Home » ‘చీప్‌ సెక్రటరీ’ జవహర్‌రెడ్డి

‘చీప్‌ సెక్రటరీ’ జవహర్‌రెడ్డి

-జగన్‌రెడ్డికి గులాంగా జీ హుజూర్‌ అంటున్నారు
-ఏరోజైనా బాధ్యతలను సక్రమంగా నిర్వహించారా?
-కుంభకోణం చేసిందీ, లేనిదీ మా ప్రభుత్వం తేలుస్తుంది
-సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

విశాఖలో భూ కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ చేసిన వ్యాఖ్యలపై సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించారు. జవహర్‌రెడ్డి చీఫ్‌ సెక్రటరీ కాదు..చీప్‌ సెక్రటరీ అంటూ మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ సీఎస్‌ కూడా ఇలా దిగజారలేదు. బాస్‌కు గులాంగా మారి దోపిడీకి జీ హుజూర్‌ అంటూ దారుణంగా వ్యవహరించారు. మీపై ఆరోపణలు చేశారని పరువు నష్టం దావా వేస్తామని గుంజుకుంటున్నారే …ఏ రోజైనా సీఎస్‌ బాధ్యతలకు సక్రమంగా నిర్వర్తించారా? మీ హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రజాప్రతినిధులు శాసనసభలో ఆమోదించిన బడ్జెట్‌ కేటాయింపులకు విలువ లేకుండా చేశారు.

వ్యవసా యం, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, విద్య తదితర కీలక శాఖలకు కేటాయించిన నిధులను ఇష్టారాజ్యంగా మళ్లించే అధికారం మీకెవరిచ్చారు? జగన్‌్‌మోహన్‌రె డ్డికి గులాంగా మారి చట్టాన్ని బూటు కాళ్ల కింద నలిపేయడం దుర్మార్గం. జగన్‌రెడ్డి దోచుకుంటున్న లక్షల కోట్లకు కౌంటింగ్‌ ఏజెంట్‌గా సీఎస్‌ మారిపోవ డం దురదృష్టకర పరిణామం. మీరు కుంభకోణం చేసిందీ, లేనిదీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తేలుస్తుంది. కానీ, రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖను భూ కుంభకోణాలకు అడ్డాగా మార్చేశారు.

ప్రజల పాలిట పెనుశాపమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ఎలా యాక్సెప్ట్‌ చేస్తారు. ఎవరూ అడగని రీ సర్వేను రైతు లపై ఎలా బలవంతంగా రుద్దుతారు? మా తాతలు, తండ్రులు ఇచ్చిన పొలాల్లో జగనన్న భూరక్ష పేరుతో రాళ్లు ఎలా నాటుతారు? మా ముత్తాతలు ఇచ్చిన ఆస్తు ల పత్రాలపై మేము రోజూ జగన్‌రెడ్డి ఫొటోలు చూసుకోవాలా? రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ హింస జరుగుతుంటే సీఎస్‌గా అదుపుచేయడంలో విఫలమై కన్ఫర్మడ్‌ ఐఏఎస్‌ల ఫైలుపై అంత ఆత్రమెందుకు? అని ప్రశ్నించారు.

Leave a Reply