రాయవరం : గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కో కుటుంబానికి శుక్రవారం కొమరిపాలెంలో 15 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అనపర్తి శాసన సభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మండపేట శాసన సభ్యుడు వేగుళ్ళ జోగేశ్వరరావు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్,పిఠాపురం అండ్ అనపర్తి జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు , యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఉన్నారు. శ్రీగణపతి ఫైర్ వర్క్స్ యాజమాన్యం నుండి కూడా మృతి చెందిన తొమ్మిది మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల 50 వేలు చొప్పున పరిహారం పంపిణీ చేశారు. టీడీపీ సభ్యత్వం కలిగి ఉన్న 8 మంది మృతుల కుటుంబాలకు త్వరలో పార్టీ నుండి తలో 5 లక్షలు అందజేయనున్నట్లు మంత్రి సుభాష్ ప్రకటించారు.