-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
రాష్ట్రంలో రోడ్లు నడిచేందుకు కూడా వీలుగా లేవని జనం గగ్గోలు పెడుతున్నారు. పక్కరాష్ట్ర పాలకులు అధ్వాన పాలనకి ఉదాహరణగా మన ఏపీని చూపిస్తున్నారు. అయినా ప్రభుత్వ స్పందన శూన్యం. రాజకీయాలకు దూరంగా, ఆధ్మాత్మిక ప్రపంచానికి దగ్గర, హిందూ ధర్మ ప్రచారమే జీవితలక్ష్యంగా సాగుతోన్న చిన జీయర్ స్వామి ఆంధ్రప్రదేశ్లో రహదారుల దుస్థితిపై ఆవేదనతో స్పందించారు. గతుకులు-గుంతలు, ఒడిదుడుకుల గురించి ప్రస్తావిస్తూనే.. జంగారెడ్డి గూడెం నుంచి రాజమహేంద్రవరం వరకూ రోడ్డు ప్రయాణం ఒక జ్ఞాపకంగా మిగిలిపోనుందని రోడ్ల దుస్థితిని భక్తులకు చెబుతున్నట్టే ప్రవచనంలో భాగంగానే వ్యాఖ్యానించడం చూస్తుంటే..జగన్‌రెడ్డి పాలనలో రహదారులు ఎంత దారుణంగా వున్నాయో స్పష్టం అవుతోంది.