చంద్రబాబు దళితులను దగా చేశారు

-చంద్రబాబు పాలనలో దళితులపై అత్యాచారాలు,దాడులు, అరాచకాలు జరిగాయి
-చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం ఎదుట ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాకనే దళితుల గురించి మాట్లాడాలి
-దళితుల అభ్యున్నతికి అంబేద్కర్ ఆలోచనతో ముందుకు వెళ్తున్న వ్యక్తి వైయస్ జగన్
-దళితుల జీవితాలలో వెలుగులు నింపుతున్న వైయస్ జగన్ కు దళితులంతా అండగా నిలవాలి

విజయవాడలో జరిగిన “ఆంధ్రప్రదేశ్ లో దళిత సంక్షేమం పై చర్చా గోష్టి” లో దళిత నేతల వ్యాఖ్యలు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలో దళితులకి సంక్షేమ‌ పధకాలు అందుతుండటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వైయస్సార్ సిపి ఎస్సి సెల్ రాష్ర్ట అధ్యక్షుడు,ఎంఎల్ ఏ మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలకి మళ్లీ తెరలేపారని విమర్శించారు. ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని విమర్సించిన నేత చంద్రబాబు అనే విషయాన్ని దళితులు ఎవరూ కూడా మరిచిపోలేదని ఆయన అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం నాడు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో “ఆంధ్రప్రదేశ్ లో దళిత సంక్షేమం పై చర్చా గోష్టి” కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దళితులకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గురించి చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మేరుగ నాగార్జున పాల్గొన్నారు.

ఈ చర్చా గోష్టిలో రాష్ర్ట సీనియర్ దళితనేత,సీనియర్ అడ్వకేట్ చందోలు డేవిడ్ విజయకుమార్ ,మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు,ap సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్,వైస్సార్సీపీ SC విభాగం కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు నలుకుర్తి రమేష్,రాష్ట్ర ఎంఇఓ అసోషియేషన్ అధ్యక్షుడు వెంకటరత్నం, మాదిగ కార్పొరేషన్ సాధన సమితి రాష్ట్రా కో. కన్వీనర్ చెరుకూరి కిరణ్ , క్రిస్డియన్ జెఎసి అధ్యక్షుడు యలమంచిలి ప్రవీణ్, దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు రమణ, ఎస్ వి యూనివర్సిటీ ఇసి మెంబర్ ఎం.మధు,ఎస్సి ఎస్టి బిసి వికలాంగుల సంస్ధ అద్యక్షులు బందెల కిరణ్ రాజు,సీనియర్ అడ్వకేట్, డిక్కీ అధ్యక్షులు ఎం.కిషోర్,సురేష్,దళిత క్రిష్టియన్ నేత పెరికే వరప్రసాద్ పాల్గొని శ్రీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక దళితుల సంక్షేమంకోసం తీసుకున్న చర్యలు వారి జీవితాలలో వెలుగులు నింపుతున్నాయని అభిప్రాయపడ్డారు.

మేరుగ నాగార్జున మాట్లాడుతూ వైఎస్సార్ సిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు దళితులు, నిరుపేదలకి అందుతున్నది నిజం కాదా ?. దళితులకి ఇంగ్లీష్ విద్య అందించాలని సిఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తే అడ్డుకున్నది చంద్రబాబు కాదా?. రాజధాని భూమిలో దళితులకి భూములివ్వాలని సిఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తే అడ్డుకున్నది చంద్రబాబు కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులని పక్కదారి పట్డించిన ఘనత చంద్రబాబుదేనని, చంద్రబాబు హయాంలో దళితులకి ఏ నాడూ న్యాయం జరగలేదు అని అన్నారు.

చంద్రబాబు హయాంలో ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ఇచ్చిన ఇన్నోవాలు బినామీలు కాజేశారన్నారు. వైయస్ జగన్ దళితులకు మేలు చేయాలనే ఉధ్దేశ్యంతో సంక్షేమ‌ పధకాలన్నీ నేరుగా లబ్దిదారులకే అందచేస్తున్నారు…మధ్యలో దళారీలు లేరు…బినామీలు లేరు అని స్పష్టం చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా నోడల్ ఏజెన్సీ ద్వారా దళిత సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. సిఎం వైఎస్ జగన్ మరో అడుగు ముందడుగు వేసి దళితుల సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. అంబేద్కర్ ఆలోచనలని, ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్నది సిఎం వైఎస్ జగన్ అని తెలియచేేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై జరిగిన దాడులు,అరాచకాలు, అక్రమాలు ఎవరూ మరిచిపోరని తెలిపారు. దళితుల గురించి చంద్రబాబుకి‌ మాట్లాడే అర్హత లేదు అని అంటూ అంబేద్కర్ ఆశయాలకి తూట్లు పొడిచిన నేత చంద్రబాబు అని అభివర్ణించారు.

దళిత సంక్షేమంపై టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోందని,దళితుల గురించి తప్పుగా మాట్లాడానని అంబేద్కర్ విగ్రహం‌ ముందు ముక్కు నేలకి రాసి చంద్రబాబు క్షమాపణ కోరిన తర్వాతే దళితుల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ వర్క్స లోను,పదవులలో ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనార్టీలకి ఈ ప్రభుత్వం 50 శాతం కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయం‌ కాదా అని ప్రశ్నించారు. అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ఏకైక నాయకుడు సిఎం వైఎస్ జగన్ అని దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్న సిఎం వైఎస్ జగన్ కి దళితులంతా అండగా నిలబడాలని కోరారు.

ఎపి సోషల్ వెల్ వేర్ బోర్డు ఛైర్మన్ సునీల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు సిఎంగా పనిచేసిన‌ 14 ఏళ్లూ దళితుల సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచన చేయలేదని అన్నారు.దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబుఅని అన్నారు. దళితుల అభివృద్దికి వైఎస్సార్ సిపి ప్రభుత్వం అత్యధిక‌ ప్రాదాన్యత అని వివరించారు.లో దళితులకి కీలక పదవులిచ్చారు. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ‌పధకాలలో ఎక్కువ శాతం‌ లబ్ది పొందేది దళితులేనని అన్నారు.

ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ కనకారావు మాదిగ మాట్లాడుతూ దళితుల‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి, టిడిపికి లేదని అన్నారు.దళితుల జీవితాలలో వెలుగులు నింపుతున్న శ్రీ వైయస్ జగన్ పై అవాకులు,చెవాకులు పేలితే దళితులు చంద్రబాబుకు తగిన విధంగా బుధ్ది చెబుతారని అన్నారు.మాజి జడ్జి శ్రవణ్ కుమార్ లాంటి వ్యక్తుల విమర్శలను దళితులు నమ్మరని అన్నారు.

ఎంఇఓ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరత్నం మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే దానివల్ల బాగుపడేది పేద వర్గాలకు చెందిన దళిత పిల్లలేనని అయినా కూడా దుర్మార్గంగా చంద్రబాబు దానిని అడ్డుకున్నారన్నారు.దళితులు అభివృధ్ది చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు.

రిటైర్డ్ ఇన్ కమ్ టాక్స్ కమీషనర్ మేడికొండ సుబ్రమణ్యం మాట్లాడుతూ కరోనాతో రాష్ర్ట ఆర్దిక పరిస్ధితి దెబ్బతిన్నాకూడా దళితులకు మేలు చేసే అనేక సంక్షేమ పధకాలను శ్రీ వైయస్ జగన్ కొనసాగిస్తున్నారని అన్నారు.అంబేద్కర్ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లాలనే ధ్యేయంతో విజయవాడలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నారని తెలియచేశారు.

కార్యక్రమంలో కార్పొరేటర్స్ బుల్లా విజయ్ , మాజీ డిప్యూటీ మేయర్ గ్రిటన్, మాల మహానాడు అధ్యక్షులు యోనారాజు, దళిత క్రిస్టియన్ ఫోరమ్ నాయకులు ప్రవీణ్, డిక్కీ నాయకులు వెంకట్, వైస్సార్సీపీ ఎస్సి సెల్ అధ్యక్షులు బూదాల శ్రీను,మధిర ప్రభాకర్ వివిధ దళిత ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply