Suryaa.co.in

Telangana

కోమటిరెడ్డిపై సోనియాకు ఫిర్యాదు

-జానారెడ్డిని బ్లాక్‌మెయిల్ చేస్తానంటే కుదరదు
– నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మానుకో
– కోమటిరెడ్డి బీజేపీ నుంచి నేత కిందే లెక్క
– కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిందే జానా రెడ్డి ఇంటి నుంచి
– యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌని రాజా రమేష్ యాదవ్
వేణుగోపాలస్వామి దేవాలయంలో తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధమా ?

మునుగోడు: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నీతి నిజాయితీ నైతిక విలువలతో రాజకీయాలు సాగించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి పై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా బాధాకరం అని మాజీ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గౌని రాజా రమేష్ యాదవ్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తన వ్యూహాలతో కుందూరు జానారెడ్డి గా గతంలో పార్టీని విడిచి వెళ్లిన వారిని సైతం కాంగ్రెస్ లోకి తీసుకువచ్చి వారిని కూడా గెలిపించిన ఘనత జానారెడ్డి ది. 2009లో కాంగ్రెస్ పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఎంపీ భువనగిరి అభ్యర్థిగా ప్రకటిస్తే అందరినీ సమన్వయం చేసింది జానా రెడ్డి అన్నది జగమెరిగిన సత్యం.

2014లో భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గా ఓడిపోతే 2017 లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని బరిలో నిలిపి గెలిపించిన ఘనత కూడా జానారెడ్డి దే..2018 ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి గెలిచాక ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును రాజగోపాల్ రెడ్డి సతీమణికి కాంగ్రెస్ పార్టీ ఇవ్వటం జరిగింది.

ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నార్కెట్ పల్లి జడ్పిటిసిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు మోహన్ రెడ్డిని జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దింపిందే జానా రెడ్డి . కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండ జిల్లాలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిందే జానా రెడ్డి ఇంటి నుంచి. అలాంటిది రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి వస్తే జానా రెడ్డి ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు.

మ ఉనికి కోసం రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు పాకులాడుతుంటారని దుయ్యబట్టారు. ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 2018 లో గెలిచి ఆ తర్వాత బిజెపిలోకి వెళ్లి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నేతలను పార్టీని దూషించినప్పటికీ, తిరిగి 2023 కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేసిందే జానా రెడ్డి తో కదా ఆ విషయాన్ని మరెందుకు మీడియాకు చెప్పడం లేదు?

కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన నేతలందరినీ జానా రెడ్డి సూచనల మేరకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చిన విషయం రాజగోపాల్ రెడ్డికి తెలియంది కాదు. మీరు నమ్మే గోప్లాయిపల్లి వేణుగోపాలస్వామి దేవాలయంలో తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధమా అని రాజా రమేష్ సవాల్ విసిరారు. అందరివాడుగా పేరు ఉన్న జానా రెడ్డి ని బ్లాక్ మెయిల్ చేసావ్. బెదిరించే పదవులు తెచ్చుకుంటామంటే అది అసాధ్యమని అన్నారు.

ఏ లెక్కన చూసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచే కాంగ్రెస్ పార్టీ నాయకుడని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పార్టీకి డెడ్ లైన్లు పెట్టడం, నోటికి ఏది వస్తది మాట్లాడడం ఇప్పటికైనా రాజగోపాల్ రెడ్డి మానుకోకుంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని, నికార్శైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కి ఫిర్యాదు చేస్తామన్నారు.

LEAVE A RESPONSE