Suryaa.co.in

Telangana

ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి షోకాజ్ నోటీసు?

– కాంగ్రెస్‌లో బాబు కోవ ర్టుల వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ ఆగ్రహం
– అనిరుధ్‌కు షోకాజ్ ఇవ్వాలని మహేష్‌గౌడ్ ఆదేశం
– క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేదిలేదని హెచ్చరిక

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో చంద్రబాబునాయుడు కోవర్టులున్నారని, తెలంగాణలో ఇంకా ఆంధ్రా కాంట్రాక్టర్ల హవానే నడుస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్ వర్గీయుడైన అనిరుధ్‌రెడ్డిపై పీసీసీ క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతోంది. ఆ మేరకు ఆయనకు షోకాజ్‌నోటీసు ఇచ్చి పిలిపించాలని టీపీసీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, క్రమశిక్షణ కమిటీని ఆదేశించినట్లు సమాచారం.
బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం లేఖలు రాస్తే సరిపోదని, తెలంగాణలో ఉన్న చంద్రబాబు కోవర్టులకు కాంట్రాక్టులు, కరెంట్, నీటి కనెక్షన్లు నిలిపివేయాలని అనిరుధ్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు ఆపివేస్తే, బనకచర్ల ప్రాజెక్టు దానంతట అదే ఆగిపోతుందని ఆయన పేర్కొన్నారు.

అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించి.. . అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వెంటనే సమగ్ర నివేదిక సమర్పించాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. సోమవారం తర్వాత అనిరుధ్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గా ల సమాచారం

LEAVE A RESPONSE