Suryaa.co.in

Andhra Pradesh

డర్టీ ఎంపీపై చర్యలేవి ముఖ్యమంత్రి?

– సీఐడీ చీఫ్ సునీల్ సంబంధం లేకుండా మాట్లాడి పరువు తీసుకుంటున్నాడు
– టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్

టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా.విజయ్ కుమార్ తో కలిసి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ… ‘‘పార్లమెంటుకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్ దేశం పరువు తీశాడని రాష్ట్ర ప్రజలందరూ బాధపడుతున్నారు. సంఘటన జరిగి 15రోజులు గడిచినా నేటికి ముఖ్యమంత్రి నోరు విప్పకపోగా డర్టీ ఎంపీని కాపాడే ప్రయత్నం చేయడం బాధాకరం.

కులాల పేరుతో బూతులు తిట్టి, 73ఏళ్ల వయసున్న మాజీ ముఖ్యమంత్రిని బూతులు తిట్టి, మీ ఇంటికొచ్చి విడియో చూపిస్తాను అన్న ఎంపీని కాపాడటం కోసం ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ మాట్లడటం సిగ్గు మాలిన చర్య. దేశ ప్రజలంతా అసహ్యించుకుంటున్నా, రాష్ట్ర మహిళలు ఆత్మ గౌరవం నాశనం అయిపోయినా, అనేక నిరసనలు వ్యక్తమవుతున్నా సిగ్గు, లజ్జ లేకుండా మాధవ్ బరితెగించి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.
15 రోజులుగా సిగ్గు మాలిన పని చేశాడు అనే ఆలోచన లేకుండా సంస్కారాన్ని, సంప్రదాయాల్ని సర్వ నాశనం చేసిన డర్టీ ఎంపీని కాపాడటానికి చేసిన ప్రయత్నాలకు అత్యంత విలువైన చట్టాన్ని కూడ ఉపయోగించడం దారుణం. మీడియా సమావేశం పెట్టి ఎంపీ గురించి మాట్లాడిన సీఐడీ చీఫ్ సునీల్ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత దళితులు, బిసి వర్గాలు, యువకుల మీద అనేక సంఘటనలు జరిగాయి. జరిగిన సంఘటనలు మీద సునీల్ న్యాయం, అన్యాయాలు గురించి మాట్లాడలేదు.

దోషులను పట్టుకోవడానికి ప్రణాళికలు సిద్థం చేస్తున్నట్టు, దోషులను పట్టుకుంటామని ఎన్నడూ చెప్పలేదు. అటువంటి వ్యక్తి మీడియా సమావేశం పెట్టి తన పరువు తీసుకొనే పని మాత్రమే చేశారు. గతంలో తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చిన దాఖలాలు లేవు. తప్పుల్ని సరి చేసుకొని న్యాయం పరంగా ముందుకు వెళ్లిన చరిత్ర కూడ లేదు.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరి మీద దాడులు జరుగుతున్నప్పుడు, కులం పేరుతో దూషిస్తున్న సందర్భంలో న్యాయం కోసం కోర్టులని ఆశ్రయించినప్పుడు కోర్టులు కూడ ప్రభుత్వానికి మెట్టి కాయలు వేయడం జరిగింది. సిఐడి, ఆంధ్రప్రదేశ్ లోని పోలిసులు ఎక్కడికి వెళ్లారు. మాకు కులాన్ని, వర్గాన్ని ఆపాదించి దూషిస్తున్న వారి మీద సిఐడి ఇంత వరకు కేసు పెట్టలేదని కోర్టు దూషించినప్పటికి సునీల్ బయటికొచ్చి మాట్లాడిన సందర్భం లేదు, దోషులు మీద చర్యలూ లేవు.

