Suryaa.co.in

Andhra Pradesh

యువగళానికి రెండేళ్లు – అభివృద్ధి దిశగా అడుగులు

– వేమిరెడ్డి దంపతులు

కోవూరు: ఈ తరం యువతకు యవనేత, మంత్రి నారా లోకేష్ గారు ఆదర్శమన్నారు వేమిరెడ్డి దంపతులు. యువగళం పాదయాత్ర తలపెట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లు విడుదల చేసిన ప్రకటనలో ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలిపారు.

గూగుల్, టి ఎస్ సి మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్ లాంటి దిగ్గజ పారిశ్రామిక సంస్థలు మన రాష్టంలో 6. 33 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేలా ఒప్పించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారని ప్రశంసించారు. ఇటు కుప్పం నుంచి అటు విశాఖపట్నం వరకు సాగిన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా లోకేష్ గారు పరిణితి చెందిన నాయకులుగా రాటు తేలారని కొనియాడారు. రాష్టంలోని 97 నియోజకవర్గాలను కవర్ చేస్తూ లోకేష్ పాదయాత్ర సాగితే అందులో 90 శాసనసభ స్థానాలు అభ్యర్థులు గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చేందుకు దోహద పడిందన్నారు.

LEAVE A RESPONSE