– ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం శ్రీరఘురామ్
జగ్గయ్యపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం శ్రీరఘురామ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన పూర్తిస్థాయిలో విజయవంతమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశ్రమల రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి వాతావరణం దావోస్ పర్యటన కారణంగా ఏపీలో నెలకొంది. చంద్రబాబు ఈ విషయంలో విజేయులై తిరిగొచ్చారన్నారు.
గత 5 సంవత్సరాల విధ్వంజకర పరిపాలనలో ఈ రాష్ట్రం నుంచి ఎన్నో పరిశ్రమలను తరిమివేయడం, ఇలాంటి కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కడో దివాళస్థాయికి వెళ్లిన దానిని మళ్లీ 7 నెలల్లోనే పట్టాలపైకి ఎక్కించడానికి అటు చంద్రబాబు గారు,రెండోవైపు లోకేష్ గారు ఇద్దరూ కూడా చేస్తున్న కృషి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్న విషయం మనందరికీ తెలుసు. చంద్రబాబు , లోకేష్ పర్యటన దావోస్‌లో అది ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా కనపడింది, జాతీయ, అంతర్జాతీయ పత్రికలన్నీ ఈ విషయాన్ని తేటతెల్లంచేశాయి. జగన్‌మోహన్‌రెడ్డి నిర్వాకానికి అంధకారంలో వెళ్లిపోయినదాన్ని మళ్లీ ఈరోజు వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది.