బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నా

-ఏకగ్రీవంగా సుజనా చౌదరికి మద్దతు తెలిపిన పశ్చిమ నియోజకవర్గ బ్రాహ్మణ సమాజం
-పెద్ద ఎత్తున హాజరైన వేద పండితులు

విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలోని బ్రాహ్మణ సోదరుల సంక్షేమానికి వారు ఉన్నతికి కట్టుబడి ఉంటానని సుజనా చౌదరి అన్నారు. బ్రాహ్మణ ఐక్యవేదిక కన్వీనర్ కప్పగంతుల శివరామ శర్మ ఆధ్వర్యంలో శనివారం భవానిపురం లొ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ బ్రాహ్మణుల ఉన్నతికి వారి ఆర్థిక సంక్షేమానికి నిరంతరం పాటుపడతాననీ అన్నారు.

వైసీపీఐదేళ్ల పాలనలో బ్రాహ్మణ జాతిని నిర్విర్యం చెసి వారి అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదన్నారు. బ్రాహ్మణుల మీద అనేక దాడులు కూడా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత టిడిపి ఎన్డీఏ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డామన్నారు. బ్రాహ్మణులు స్వయం ప్రతిపత్తి సాధించడానికి బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీని కూడా టిడిపి హయాంలో నే స్థాపించారని గుర్తు చేశారు. అర్చకులు వేద పండితులు పురోహితుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని నియోజకవర్గ బ్రాహ్మణులందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

బ్రాహ్మణ సాధికార సమితి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఈమని సూర్యనారాయణ మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెలంపల్లి శ్రీనివాసరావు బ్రాహ్మణుల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామని మాట తప్పారు అన్నారు. బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరిస్తామన్న సుజానాకే తమ మద్దతు ఉంటుందన్నారు.

కార్యక్రమంలో లంకా ఆనంద శర్మ , అంబడిపూడి ప్రసాద్, లంక శివానంద శర్మ , మొక్కపాటి శ్రీనివాసరావు, చెరువు రామకోటయ్య , పల్లి అవధాని, శ్రీ శ్రీ శర్మ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు

Leave a Reply