సునీల్ దళిత అధికారిగా నీతి, నిజాయితిగా ఉండాలన్నారు. గతంలో అనేక మంది దళితులు ఆ జాతికి, పదవికి, న్యాయానికి పేరు తీసుకొచ్చే విధంగా పని చేశారు. గతంలో కాకి మాధవ్ రావు చీఫ్ సెక్రటరీ, అర్జున్, గోపాల్, రత్నప్రభ, కత్తి చంద్రయ్య ఇటువంటి పెద్ద పెద్ద అధికారులంతా దళితుల పక్షాన, న్యాయం వైపు నిలబడ్డారు. న్యాయ పరంగా అధికారం చెలాయించారు. నేడు సునీల్ ఏం చేస్తున్నారని, ఎవరి ప్రయోజనాల కోసం మీడియా సమావేశం పెట్టారు?

ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వాస్తవం అవునా, కాదా? అని తేల్చాల్సిన వారు ఎందుకు మౌనంగా చూస్తున్నారు. ఆ వీడియో మీద ఉన్న ఆరోపణలను నివృత్తి చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారు? మాధవ్ మాట్లాడుతూ తన పరువు తీసే విధంగా కొంత మంది కావాలనే ప్రతి పక్ష నాయకులకి సంబంధించిన వారు, కమ్మ కులానికి చెందిన వారు ఆ పని చేశారని దూషించినప్పుడు సునీల్ ఎందుకు బయటకి రాలేదు?

నిజంగా తప్పు చేయకపోతే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎందుకు మాట్లడలేదు. ఫిర్యాదు చేస్తానన్న ఎంపీ నేటి వరకు ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదు? ఫిర్యాదు ఇవ్వకుండానే ఎస్పీ ఫకీరప్పతో ఎందుకు మాట్లాడించారు? పోలీసులు, చట్టం యొక్క పరువుని ప్రతి సందర్భంలో తీస్తున్నారు. రాష్ట్రంలో అనేక సందర్భాలలో పరువు తీసేలా ప్రవర్తించినట్టు సాక్ష్యాధారాలతో ఉన్నాయి. చిన్న సంఘటనల జరిగితేనే వాళ్ల దగ్గరున్న ఫోన్లని తీసుకుంటారు. వాళ్ల కుంటుంబ సభ్యులని పోలిసు స్టేషేన్లకి తీసుకెళ్లి విచారిస్తున్నాం అని చెబుతారు. ఎంపీ నగ్నంగా విడియో చేస్తే అతనిని నేటికి ఎందుకు విచారించలేదు?

ప్రతిపక్ష తెలుగాదేశం పార్టీగా, రాష్ట్ర ప్రజలకు నిరంతరం అండదండలుగా ఉండే వాళ్లంగా ప్రతి సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నాం. ఎంపీ వీడియో వెంటనే కేంద్రంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా ఎందుకు పంపించలేదు?ముఖ్యమంత్రి ఎంపీ వీడియో విషయంలో చాలా కోపంగా ఉన్నారు. అది ఎంపీదే అని తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పిన సకలశాఖ మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? వీడియోని ఆంధ్రప్రదేశ్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారా? రిపోర్టులు వచ్చాయా? ఎక్కడా మీరు పంపిన దాఖలాలు లేవు.

వైసీపీకి చెందిన ఎస్పీ వచ్చి అతనే నిపుణుడిలా రిపోర్టు ఇచ్చినట్టు వీడియో డూప్లికేట్ కాబట్టి చర్యలు తీసుకోలేం అని మాట్లాడారు. డూప్లికేట్ కి కాపీకి తేడా తెలుసా మీకు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి తేడా తెలియదని మీరు అనుకుంటున్నారా? ఒక్క సినిమా తీస్తే దాన్ని వందల, వేల కాపీలు తీస్తారు. అంతమాత్రాన అవన్నీ డూప్లికేట్ కాదు కదా? కాపీలు అయినంత మాత్రాన ఒరిజినాలిటీ పోదు. ఎంపీ వీడియో ఎన్ని ఫోన్లలో తీసినా కాపీ అవుతుంది కాని మార్ఫింగ్ కాదనే విషయం సునీల్ కు తెలియదా? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా అనంతబాబు హత్య చేశాడు. అతని శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పడు కూడా సునీల్ బయటికి రాలేదు. దళిత డ్రైవర్ ను హత్య చేశారు, నిజాల్ని నిగ్గు తేలుస్తాం, దోషులను పట్టుకుంటాం అని నాడు మాట్లాడిన పరిస్థితి ఉందా?

