– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొప్పు బాష
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు పూనుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు అంబేద్కర్ కు సంబంధించిన విషయాలను, బిజెపి ఆ మహనీయుడిని స్మరించుకునేలా చేపట్టిన కార్యక్రమాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టింది.
దేశాన్ని 55 సంవత్సరాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ దళితులను అడుగడుగునా అవమానించింది. ప్రధానమంత్రి కావాలనే కలలు కంటున్న రాహుల్ గాంధీ, బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తారని దేశవ్యాప్తంగా దుష్ప్రచారం చేశారు. దేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ని అత్యధికంగా మోసం చేసినది కాంగ్రెస్ పార్టీ.
అంబేద్కర్ కి కనీసం భారతరత్న ఇవ్వకుండా నిరాకరించింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటుకు రాకుండా అంబేద్కర్ గారిని ఓడించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే. “దొంగే దొంగ” అన్నట్లు, అంబేద్కర్ ని అవమానించిన కాంగ్రెస్ పార్టీనే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేసింది.
నలుగురు ఎస్సీలను గవర్నర్లుగా నియమించిన ఘనత కూడా బీజేపీదే. పార్లమెంట్‌లో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ప్రతిష్టించి గౌరవించిన పార్టీ బీజేపీ. నరేంద్ర మోదీ ప్రధానిగా అయిన తర్వాత బాబా సాహెబ్ అంబేద్కర్ కి సంబంధించి ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేశారు.
దేశంలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ ఎంపీలున్న పార్టీ బీజేపీ మాత్రమే. గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదే.నరేంద్ర మోదీ మొట్టమొదటిసారిగా ప్రధానిగా ఎన్నికైనప్పుడు, “ఇది అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష” అంటూ పార్లమెంటులో ప్రవేశించిన గొప్ప నాయకుడు. గాంధీ కుటుంబ సభ్యులకు భారతరత్న లభించినా, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కి భారతరత్న ఇవ్వనిది కాంగ్రెస్ పార్టీ.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు రూ. 10 లక్షలు, మూడెకరాల భూమి వంటి హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసింది. దళితులకు రూ. 13 లక్షలు ఇస్తామని, ఇండ్లు కట్టిస్తామని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని అమలు చేయకపోవడం దురదృష్టకరం.