– సీఎం ,మంత్రులు అందరూ జూబ్లీ హిల్స్ మీద దృష్టి పెట్టారు
– ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు జూబ్లీ హిల్స్ లో రౌడీ లతో కలిసి ఓటర్లను బెదిరిస్తున్నారు
– ఓ మంత్రి తన జన్మ దిన వేడుకల్లో బిజీ గా ఉన్నారు
– మక్కల పై ఇదేమి పాలసీ ?
– బందిపోట్ల లా సీఎం మంత్రులు రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారు
– బ్రిడ్జి ను రిపేర్ చేయని అసమర్ధుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
– ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు,
హైదరాబాద్: రెండు రోజులుగా మొoథా తుఫాన్ వల్ల రాష్ట్రం లో అనేక జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. అన్ని రకాల పంటలు భారీ గా దెబ్బతిన్నాయి. పశువులు , గొర్రెలు , మేకలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. రోడ్లు అనేక చోట్ల తెగిపోయాయి. సీఎం, మంత్రులకు ఈ నష్టం గురించి తెలుసా తెలియదా ?
ఇంత నష్టం జరిగినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. మొక్క జొన్న పంటను ఆరున్నర లక్షల ఎకరాల్లో సాగు అవుతుంది. నాలుగు లక్షల ఎకరాల్లో మొక్క జొన్న దెబ్బతిన్నది. మొక్క జొన్న ఎకరాకు 30 క్విoటాళ్ల పంట పండుతుంది. ప్రభుత్వం మాత్రం ఎకరాకు 18 క్విoటాళ్ళ తీసుకుంటామంటోంది. కౌలు రైతుల నుంచి పంట కొనుగోలు చేసేది లేదంటున్నారు.
మక్కల పై ఇదేమి పాలసీ యో అర్థం కావడం లేదు. వెంటనే రైతులు పండించిన పంటనంతా కొనుగోలు చేయాలి. క్వింటాల్ కు 2400 రూపాయలు మద్దతు ధర మక్కలకు ఇవ్వాల్సి ఉండగా 1800 కూడా రావడం లేదు. 11 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేస్తామని చెప్పి 11 వేల టన్నులు కూడా కొనుగోలు చేయలేదు.సోయాబీన్ కూడా ఒక క్వింటాల్ కూడా కొనుగోలు చేయలేదు.
పత్తి రైతుల భాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తేమ శాతం 11 కు తగ్గించడం వల్ల ఏ రైతు పత్తి పంటను కొనుగోలు చేయడం లేదు. తేమ శాతం 17 ఉన్నా కొనుగోలు చేసేలా సీసీఐ ని రాష్ట్రప్రభుత్వం ఒప్పించాలి. ఇక వరి ధాన్యం విషయం లో నాలుగు వేల కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరవలేదు.
చాలా మంది మిల్లర్ల తో ఇంకా కొనుగోలు ఒప్పందాలు కూడా జరగలేదు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేక ధాన్యం తడిసి పోయింది. కనీస సౌకర్యాలు కల్పించడం లో ప్రభుత్వం విఫలం అయ్యింది. జనగాం జిల్లా నర్మెట్ట లో 80 మేకలు వరదల్లో కొట్టుకుపోయాయి. .ఇంత జరుగుతున్నా సీఎం, మంత్రుల్లో చలనం లేదు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని లేదు. గత సంవత్సరం నష్టపోయిన పంటలకు రైతులకు ఇంకా నష్ట పరిహారం ఇవ్వలేదు.
సీఎం సినిమా వాళ్ళ తో చిందులు వేస్తున్నారు. సీఎం ,మంత్రులు అందరూ జూబ్లీ హిల్స్ మీద దృష్టి పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు వరద భాధిత ప్రాంతాల్లో పర్యటించకుండా జూబ్లీ హిల్స్ లో రౌడీ లతో కలిసి ఓటర్లను బెదిరిస్తున్నారు. ఓ మంత్రి తన జన్మ దిన వేడుకల్లో బిజీ గా ఉన్నారు. చివరకు ఆ మంత్రి సమ్మక్క సారక్క దేవాలయ అభివృద్ధి పనుల టెండర్ల ను కూడా వదలలేదు. మంత్రులు టెండర్లు దక్కించుకోవడం లో బిజీ గా ఉన్నారు.
ప్రజా సంపదను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్ల కు దోచిపెట్టడం లో ఈ ప్రభుత్వం తలమునకలైంది. రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండా వేరే పనులకు ఈ ప్రభుత్వం ఖజానా ను ఖాళీ చేస్తోంది. బందిపోట్ల లా సీఎం మంత్రులు రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారు. జనగాం ల 95 లక్షలతో పూర్తయ్యే గానుగ పాడు బ్రిడ్జ్ ను రిపేర్ చేయని అసమర్ధుడు కోమటి రెడ్డి వెంకట రెడ్డి.
భద్రాచలం లో వరదలు వస్తే ముఖ్యమంత్రిగా కేసీఆర్ అక్కడికి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం,మంత్రులు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గం మధిరలో ప్రజలు ఆందోళనకు దిగారు. భట్టి మధిరలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భట్టి మధిరకు చేసింది ఏం లేదు. ఇంకో ఖమ్మం జిల్లా మంత్రి బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఖమ్మం జిల్లాకు పేరుకే ముగ్గురు మంత్రులు.
ఖమ్మం జిల్లా ఇంఛార్జి మంత్రి ఎవరో మాకు తెలియదు. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులతో ఇంఛార్జి మంత్రి మాట్లాడాలంటే వీళ్ళ
అపాయింట్మెంట్ తీసుకోవాలి. రివ్యూ చేయలేని పరిస్థితుల్లో జిల్లా ఇంఛార్జి మంత్రి ఉన్నారు. సీసీఐ వ్యాపారులతో కుమ్మక్కు అయింది. సీఎం రేవంత్ రెడ్డితో కమ్మ సామాజిక వర్గం నేతల మీటింగ్ పై రేపు క్లారిటీ ఇస్తాము. ప్రెస్ మీట్ లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రామచంద్రు నాయక్ ,పల్లె రవి కుమార్ ,బీ ఆర్ ఎస్ వి ఉపాధ్యక్షుడు తుంగ బాలు పాల్గొన్నారు.