సీఎం ప్రకటన హైకోర్టు దిక్కరణే

– కాల్ డేటా వివరా‌లు వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే
– ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

అనంతపురం: సీఎం జగన్ విశాఖ రాజధాని ప్రకటన వెనుక అనేక కారణాలు. వివేకానంద హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతో ఉన్నపళంగా సీఎం విశాఖ రాజధాని ప్రకటన.హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడిన అంశం కీలకంగా మారింది. ఆ కాల్ డేటా వివరా‌లు వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం విశాఖ రాజధాని ప్రకటన.ఏపీ రాజధాని అమరావతి అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు లో వేసిన అప్పీల్ పెండింగ్ లో ఉంది. ఇలాంటి సమయంలో సీఎం ప్రకటన హైకోర్టు దిక్కరణే అవుతుంది.

Leave a Reply