Suryaa.co.in

Andhra Pradesh National

ఉక్రెయిన్ నుంచి క్షేమంగా తెలుగు వారిని క్షేమంగా తెండి

-విదేశాంగశాఖ మంత్రికి చంద్రబాబు లేఖ
– ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు ప్రజలను ఇండియాకి తీసుకురావాలని కోరుతూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ కు లేఖ రాసిన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు

కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకురావడంలో మీరు చూపిన చొరవ మరువలేనది.దాదాపు 4000 మంది తెలుగు విద్యార్థులు, విద్యావంతులు ఉక్రెయిన్ దేశంలో చిక్కుకొని ఉన్నారు.ఏటీఎంలలో నగదు తీసుకునేందుకు కూడా అవకాశం లేకుండా, తినేందుకు తిండి లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఒడెస్సా, కీవ్ పట్టణాలలో యూనివర్శిటీలు, కార్యాలయాలు మూసివేయడంతో తెలుగు ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.కొంతమంది తెలుగు ప్రజలు తోటి భారతీయులతో కలిసి కీవ్ విమానాశ్రయంలో విమానం ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రస్తుతం వారు ఇండయన్ అంబసీ ఏర్పాటు చేసిన ఒక స్కూల్ లో తలదాచుకుంటున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి యోగక్షేమాలపై వారి కుటుంబ సభ్యులు చాలా ఆవేదన చెందుతున్నారు.

కావున సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు ప్రజలను స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చేసే ఈ సహాయం వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.

LEAVE A RESPONSE