Home » పెన్షన్‌ను ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ చేయకుండా ప్రభుత్వం కుట్ర

పెన్షన్‌ను ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ చేయకుండా ప్రభుత్వం కుట్ర

-రాష్ట్ర గవర్నర్‌కు ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదు
-వాలంటీర్ల పేరుతో 33 మంది వృద్ధులను పొట్టన పెట్టుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం
-ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డిని అభ్యర్ధిస్తే సీఎస్ వ్యవహరించిన తీరు సరైనది కాదు
-ఈసారి ఏ ఒక్క పెన్షన్ దారుడైనా ఇబ్బందులు పడితే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
– ఎన్డీఏ కూటమి నేతలు

మార్చి నెల మొదటి నెలలో పెన్షన్ వ్యవహారంలో జరిగిన విపత్తు మరలా పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ ను కలిసి విన్నవించుకున్న ఎన్డీఏ కూటమి నేతలు. శనివారం విజయవాడ రాజ్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్వి వర్ల రామయ్య నేతృత్వంలో తెలుగుదేశం, బీజేపి, జనసేన నేతలు (ఎన్డీఏ కూటమి) రాష్ట్ర గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంటే వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసే అవకాశమున్నా జగన్ రెడ్డికి రాజకీయ లబ్దీ చేకూరాలనే సీఎస్ జవహార్ రెడ్డి తప్పుడు నిర్ణాయాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. అనంతరం నిర్వహించకున్న విలేకరుల సమావేశంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

వృద్ధుల ఉసురు పోసుకుంటున్న సీఎం జగన్ రెడ్డి, సీఎస్ జవహార్ రెడ్డి : వర్ల రామయ్య
“సీఎం జగన్ రెడ్డి, సీఎస్ జవహార్ రెడ్డిలు కలిసి వృద్ధులకు ఇవ్వాల్సిన పెన్షన్ విషయంలో కుట్ర పన్నారు. రాజకీయ లబ్దీ పొందేందుకు కావాలనే వృద్ధులను గ్రామ సచివాలయాలకు రప్పించారు. అలా వృద్ధులు మండుటెండల్లో గ్రామ సచివాలయాలకు వస్తే ఎంతో కొంత మంది మరణిస్తారు, ఆ నేపాన్ని ప్రతిపక్షాలపై మోపి ఎన్నికల లబ్దీ పొందవచ్చు అనే జగన్నాటకాన్ని జగన్ రెడ్డి పన్నాడు. ఈ కుట్రలో సీఎస్ జవహార్ రెడ్డి భాగమయ్యాడు. ఇకనైనా జగన్ రెడ్డి ఇటువంటి దొంగ నాటకాలు, కుట్రలు, కుతంత్రాలు ఆపాలి. విద్యార్ధులకు విద్యను బోధించవల్సిన ఉపాధ్యాయులను సారా దుకాణాల వద్ద కాపలాకు పెట్టారు.

కానీ వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేయడానికి మనుషులు లేరంటున్నారు దుర్మార్గపు సీఎస్ జవహార్ రెడ్డి. ఇటువంటి నీతి మాలిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. అంగన్వాడి టీచర్లను, ప్రభుత్వ బడుల ఉపాధ్యయులను, సెర్ప్‌లో ఉన్న లక్షాలాది మంది ఉద్యోగులతో పెన్షన్‌ను పంపిణీ చేయవచ్చు. కానీ వైసీపీ ప్రభుత్వం అలా చేయదు. వారికి కావాల్సింది జనం చావు తద్వారా రాజకీయ లబ్దీ పొందడం. జగన్ రెడ్డికి రాజకీయ లబ్దీ చేకూర్చడం కోసం తంటాలు పడుతున్న సీఎస్ జవహార్ రెడ్డి తీరును మేము తప్పుబడుతున్నాం.

