Suryaa.co.in

Telangana

దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ ఒక్కటే శ్రీరామ రక్ష

– ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమర భేరి సభలో పాల్గొని ప్రసంగించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య

హైదరాబాద్: దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శ్రీరామరక్ష. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తుంది. బూటకపు గుజరాత్ మోడల్ ను చూపించి బీజేపీ అధికారంలోకి వచ్చింది.

మోడీ, అమిత్ షా మతోన్మాదాన్ని నమ్ముకుంటే మన రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని నమ్ముకున్నారన్నారు.బీజేపీ అణిచివేతను అడుగడుగున ప్రశ్నిస్తుంది రాహుల్ గాంధీ.ప్రజల భవిష్యత్తు తారలు బాగుండాలంటే వచ్చే స్థానిక సంస్థల్లో ప్రతి గ్రామా గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు.

ఇటీవల తాను అహ్మదాబాద్ లో ఏఐసీసీ మీటింగ్ కు హాజరయ్యానని అక్కడ అభివృద్ధి ఏమీ లేదన్నారు. బిజెపి అమిత్ షా మోడీ మతోన్మాదాన్ని నమ్ముకున్నారు. మోడీ, అమిత్ షా మతోన్మాదాన్ని నమ్ముకుంటే మన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని నమ్ముకున్నారన్నారు. దేశంలోని ఆస్తులన్నీ బీజేపీ అప్పనంగా ఆదానికి కట్టబెడుతోందని ఆరోపించారు. దేశంలోని అన్ని వర్గాలని అణచివేస్తూ కార్పోరేట్ శక్తులకు ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.

బిజెపి పాలనలో అనేక రాష్ట్రాల్లో ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్ లు, మహిళలపై వివక్ష చూపుతూ అణిచివేతను ప్రదర్శిస్తుందన్నారు. అణిచివేతను అడుగడుగున ప్రశ్నిస్తుంది కేవలం ఒక్క రాహుల్ గాంధీ ని తెలియజేశారు.

ప్రజల భవిష్యత్తు తారలు బాగుండాలంటే వచ్చే స్థానిక సంస్థల్లో ప్రతి గ్రామా గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ సైనికుల్లా కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఇలాగే మరింత కష్టపడి మన ప్రభుత్వాన్ని మన పార్టీని మరింత పటిష్టం చేయాలని కోరారు.

LEAVE A RESPONSE