Home » ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలను కలెక్టర్లు…కిందిస్థాయి అధికారులు ఖాతరు చేయడం లేదు

ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలను కలెక్టర్లు…కిందిస్థాయి అధికారులు ఖాతరు చేయడం లేదు

– ప్రతిపక్షాలు..ప్రజల విజ్ఞప్తుల్ని కూడా బుట్టదాఖలు చేస్తున్నారు
• అధికారపార్టీ అండతో తప్పులు చేస్తున్న కిందిస్థాయి ప్రభుత్వ సిబ్బంది.. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిపై కఠినచర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరాం
• చాలాచోట్ల జిల్లా కలెక్టర్లు ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలను అమలు చేయడం లేదు
• ఇప్పటివరకు ఎన్ని ఆదేశాలు ఇచ్చారు…ఎన్ని అమలయ్యాయి..తప్పుచేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశాలపై దృష్టిపెట్టి కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరాం
• అనేకసార్లు ఎన్నికల ప్రధానాధికారికి ఓటర్లజాబితాలో జరుగుతున్న అవకతవకలు.. దొంగఓట్ల నమోదు.. అర్హుల ఓట్ల తొలగింపు వంటి వాటిపై ఫిర్యాదు చేశాం
• రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు అమలుకాకపోతే.. రాష్ట్రంలోని పరిస్థితుల్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
– రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు

ఎన్నికల ప్రధానాధికారిని కలిసినవారిలో టీడీపీనేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంఏ.షరీఫ్, వర్ల రామయ్య, పరుచూరి అశోక్ బాబు, పిల్లి మాణిక్యరావు తదితరులు ఉన్నారు.

ప్రజలు తమపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పసిగట్టిన జగన్ రెడ్డి అతని ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అవకతవకలకు తెరలేపిందని, దొంగఓట్లు సృష్టించడం.. అర్హుల ఓట్లు తొల గించడం అనే తంతుని నిరంతరం కొనసాగిస్తున్నారని, ప్రత్యేకంగా దొంగఓట్ల కోసమే జగన్ రెడ్డి వాలంటీర్లు, సచివాలయవ్యవస్థను ఏర్పాటుచేసినట్టు కనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ నేతలతో కలిసి, రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఏపీ ఎన్నికల కమిషనర్ ను కలిసిన అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఉపాధ్యాయులు.. కొందరు ప్రభుత్వాధికారులు ఎన్నికల వ్యవస్థలో కీలకంగా పనిచేసేవారు. కానీ జగన్ రెడ్డి ఒక దుర్భుద్ధితో వాలంటీర్.. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు. ఆ వ్యవస్థలు ఎన్నికల ప్రక్రియలో వేలు పెట్టడం.. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడటం రివా జుగా మారింది. ఈ మాట మేం అనడం లేదు.. అన్నిపార్టీలు .. ప్రజలే అంటున్నారు. మీడియాలో వచ్చే కథనాలు కూడా ప్రజల అభిప్రాయాన్ని ధృవీకరిస్తున్నాయి.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చెట్టుకి ఓటుహక్కు కల్పించారు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక చెట్టుని ఓటర్ల జాబితాలో ఓటు హక్కు ఉన్న వ్యక్తిగా ఈ ప్రభుత్వం చిత్రీకరించింది. ఒక్కో వ్యక్తికి మూడు, నాలుగుచోట్ల దొంగ ఓట్లు కల్పించారు. సాధారణ వ్యక్తులకు కాదు.. ఏకంగా ప్రభుతపెద్దలు, మంత్రులుగా ఉన్నవారికే రెండు మూడు చోట్ల ఓట్లున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మూడుప్రాంతాల్లో ఓట్లున్నాయి. అనిల్ కుమార్ ఎవరో ఈ ప్రభుత్వానికి.. అధికారు లకు తెలియదా? ఇలాంటి అనైతిక పద్ధతుల్లో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేవలం దొంగ ఓట్లతోనే వచ్చేఎన్నికల్లో గెలవాలని జగన్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రతిపక్షాల విజ్ఞప్తులు.. ఎన్నికల సంఘం ఆదేశాలను జిల్లాకలెక్టర్లు.. కిందిస్థాయి అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు
ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియలో జరిగే తప్పులు.. ఓటర్ల జాబితాకు సంబంధిం చిన తప్పుల్ని స్థానికంగా ఉండే జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్తున్నాం. వారు స్పందించ కపోతే ఎప్పుడు వీలైతే అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కలుస్తున్నాం. కానీ పై స్థాయి నుంచి వచ్చే ఆదేశాలను జిల్లా కలెక్టర్లు బుట్టదాఖలు చేస్తున్నారు. దొంగ ఓట్లు.. అర్హులైన ఓట్లు తీసేసిన దానికి సంబంధించి ఆధారాలతో సహా కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తున్నా వారు స్పందించడం లేదు.

ఓట్ల సమస్యలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల దరఖాస్తులు పెండింగ్ లోఉంటే..వాటిని పరిష్కరించకుండా మరలా కొత్తగా ఫామ్-6, ఫామ్-7, ఫామ్-8 ఇతర వివరాలు అడగడం సరికాదు.

కొత్త ఓటర్ల చేర్పులు.. చనిపోయినవారి ఓట్లు తొలగించడం.. అదేవిధంగా ఓటర్ల జాబితాను సరిచేయడం అనేది ఎన్నికల ప్రక్రియలో చాలా కీలకం. గతంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్ చేసినప్పుడు, పైన చెప్పిన మూడు అంశాలకు సంబంధించి అధికారులు.. బీఎల్వోలు ఓటర్ల నుంచి సమాచారం సేకరించారు. కానీ గతనెలలో ఎన్నికల కమిషన్ విడుదలచేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ చూశాక ఆ సమాచారంపై క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదని అర్థమైంది. ఫామ్ -6 , ఫామ్-7, ఫామ్ -8 ల వివరాలు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో కనిపిస్తున్నాయి గానీ, ఓటర్ల జాబితా సవరణలో వాటికి సంబంధించిన మార్పుచేర్పులు కనిపించడం లేదు. 2లక్షల 9వేల ఫామ్ -6 లు దరఖాస్తు చేస్తే, ఆ వివరాలు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో నమోదయ్యాయి.

కానీ క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించిన ఓటర్ల చేర్పుల ప్రక్రియ జరగలేదు. అలానే ఫామ్ -7ల దరఖాస్తులు 5.58లక్షలు ఇచ్చాం. ఓటర్ల జాబితాలో సవరణలు సూచిస్తూ ఫామ్-8 దరఖాస్తులు 7.16లక్షల వరకు ఎన్నికల కమిషన్ కు అందించాం . అవన్నీ ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో కనిపిస్తున్నాయి.. కానీ ఆయా దరఖాస్తు సమాచారాన్ని అధికారాలు పరిగణనలోకి తీసుకోలేదని డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ చూశాక అర్థ మైంది.

తాము ఇచ్చిన దరఖాస్తులపై అధికారుల నుంచి ఎలాంటి స్పందనాలేదు. పరి గణనలోకి తీసుకున్నామని..లేదని..ఇతర కారణాలు ఏమీ చెప్పలేదు? గతంలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కరించకుండా మరలా కొత్తగా ఇంటింటికీ వెళ్లి ఫామ్-6, ఫామ్-7, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫామ్-6, ఫామ్-7 వంటి దరఖాస్తులన్నీ కలిపి ఇప్పటికే 11లక్షల వరకు పెండింగ్ లోఉన్నాయని, వాటిని పరిష్కరించకుండా మరలా వివరాలు అడగడం సరికాదని కూడా చెప్పాం.

చాలాచోట్ల ఒకేఇంటిలో ఉండేవారు.. ముఖ్యంగా భార్యాభర్తల ఓట్లను కూడా వేరేవేరే పోలింగ్ బూత్ లకు మార్చారు. అవన్నీ ఒకే బూత్ లో ఉండేలా చూడాలని మేం కోరితే… దానిపై అధికారులు ఎలాంటి కసరత్తు చేయలేదు. ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో ప్రతి బూత్.. ప్రతి వార్డ్.. ప్రతి పోలింగ్ కేంద్రం వివరాల ఉండాలి. అలానే బూత్ ల లోని ఓట్ల వివరాలు ఉండాలి. ఆ వివరాలు ఏవీ సక్రమంగా లేవు. రాష్ట్రంలోని ఓటర్ల వివరాలు మొత్తం బూత్ లవారీగా వెబ్ సైట్లో ఉంచాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరాం. డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో సర్వీస్ ఓట్లకు సంబంధించిన సమాచారం కూడా లేదని.. దాన్ని కూడా చేర్చాలని చెప్పాం.

దొంగఓట్ల నమోదు.. అర్హుల ఓట్లు తొలగింపు.. ఓటర్ల జాబితాలో తప్పులు చేస్తున్న కిందిస్థాయి అధికారులు.. వారికి సహకరిస్తున్న కలెక్టర్లపై కఠినచర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ని కోరాం
నియోజకవర్గాల వారీగా పోలైన దొంగఓట్లు.. అర్హుల ఓట్ల తొలగింపు వివరాలను కూడా ఎన్నికల కమిషన్ ముందు ఉంచాం. కానీ క్షేత్రస్థాయిలో తప్పుచేసిన అధికారులు.. ఇతరులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దాదాపు 18 నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు సరిగా లేవు. స్థానిక ఎమ్మెల్యేల ప్రోద్బలంతోనే పోలింగ్ కేంద్రాలు మార్చడం లేదు. దానిపై కూడా దృష్టి పెట్టాలని చెప్పాం. మొక్కుబడిగా ఒకరినో ఇద్దరినో సస్పెండ్ చేస్తే ఈ సమస్య పరిష్కారం కాదని.. సీరియ స్ గా వ్యవహరించాలని ఎన్నికల ప్రధానాధికారాని కోరాం. మా విజ్ఞప్తులపై ఆయన స్పందించారు. అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ ఒక్కరోజే 13లేఖలు అందించాం. గతంలో కూడా పలుమార్లు అనేక ఫిర్యాదులు చేశాం.

ఇదే విషయం ఎన్నికల కమిషనర్ తో కూడా చెప్పాం. మేం ఫిర్యాదులు ఇవ్వడం. మీరు వాటిపై కిందిస్థాయి అధికారులు..కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం చేస్తున్నారుగానీ.. పరిస్థితి ఏమీ మారడంలేదని చెప్పాం. అధికారులు మీ ఆదేశాలను పట్టించుకోవడం లేదని చెప్పాం. వైసీపీనేతల కనుసన్నల్లోనే అధికారులు, కొందరు కలెక్టర్లు పనిచేస్తున్నారని నిర్మొహమాటంగా చెప్పాం. మేం చెప్పిన దానిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ చెప్పారు.

ఏపీ ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులు… వివరాలపై త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం
ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందుంచిన అన్ని వివరాలను.. ఫిర్యాదుల్ని త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం ముందు కూడా ఉంచుతాం. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలు.. దొంగఓట్ల వ్యవహారం.. ఎన్నికల ప్రక్రియకు సంబంధిం చిన ఇతర అంశాలపై త్వరలోనే టీడీపీ ఎంపీలతో కలిసి సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు సజావుగా జరగాలన్నదే టీడీపీ అభిమతం.

ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో ఎందరు అధికారులపై..ఇతర సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పోలీస్ శాఖ నుంచి వివరాలు తీసుకోవాలని చెప్పాం. దానికి ఎన్నికల కమిషనర్ కూడా సరేనన్నారు. వైసీపీలోని పెద్దపెద్ద నాయకులే సిగ్గులేకుం డా దొంగఓట్లు చేర్పిస్తున్నారు. బూత్ లవారీగా త్వరలోనే ఆ సమాచారం కూడా ఎన్ని కల కమిషన్ ముందు ఉంచుతాం.” అని అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు.