పెన్షన్ దారులందరి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాలి. పెన్షన్ దారులెవ్వరూ ఇబ్బందుకు పడుకుండా పెన్షన్ పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. దాని ప్రకారమే ఒక్క లబ్దీదారుడు ఇబ్బంది పడినా ఊరుకునేది లేదు. జగన్ రెడ్డి పన్నిన కుట్రను గవర్నర్‌కు వివరించాం. వృద్ధులు పడుతున్న ఇబ్బందులను గవర్నర్‌కు తెలియజేశాం. ప్రజలందిరికీ నేను మరోసారి వివరిస్తున్నాను. ఇదంతా జగన్ రెడ్డి ఆడుతున్న నాటకం.

వాలంటీర్లు లేకనే వృద్ధులు మరణిస్తున్నారనే దుర్మార్గపు వార్తను ప్రచారం చేయాలని జగన్ రెడ్డి, జవహార్ రెడ్డి కుట్ర పన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే ఎన్డీఏ విజయంతోనే సాధ్యం. ఇప్పుడిస్తున్న రూ.3 వేల పెన్షన్‌ను రూ.4 వేలు చేసి ఇంటి వద్దకే పంపిణీ చేస్తాము” అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య హామీ ఇచ్చారు.

పెన్షన్ దారులను అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డికి రాజకీయ లబ్దీ చేకూర్చాలని తాపత్రయ పడుతున్న సీఎస్ జవహర్ రెడ్డి
“ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయాలని సీఎస్ జవహార్ రెడ్డిని కోరగా సానుకూలంగా స్పందించలేదు. వాలంటీర్ల పేరుతో జగన్ రెడ్డికి రాజకీయ లబ్దీ చేకూర్చాలని సీఎస్ జవహార్ రెడ్డి తాపత్రయ పడుతున్నట్లు ఆయన మాటల్లోని అర్థమవుతోంది. అందుకే రాష్ట్రానికి రాజ్యాంగ రక్షకుడు గవర్నర్‌కు ప్రభుత్వం లోపభూయిష్టాలను సవివరంగా వివరించాం. పెన్షన్ వ్యవహారంలో జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కుట్రను తెలయజేశాం. ఈ విషయంపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని గవర్నర్ సానుకూలంగా స్పందించారు” అని జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ రావు తెలిపారు.

సీఎం జగన్ రెడ్డికి తొత్తులా వ్యవహరిస్తున్న సీఎస్ జవహార్ రెడ్డి : లంకా దినకర్
ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల 33 మంది వృద్ధులు మరణించారు. ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నా కానీ రాజకీయ లబ్దీ కోసం మాత్రమే వృద్ధులను జగన్ రెడ్డి ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది. ఈ నెల మొదటి వారంలో ప్రభుత్వం సృష్టించిన విపత్తు మరలా మే నెలలో పునరావృతం కాకుండా ఉండాలని ఎన్డీఏ కూటమి నేతలు సీఎస్‌ను విన్నవించుకున్నా, మా అభ్యర్ధనను పెడ చెవిన పెట్టారు. జగన్ రెడ్డికి తొత్తులా సీఎస్ జవహార్ రెడ్డి పనిచేస్తున్నారు.

పెన్షన్ దారుల ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్‌ను పంపిణీ చేస్తామని చెప్పడంలో సీఎస్ జవహార్ రెడ్డి విఫలమయ్యాడు. ఇళ్ళ వద్దకే వెళ్ళి పంపిణీ చేస్తారా లేదా అని మేము అడిగితే సీఎస్ నవ్వు నవ్వుతున్నారు. సీఎస్ జవహార్ రెడ్డి ప్రవర్తించిన తీరుకు నిరసనగా మేము ధర్నా చేశాము. రానున్న మే నెలలో నేరుగా ఇళ్ళ వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాలి. ఎన్నికల్లో లబ్దీ పొందాలని ఇంకా ఎక్కువ మరణాలను ఈ ప్రభుత్వం ఆసిస్తుందని మాకు భయంగా ఉంది. జగన్ రెడ్డి ఇకనైనా సవ రాజకీయాలు చేయడం ఆపాలి” అని బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు.

గవర్నర్‌ను కలిసిన వారిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.నారాయణ రాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్, జనసేన మంగళగిరి నియెజకవర్గ సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, తెదెపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, తెదెపా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కోడూరి అఖిల్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply