Suryaa.co.in

Andhra Pradesh

ముస్లింల ఆస్తులపై ఉన్న శ్రద్ధ మైనారిటీల సంక్షేమంపై లేదు

– జగన్ ప్రభుత్వం రద్దుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం
– అంబేద్కర్ విదేశీవిద్య పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో నిర్వీర్యం
– యువనేత నారా లోకేష్

నారా లోకేష్ ను కలిసిన మోర్సపూడి ముస్లింలు

నూజివీడు నియోజకవర్గం మోర్సపూడి ముస్లిం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో సుమారు 150 ముస్లిం మైనారిటీ కుటుంబాలు ఉన్నాయి.
• మాకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం.
• వైసీపీ ప్రభుత్వం దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేసింది.
• మీరు అధికారంలోకి వచ్చాక మాకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలి.
• గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు కొనసాగించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్ ప్రభుత్వానికి ముస్లింల ఆస్తులపై ఉన్న శ్రద్ధ మైనారిటీల సంక్షేమంపై లేదు.
• వేలకోట్ల వక్ఫ్ ఆస్తులను వైసీపీ నేతలు యథేచ్చగా కబ్జా చేస్తున్నారు.
• టిడిపి అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాల్నీ అమలుచేస్తాం.
• దుల్హాన్ పథకాన్నీ ఎటువంటి కొర్రీలు లేకుండా పేద ముస్లింలదరికీ వర్తింపజేస్తాం.
• ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసి ముస్లింల ఆర్థిక స్వావలంబనకు కృషిచేస్తాం.
• ఇల్లులేని ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం.

నారా లోకేష్ ను కలిసిన తుక్కులూరు గ్రామ దళితులు

• నూజివీడు నియోజకవర్గం తుక్కులూరు గ్రామదళితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో ఎస్సీలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
• మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు.
• డ్రైనేజీలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు.
• ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేసి మాకు ద్రోహం చేశారు.
• సాంఘిక సంక్షేమ హాస్టల్ తొలగించారు. గురుకుల పాఠశాలలో వసతులు లేవు.
• ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు.
• ఎస్సీ, ఎస్టీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
• మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• ఎన్నికల సమయంలో నా ఎస్సీలంటూ దళితులపై కపటప్రేమ ఒలకబోసిన ముఖ్యమంత్రి ఏరుదాటాక తెప్పతగలేసిన చందంగా వ్యవహరిస్తున్నారు.
• నాలుగేళ్లుగా దళితులకోసం ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టని జగన్, గతంలో మేం అమలుచేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దుచేశారు.
• దళితులకు చెందాల్సిన ఎస్సీ రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు.
• చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా దళితుల భూమి విస్తీర్ణం తగ్గిపోయింది.
• పేదదళితుల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమలుచేసిన అంబేద్కర్ విదేశీవిద్య పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో నిర్వీర్యం చేశారు.
• తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు, హత్యలు చేయడం నిత్యకృత్యంగా మారింది.
• టిడిపి అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం రద్దుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తాం.
• ఎస్సీలకు పక్కా ఇళ్లు, దళితవాడల్లో డ్రైనేజీలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
• ఎస్సీ, ఎస్టీలపై జగన్ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులన్నీ ఎత్తేస్తాం.

వేంపాడు గ్రామ సమస్యలు విన్న లోకేశ్

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 194రోజుకు చేరుకుంది. శుక్రవారం నూజివీడు నియోజకవర్గం మీర్జాపురం క్యాంప్ సైట్ నుంచి 194వ రోజు పాదయాత్ర నారా లోకేష్ ప్రారంభించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 194రోజుకు చేరుకుంది. శుక్రవారం నూజివీడు నియోజకవర్గం మీర్జాపురం క్యాంప్ సైట్ నుంచి 194వ రోజు పాదయాత్ర నారా లోకేష్ ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా యువనేతను వేంపాడు గ్రామస్తులు కలిశారు. నూజివీడు నియోజడకవర్గం గొల్లపల్లి శివారు వేంపాడు గ్రామస్తులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

తమ గ్రామ అగ్రహారంలో 3,356.23 ఎకరాల ఈనాం భూములు ఉన్నాయని.. గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో 5 గ్రామాలకు చెందిన 1,350 మందికి చెందిన భూములు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. తమ గ్రామం నేటికీ సర్వే సెటిల్ మెంట్‌కు నోచుకోలేదని తెలిపారు. గ్రామ భూ సమస్యలపై స్థానికేతర భూస్వాములు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారని చెప్పారు. రైతులను ఇబ్బందులు పెడుతున్న జీఓలు 79, 102 లను రద్దు చేయించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వేంపాడు గ్రామ భూ సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు వినతి చేశారు.

నారా లోకేష్ స్పందిస్తూ.. ఈనాం భూములకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సమస్యలున్నాయన్నారు. కేసులు కోర్టుల్లో ఉండి న్యాయపరమైన చిక్కుల కారణంగా దీర్ఘకాలంగా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈనాం భూములకు సంబంధించి అధ్యయనం చేసి సముచితమైన నిర్ణయం తీసుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE