Home » రైతన్నకు ఏటా రూ.20 వేలు సాయం

రైతన్నకు ఏటా రూ.20 వేలు సాయం

-కూటమి రాగానే అర్హులకు 2 సెంట్ల స్థలం ఇస్తాం
– ఇంటి నిర్మాణ బాధ్యత కూడా తీసుకుంటాం
– బీసీ డిక్లరేషన్‌తో వారి జీవితాల్లో వెలుగులు
– ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా ఉంటాం
– లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్‌బాబు
– రొంపిచర్ల మండలంలో ఎన్నికల ప్రచారం

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అర్హులు అందరికీ రెండు సెంట్ల స్థలం ఇస్తుందని, అలాగే ఇంటి నిర్మాణ బాధ్యతను కూడా తీసుకుంటుందని ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, డాక్టర్‌ చదలవాడ అరవింద్‌ బాబు అన్నారు. రొంపిచర్ల మండలం మునమాక, విప్పర్లపల్లి, వడ్లమూడివారి పాలెం, సుబ్బయ్యపాలెం, తురుమేళ్ల, అన్నవరపాడు, ముత్తనపల్లి గ్రామాల్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండుటెండలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయాధారితమైన పలనాడు ప్రాంతంలో రైతులకు మేలు జరిగేలా ప్రాజెక్టులు వరికిపూడిసెల, సాగర్‌ కుడి కాలువ స్థిరీకరణ చేస్తామని అన్నారు. రైతన్నలకు ఏటా 20 వేలు ఇస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో ఇప్పటికే జలజీవన్‌ మిషన్‌ కింద నిధులు మంజూరు అయ్యాయని, కానీ పనులు చేసే కాంట్రాక్టర్‌ లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని, కూటమి రాగానే పనులు ముందుకు తీసుకెళ్లి ప్రతి ఇంటికి కొళాయి ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. బీసీ డిక్లరేష న్‌తో వారి జీవితాల్లో వెలుగులు తీసుకురాబోతున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలు ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు

Leave a Reply