదేశాల్లో సర్పంచులు ఆందోళన చేశారు. ఇలా నాలుగు ప్రదేశాల్లో వందలాది మంది సర్పంచులు పోలీసుల అక్రమ అరెస్టులను దాటుకొని “ఛలో అసెంబ్లీ” విజయవంతం చేశారు.

నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు అసెంబ్లీ గేటు వద్దకు వెళ్లి నిరసన తెలియజేసిన మొట్టమొదటి సంఘం మా సర్పంచుల సంఘం అని…జగన్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, పోలీసులతో రెండు రోజుల ముందే హౌస్ అరెస్టులు చేయించినా మా సర్పంచుల ఉద్యమ స్ఫూర్తి ముందు అవి నిలవలేవని అన్నారు. మలిదశ ఉద్యమంలో ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం మొదటిది మాత్రమేనని, ముందు ముందు జగన్ ప్రభుత్వానికి మా సర్పంచుల తడాఖా ఏంటో చూపిస్తామన్నారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, పోలీసులతో రెండు రోజుల ముందే హౌస్ అరెస్టులు చేయించినా వాటన్నిటిని దాటుకొని “ఛలో అసెంబ్లీ” కార్యక్రమాన్ని రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల వారు వచ్చి విజయవంతం చేసిన రాష్ట్రంలోని సర్పంచులు, పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

 

Leave a Reply