చీరాల సునీల్, చిత్తూరులో యువకుడ్ని చంపినపుడు ఏం చేశారు? ఏపిలో అనేక మంది దళిత ఆడబిడ్డల మీద అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు సిఐడి ఎక్కడికి వెళ్ళింది. దళిత అధికారి భ్రహ్మాండంగా పని చేస్తున్నారని గర్వంగా చెప్పుకునేలా ఉండాలన్నారు. జగన్ రెడ్డి ఏమైనా శాశ్వత ముఖ్యమంత్రా సునీల్? జగన్ రెడ్డి శాశ్వతంగా సీఎంగా ఉన్నా నిన్ను శాశ్వతంగా సీఐడీ చీఫ్ గా ఉంచుతారని అనుకుంటున్నారా? ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ రాసిన రాజ్యంగంలో ప్రతి ఐదేళ్లకి ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వాలు మారతాయి. నేడు ఎవరి కోసం పని చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు మీ పోకడలని గమనించలేదనుకుంటున్నారా.

అమెరికాలో ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొచ్చి అబద్దం అని నిరూపించే ప్రయత్నం చేస్తారా? దేశం దాటి ప్రపంచమంతటా మీరు ఇదే పనులు చేయదలుచుకున్నారా? వైసీపీ నాయకుడు దళితులు మీద దాడులు చేసినప్పుడు, ఎమ్మేల్యే వేరే వారిని తిట్టినప్పుడు, మంత్రులు కొట్టినప్పుడు బాధితుల్ని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టలేదు, తిట్టలేదు, మా అమ్మాయిని చంపలేదు, రేప్ చేయలేదు అని చెప్పిచ్చినట్టు అదే ప్రయత్నం చేయాలని చూస్తున్నారా?

వైసీపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసినప్పుడు అతని ఫోన్ ఎందుకు లాక్కున్నారు? ఆ ఫోన్ లో ఉన్న డేటాని ఎందుకు డిలేట్ చేశారు? మాజీ ఐఏఏస్ అధికారి ఫోన్ ని ఎందుకు లాక్కొన్నారు? సోషల్ మీడియాలో చిన్న పోస్టును పెడితేనే వారిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఫోన్లని లాక్కొంటారు. నేటికి డర్టీ మాధవ్ ఫోనుని ఎందుకు సీజ్ చేయలేదు? నేషనల్ మహిళా కమిషన్ ఎంపీ న్యూడ్ వీడియోని కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపి రిపోర్టుని ఇవ్వమని స్పష్టంగా చెప్పి 15 రోజులు గడిచినా నేటికి ల్యాబ్ కి ఎందుకు పంపించలేదు? ఎందుకు సమాధానం చెప్పలేదని అడిగారు.

దోషిని కాపాడటానికి ఇంత నీచానికి దిగజారుతున్న రాష్ట్రంలో మీ పరువు ఏం అవుతుంది? రాష్ట్రంలో మహిళల పరవు తీసిన వ్యక్తిని ఊరేగింపులతో తీసుకెళుతుంటే అతన్ని చూస్తే ఎవరికైనా గుర్తుకొచ్చేది అతని న్యూడ్ వీడియో. అటువంటి వ్యక్తి కోసం స్వయంగా ముఖ్యమంత్రి ఏ ప్రయోజనాల కోసం రంగంలోకి దిగారు? జగన్ రెడ్డిని నమ్ముకున్న అధికారులకి ఏ గతి పట్టింది? శ్రీలక్ష్మి లాంటి అధికారులకి, వై.యస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో పనిచేసిన అధికారులంతా కూడా జైలుకి వెళ్లిన సంగతి మర్చిపోయారా?

నేడు తడుముకుంటూ అక్షరాలని పేర్చుకుంటూ మాట్లాడుతుంటే సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి. జగన్ రెడ్డి వల్ల రాష్ట్రంలో దళితులకి, దళిత అధికారులకి కళంకం వస్తుంది. తనని నమ్ముకుంటే అధికారులు జైలుకు వెళ్ళే పరిస్ధితి వస్తుందని స్వయంగా సీనియర్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ అన్నారు.
రాష్ట్రంలో పోతున్న పరువుని ప్రతిక్షణం కాపాడే విధంగా, బాధితుల పక్షాన అండగా ఉండి పోరాటాలు చేస్తున్న ప్రతి పక్షాల మీద కేసులు పెడతారు. హత్యకు గురైన వారికి న్యాయం చేయాలి కాని హత్య చేసిన వారి గురించి మాట్లడితే కేసులు పెట్టి బొక్కలో తోస్తాం అన్న రీతిలో నిన్న పెట్టిన మీడియా సమావేశం ఉంది. ఎవరిని బెదిరిస్తారు, ఎవరి మీద తప్పుడు కేసులు పెడతారు?

గతంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర మీద తప్పుడు కేసులు పెట్టలేదా? ఇలా పెడితే ఇంకొక కేసు పెడతారు అంతకన్నా మీరు ఇంకేమి చేయగలుగుతారు. మీరు ఇక్కడ తప్పు పని చేస్తే కోర్టులో మీ అంతు తేలుస్తాం. దమ్ముంటే పట్టాభి మాట్లాడిన మాటల్ని, ఆయన ఇచ్చిన రిపోర్టులను, ప్రతి పక్షాలు చేసిన ఆరోపణలను దమ్ముంటే సునీల్ కోర్టుకి తీసుకెళ్లాలి. కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపి రిపోర్టుని తీసుకురావాలి.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాత్రమే కాదు, మంత్రులు ఉంటారు. ఏ శాఖలకు సంబంధించిన పనులు ఆ శాఖా మంత్రులు చూస్తారు. అదే విధంగా ఏ వ్యవస్థ వాటికి సంబంధించిన పనులని చేయాలన్నారు. న్యూడ్ వీడియో చేసిన వారిని వదిలేసి ఆరోపణలు చేసిన వారిని అరెస్టులు చేయాలని చూస్తారా?ముఖ్యమంత్రి ఆడుతున్న ఆటలో భాగంగా, అతని మాటలకి బయపడి సునీల్ ప్రెస్ మీట్ పెట్టారు. జగన్ రెడ్డి మాధవ్ కి బయపడుతున్నట్టు అర్ధమవుతుంది. జగన్ రెడ్డికి ధైర్యం ఉంటే మాధవ్ మీద చర్యలు తీసుకోవాలి.

ఒకవేళ చర్యలు తీసుకుంటే అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ మీద చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తారని, ప్రజలు ఎదురు తిరుగాతారని జగన్ రెడ్డి బయపడి చర్యలు తీసుకోవడం లేదు. జగన్ రెడ్డి తప్పుడు నిర్ణయాలని చట్టం ముసుగులో ప్రెస్ మీట్లు పెట్టి కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల పరువు, ప్రతిష్ట పోతుంది. మీ ఉద్యోగ జీవితంలో మచ్చ పడుతుంది. సీఐడీ సునీల్ ఇప్పటికైనా మాధవ్ మీద చర్యలు తీసుకోవాలి. నీచపు మాధవ్ ని తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విడిచి పెట్టరు.
అతనిని కాపాడుకోవాలని అనుకొనే వారు బురదలో పడే పరిస్థితి ఉందన్నారు. ఎంపీ గురించి నీచంగా మాట్లాడతారా అన్న కొడాలి నాని, పేర్ని నాని, తదితరులు బూతులు పంచాంగాన్ని ఆంధ్రప్రదేశ్ కి చూపించిన మీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నీతులు మాట్లాడుతున్నరు. మీ పాపాల పుట్ట పగిలే పరిస్థితి వచ్చింది’’ అన్నారు.

పుచ్చ విజయ్ కుమార్ మాట్లాడుతూ….
‘‘రాష్ట్రంలో రౌడీ పరిపాలన జరుగుతోందని, ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో బయటకొచ్చి 18 రోజులు గడిచినా చర్యలు ఎందుకు తీసుకోలేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ ప్రశ్నించారు. తప్పుడు పని చేసి అడ్డంగా దొరిపోయిన గోరంట్ల మాధవ్ ని ముఖ్యమంత్రి ఎందుకు సమర్ధిస్తున్నారు? ఇంతరకు చర్యలు తీసుకోకుండా, అతన్ని బర్తరఫ్ చేయకుండా ఎందుకు కొనసాగనిస్తున్నారు. సీఐడీ చీఫ్ సునీల్ కి ఎంపీ పై ఉన్న ప్రత్యేక శ్రద్ధ ఏంటి? అసలు మీడియా సమావేశం పెట్టి మాట్లడటానికి మాధవ్ సునీల్ కుమార్ కి కంప్లైంట్ ఇచ్చారా? ఎక్లిప్స్ పోరెనిక్స్ ల్యాబ్ ప్రతినిధి జిమ్ స్టాఫర్ట్ ఇచ్చిన రిపోర్టులో ‘‘I found that the video provided was authentic and unedited’’ అని ఉంది. సునీల్ నీకు ఇంగ్లీష్ వచ్చా? చదివిన దాంట్లో రిపోర్టు ఏం ఇచ్చారని తెలియకుండా మాట్లాడారు. ఒరిజినల్ వీడియో రిపోర్టుల్ని బయట పెట్టకుండా, ఫేక్ రిపోర్టులని బయట పెట్టి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? జగన్ రెడ్డి వత్తాసు పలుకుతున్నారా.

దళిత సీఐడీ అధికారిగా ఉండి జగన్ రెడ్డి కాళ్ల దగ్గర పని చేయడాన్ని చూసి సాటి దళితులుగా సిగ్గు పడుతున్నాం. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఉన్న బాధితురాలిని పరామర్శించడానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడుకి నోటిసులు ఇచ్చిన మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎందుకు నోరు విప్పడం లేదు? పార్లమెంటులో మహిళా ఎంపీలు సిగ్గుతో తలదించుకొనే విధంగా జగన్ రెడ్డి తీరు ఉంది. డర్టీ ఎంపీ మాధవ్ పై కర్నూలులో ఐపిసీ సెక్షన్ 302, 307, 506 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గుడు జగన్ రెడ్డి కాపాడాలనుకుంటున్నారా? దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ని విశాఖపట్నంలో బట్టలు విప్పి నడిరోడ్డు పై పోలిసులు కొడుతుంటే జగన్ రెడ్డి ఏం చేశారు? దళిత ఐపీఎస్ అధికారిగా ఉండి తెలుగుదేశం నాయకులు సోషల్ మీడియాలో పోస్టలు పెడుతున్నారని తెల్లవారు జామున వారిని అరెస్టులు చేసి వాళ్ల మీద కేసులు పెడుతుంటే నాడు సునీల్ కుమార్ ఏం చేశారు?

