దేశంలో మరోసారి బీజేపీ సర్కారు రావాలి

మోదీకి ఎదురునిలబడే శక్తి ఏ కూటమికి లేదు
తెలంగాణలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ -కాంగ్రెస్ పార్టీ మధ్యే పోటీ
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ , మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి , బీజేపీ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ , పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి , రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్ , రాణి రుద్రమ , తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రజలందరూ నరేంద్ర మోదీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీని బలపర్చాలనే ఆలోచనతో ఉన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో, అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో సానుకూల వాతావరణం కనపడుతోంది. దేశంలో ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ రాకముందే దేశ ప్రజల్లో ఒక స్పష్టమైన ఆలోచన కనపడుతుతోంది. దేశంలో మరోసారి బీజేపీ సర్కారు రావాలి. మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ కావాలని ప్రజలు స్పష్టమైన నిర్ణయంతో ఉన్నరని కనపడుతోంది.

నరేంద్ర మోదీ నాయకత్వంలో గత రెండుసార్లు బీజేపీ కి మెజారిటీ పెరిగింది. మూడోసారి లోక్ సభ ఎన్నికల్లో ప్రజల నుంచి మరింత మెజారిటీ కట్టబెట్టేలా సానుకూల వాతావరణం కనపడుతోంది. తెలంగాణలో అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడేలా తెలంగాణ ప్రజలు భాగస్వామ్యమయ్యేలా, ప్రజల మద్దతు కూడగట్టడం కోసం, ప్రజల ఆశీస్సులు తీసుకోవడం కోసం రాష్ట్ర శాఖ 5 బస్సు యాత్రలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమై మార్చి 1వ తేదీ వరకు కొనసాగుతుంది. యాత్ర 5 ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది.

కొమురం భీం యాత్ర -1 : ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలు.
శాతవాహన యాత్ర -2 : కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలు.
కాకతీయ యాత్ర -3 : ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్.
భాగ్యనగర యాత్ర -4 : భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి.
కృష్ణమ్మ యాత్ర -5 : మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ.

ఇది రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మండలాల్లో కొనసాగుతుంది. ఈ యాత్ర ప్రతిరోజు 2 నుంచి 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించబడుతుంది. ప్రతి మండల కేంద్రంలో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో రోడ్ షోలు ఉంటాయి. యాత్రలో పార్టీ ముఖ్య నాయకులు బహిరంగ సభల్లో, రోడ్ షోలలో పాల్గొంటారు.

ప్రతి యాత్రలో అన్ని వర్గాలకు సంబంధించిన వారు, ముఖ్య నాయకలు పాల్గొంటారు. కొంతమంది నాయకులు పూర్తిస్థాయిలో యాత్రలో పాల్గొంటారు.ఈ 5 యాత్రలు భాగ్యనగరంలో కలిసేవిధంగా రూపొందించడం జరిగింది.మండల, అసెంబ్లీ, జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేశాం. యాత్రలో మమేకమయ్యే ప్రజల ఈ యాత్రలో జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొననున్నారు.

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి, సానుకూల వాతారణం కనపడుతోంది. నరేంద్ర మోదీ కి మద్దతుగా నిలుస్తున్నారు. తెలంగాణలో 17కు 17 సీట్లు బీజేపీ గెలవడమే లక్ష్యం. హైదరాబాద్ సీటును సైతం బీజేపీ గెలుస్తుంది. తెలంగాణలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ -కాంగ్రెస్ పార్టీ మధ్యే పోటీ ఉంటుంది. నరేంద్ర మోదీ కి ఎదురునిలబడే శక్తి ఏ కూటమికి లేదు.

నరేంద్ర మోదీ ప్రభుత్వంలో దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, సాహసోపేత చర్యలతో సుపరిపాలన అందించడం జరిగింది.రానున్న పార్లమెంటు ఎన్నికల్లో గత పార్లమెంటు ఎన్నికల కంటే అద్భుత మెజారిటీ భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి అత్యధిక మెజారిటీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది.

ఖమ్మం, నల్లగొండ ప్రాంతాల నుంచి కూడా నరేంద్ర మోదీ కి 80 శాతం మంది ప్రజలు అండగా నిలుస్తున్నారు. ఈ ఎన్నికలు… కుటుంబ, అవినీతి పార్టీలకు-ధర్మం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు… సుస్థిరతకు-అస్థిరతకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఆర్టికల్ 370 రద్దుతో భారతదేశంలో కశ్మీర్ కలిసిపోయింది. నరేంద్ర మోదీ దశాబ్ధాలుగా పట్టి పీడిస్తున్న సమస్యకు పరిష్కారం చూపారు.

తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించాలని కోరుకుంటున్నాను. తెలంగాణలో జరుగుతున్న యాత్ర దేశ అభివృద్ధి కోసం జరుగుతున్న యాత్ర. యూపీఏ హయాంలో రూ. 12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఒక సుస్థిరమైన పాలన అందించడం జరుగుతోంది. యూపీఏ హయాంలో అవినీతి కేసుల్లో కేంద్రమంత్రులు కూడా జైలుకు పోయారు. నరేంద్ర మోదీ పాలనకు మద్దతుగా , తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించాలని కోరుతున్నాను.

 

Leave a Reply