అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మనమంతా ఏకమయ్యామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. భీమవరంలో జరుగుతున్న సభలో ప్రధాని మోదీని జగన్ సత్కరించారు. ప్రధానికి విల్లంబు, సీతారాముల పటాన్ని బహూకరించారు. సభావేదికపై మోదీ, జగన్ లతో పాటు గవర్నర్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి రోజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సినీ నటుడు చిరంజీవి తదితరులు ఆశీనులయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఒక మనిషిని ఇంకొక మనిషి, ఒక జాతిని మరొక జాతి, ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని చెప్పారు. అల్లూరి సీతారామరాజు ఒక అగ్నికణమని కొనియాడారు. ఆయన తెలుగుగడ్డపై పుట్టడం మనందరి అదృష్టమని చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారని తెలిపారు.
అల్లూరి ఘనతకు గుర్తింపుగానే ఆయన పేరిట ఓ జిల్లా ఏర్పాటు
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఘనతను గుర్తించుకుని ఆయన పేరిట ఓ జిల్లాను ఏర్పాటు చేశామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పోరాట యోధుల్లో అల్లూరి మహా అగ్ని కణమని కూడా ఆయన పేర్కొన్నారు.లక్షలాది మంది త్యాగ ఫలమే నేటి భారత దేశమని జగన్ అన్నారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ఆయన పేర్నొన్నారు. అల్లూరి తెలుగు జాతికే కాకుండా భారత జాతికి కూడా గర్వకారణమని చెప్పారు. అల్లూరి త్యాగం ప్రతి మనిషి గుండెలో చిరకాలం నిలిచిపోతుందని జగన్ తెలిపారు.
పోరాట యోధులలో మహా అగ్నికణం అల్లూరి సీతారామరాజు. భావాల పరంగా మరణం లేని ఓ విప్లవవీరుడు. తెలుగుజాతికి, దేశానికి గొప్ప స్ఫూర్తి ప్రధాత. అల్లూరి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టే… ఆయన నడయాడిన గడ్డకు మనందరి ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టింది: సీఎం pic.twitter.com/t7KWxH7ROO
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 4, 2022