అధికార పార్టీలో ఉన్న మీరు చేయాల్సిన పనిని మేము చేస్తూ ఎంపీ విడియోని ఫోరెన్సీక్ ల్యాబ్ కి పంపించి రిపోర్టుని తీసుకొస్తే ఫేక్ అని డ్రామాలాడుతున్నారు. వీడియోని ఎందుకు కేంద్ర ఫోరెన్సీక్ ల్యాబ్ కి పంపించడం లేదు? అరగంట అవంతి శ్రీనివాస్ వాయిస్ రికార్డ్ బయటికి వచ్చి 6 నెలలు గడిచింది. మసాజ్ ఒకటే చేస్తాదా అన్న అంబటి రాంబాబు వాయిస్ రికార్డ్ ఉంది. దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని చంపి కారు డిక్కిలో పెట్టిన అనంతబాబు లాంటి వారిని కాపాడుతారా జగన్ రెడ్డి? ఎస్టీ, ఎస్టీల పైనే అట్రాసిటీ కేసులు పెట్టిన చరిత్ర ముఖ్యమంత్రిది. ఎస్టీ, ఎస్టీల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాన్ని దుర్వనియోగం చేస్తున్నారు.

మహిళా పక్షపాతి అని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి మహిళా ద్రోహి. రిపోర్టులన్నీ డర్టీ ఎంపీ వీడియో ఒరిజినల్ అని చెబుతున్నా అతన్ని బర్తరఫ్ చేయకుండా కాపాడుతున్నారు. బట్టులు లేకుండా తిరుగుతున్న వైసీపీ ఐటమ్ రాజాలు, కామాందులకు బట్టలు పంపిస్తున్నాం. వాళ్లను కట్టుకోమని జనగ్ రెడ్డి చెప్పాలి. 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిస్ధితులు ఏ విధంగా ఉంటాయో రాష్ట్రంలో కనపడుతుంది. జగన్ రెడ్డది చెప్పినట్టు విని ఐపియస్, ఐఏయస్ అధికారులు తమ సర్వీస్ లో మచ్చ తెచ్చుకోవద్దు. గౌతమ్ సవాంగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం లను అన్నా అంటూ పిలిచిన జగన్ రెడ్డి వారిని ఏవిధంగా వాడి పడేశారో చూశాం. నేడు వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్ధతి.

సునీల్ లాంటి అధికారులు అత్యుత్సాహంతో జగన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి అనుకొని పని చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతుంటాయని వారు గుర్తుపెట్టుకోవాలి. అధికారుల్ని జైలుకి పంపిన జగన్ రెడ్డి గత చరిత్రను అధికారలు గుర్తు చేసుకోవాలి. సునీల్ కుమార్ అత్యుత్సాహంతో రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి పాలన చేస్తున్నట్టు లేదు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆర్డర్స్ తో పాలన నడుస్తోంది. వీడియో కాల్ చేసిన వ్యక్తి, మాట్లాడిన మహిళ దగ్గర మాత్రమే ఒరిజినల్ వీడియో ఉంటుంది. ఎంపీ ఫోన్ ని ఎందుకు సీజ్ చేయడం లేదు.

తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితమైన జగన్ రెడ్డి, అతని మంత్రులు మానసిక రోగంతో బాధపడుతున్నారా. ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడట్లేదు. ఎంపీని బర్తరఫ్ చేసే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది. అవగాహన లేకుండా మంత్రులు రోజా, తానేటి వనిత తాడేపల్లి నుంచి వచ్చిన స్రీప్ట్ మాట్లాడతారు. దళితుల మీద జరుగుతున్న దాడులని ఖండించలేని సునీల్ కుమార్ కి పదవి అవసరమా, వెంటనే రాజీనామా చేయాలి. మాధవ్ న్యూడ్ వీడియో నుంచి తప్పించునేందుకు కులాల మద్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం సిగ్గుచేటు. ఎంపీ సిగ్గులేకుండా పార్లమెంట్ కు ఏ మెహం పెట్టుకుని వెళ్తారని పుచ్చా విజయ్ కుమార్ నిలదీశారు.

LEAVE A RESPONSE