దొంగఓట్లు ఎందుకు తొలగించరు, అర్హులకు ఎందుకు ఓటు హక్కు కల్పించరని అధికారుల్ని ప్రశ్నిస్తుంటే వెటకారంగా మాట్లాడుతున్నారు: బొండా ఉమామహేశ్వరరావు
“ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ అనేది రాష్ట్రంలో అపహాస్యంగా మారింది. ఆర్వోలు..కలెక్టర్లు చుట్టూ తిరగడమే ప్రతిపక్షాల పని అయిపోయింది. కలెక్టర్లు..కిందిస్థాయి సిబ్బంది ఫామ్-7 దరఖాస్తుల విషయంలో తాడేపల్లి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఫామ్-7 దరఖాస్తుల విషయంలో టీడీపీ ఓట్లు తొలగించే విషయంలో అధికారులు పోటీలు పడి పనిచేస్తు న్నారు. వారికి వాలంటీర్లు..సచివాలయ సిబ్బంది సహకరిస్తున్నారు. అనర్హుల ఓట్లు తీసేయమని టీడీపీ ఇచ్చే దరఖాస్తులపై మాత్రం తమకేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నా రు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం (నియోజకవర్గం నెం-80) లో పోలింగ్ స్టేషన్ నెం-62 లో ఒక వైసీపీ నాయకుడి తల్లిపేరుతో మూడు ఓట్లు నమోదు చేశారు. ఒకే వ్యక్తి…ఒకే ఫోటోతో ఒకే పోలింగ్ స్టేషన్లో అధికారుల ప్రమేయం లేకుండా మూడు ఓట్లు ఎలా నమోదవుతాయి? అవి ఎందుకు తీసేయరని మేం స్థానిక అధికారుల్ని ప్రశ్నిస్తే రూల్స్ ప్రకారం స్పందిస్తామని చెబుతున్నారు. అవే రూల్స్ .. ఇతర నిబంధనలు దొంగఓట్లు తీసేయడంలో ఎందుకు చూపించరని ప్రశ్నిస్తున్నాం.
నగరపాలక అధికారులు.మున్సిపల్ అధికారుల వద్ద పౌరుల జననమరణాల వివరాలు ఉంటాయి. వాటి ప్రకారం ఎవరు చనిపోయారో ఓట్లు తొలగించేముందు అధి కారులు ఎందుకు పరిశీలించరని ప్రశ్నిస్తున్నాం.

మరీ దారుణంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ -44 లో ఒక చెట్టుని ఓటరుగా చూపారు. అధికార పార్టీకి నచ్చితే చెట్టుకు…పుట్టకు…ఆఖరికి చెప్పులకు కూడా ఓట్ల పుట్టిస్తారు. టీడీపీ వాళ్లు దొంగఓట్లు తీసేయమంటే నిబంధనలు అంటున్న అధికారులకు ఇలాంటి వింత లు కనిపించడం లేదా?

అధికారులు.. కొందరు కిందిస్థాయి సిబ్బంది పనితీరుతో ఇంతకు ముందు జరిగిన ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలన అంతా ఫార్స్ గా మారింది. 2019 ఎన్నికల్లో 25 ఓట్లతో ఓడిపోయాను. ఇప్పుడు నా నియోజకవర్గంలో 12000 దొంగఓట్లు చేర్చారు. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోరని అధికారుల్ని ప్రశ్నిస్తుంటే.. వెటకారంగా సమాధా నమిస్తున్నారు.

ఆధారాలు చూపిస్తున్నా.. పట్టించుకోని వారిని ఏంచేయాలో మీరే ఆలోచించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సూచించాం. ఈ ప్రభుత్వ కుట్రలు.. కుతంత్రాలను అమలుకానివ్వం. అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఓటు హక్కు విని యోగించుకోవాలి..అలానే దొంగఓటు ఒక్కటీ పడకూడదన్నదే టీడీపీ లక్ష్యం. ఓటమి భయంతోనే జగన్ రెడ్డి అధికారుల్ని అడ్డుపెట్టుకొని ఓటర్ల జాబితాలో ఇలాంటి అవక తవకలకు పాల్పడుతున్నాడు.” అని బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply