Suryaa.co.in

Telangana

మూతులు ముద్దాడుకున్నాయి..కాళ్లు తన్నుకున్నాయి

– కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, స్థిరత్వం ,మతిస్థిమితం లేని వ్యక్తి
-కళ్ళు ఉండి చూడలేని కబోదుల్లా కాంగ్రెస్ నాయకులు
– కేసీఆర్ పాలననే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష
– నల్గొండ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ పట్టణంలో జరిగింది నిజమైన నిరుద్యోగుల సభ కాదు..కేవలం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల సభ. ఆ సభలో మూతులు ముద్దాడుకుంటున్నాయి ,కాళ్లు తన్నుకుంటున్నాయి ,కౌగిలింతలు,కపట ప్రేమలు అన్ని కనిపించాయి. నిన్న జరిగిన సభలో సిగ్గు ఎగ్గూ లేకుండా బట్ట కాల్చి మీద వేసి కార్యక్రమం కాంగ్రెస్ నేతలు చేశారు.

భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, స్థిరత్వం ,మతిస్థిమితం లేని వ్యక్తి. ఉదయం BRS తో ,మద్యాహ్నం కాంగ్రెస్ , సాయంత్రం BJP తో మంతనాలు చేసింది వాస్తవం కాధా ? దానికి ప్రత్యక్ష్య సాక్ష్యులు నిన్న వేదిక పై ఉన్న వారే.

మునుగోడు ఉప ఎన్నికలలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి BJP కి ఓటు వేయమని చెప్పింది వాస్తవం కాదా? 2004 అసెంబ్లీ ఎన్నికలలో గుత్తా సుఖేందర్ రెడ్డిని ఓడించానని గొప్పలు చెప్పుకుంటున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. 2018లో నా శిష్యుడు , నా తమ్ముడు కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఎందుకు ఓటమిపాలయ్యాడో చెప్పాలి. ఆయన కుటుంబ సభ్యులను సైతం గతంలో బి ఆర్ యస్ పార్టీ నేతలు ఓడించారు.అనవసరముగా BRS నాయకులపై , జిల్లా మంత్రి పై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలి.

నిన్న జరిగిన నిరుద్యోగుల సభ వేదిక పై ఉన్న కోమటి రెడ్డి,జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు రేవంత్ రెడ్డి వందలాది కోట్లకు అదిపతులే..నాకు ఐదు ఎకరాల భూమి లేదు అని మాయ మాటలు చెప్పే నేతలు హైదరాబాద్ లో విల్లాలు, హైటెక్ సిటీ లో భూముల సంగతి గురించి చెప్పాలి.

కమిషన్లు తీసుకొని కాంగ్రెస్ నాయకులు వదిలేసి వెళ్లిన ఉదయ సముద్రం ప్రాజెక్టు ను మేము పూర్తి చేసాం. ఇంకో పది రోజుల్లో ఉదయ సముద్రంలోకి నీళ్ళు వస్తాయి. ముఖ్మ మంత్రి కే‌సి‌ఆర్ దత్తతతో నల్గొండలో జరుగుతున్న అభివృద్ది పనులు వాళ్లకు కనిపించడం లేదా? నల్గొండ మరియు సూర్యపేట జిల్లాల లో ప్రభుత్వ మేడికల్ కళాశాలలను ఏర్పాటు చేసాం.

కాలువలకు పరిమితం అయిన SLBC, SRSP, Dindi లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లను పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది. దాదాపు 40 వేల కోట్లతో యదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ఇచ్చిన హామీ మేరకు పూర్తి అయిన బ్రాహ్మణ వెల్లoల ప్రాజెక్టు ను వచ్చే 15 రోజుల్లో ప్రారంబించడం జరుగుతుంది.

తుంగతుర్తి, కోదాడ , ధర్మ రెడ్డి మరియు పిళ్లైపల్లి కాలువలను కాంగ్రెస్స్ హయాంలో కోమటిరెడ్డి కాంట్రాక్ట్ తీసుకొని మధ్యలో వదిలేసిన మాట వాస్తవం కాదా.? అట్టి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసి సాగు నీటిని అందిస్తున్న ఘనత సి‌ఎం కే‌సి‌ఆర్ కి దక్కింది.

65 వేల కోట్లతో రైతులకు రైతు బంధు ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమే. అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు 10వేలు ఇస్తున్న రాష్ట్రము ఒక్క తెలంగాణ మాత్రమే. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఐటి మంత్రిగా మూడు సంవత్సరాలు పని చేశారు. ఆయన నల్గొండ కి ఐటి తీసుకురాలేక పోయారు .కానీ కేటీఆర్ ఐటి మంత్రిగా నల్గొండకి ఐటి తీసుకువచ్చారు. త్వరలోనే ఐటి టవర్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మన పక్కన ఉన్న రాష్ట్రాల్లో కేవలం 15 కింటాల ధాన్యం మాత్రమే కొంటున్నారు. కానీ మన రాష్ట్రంలో పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు దేశానికే తలమానికంగా నిలిచాయి.కళ్ళు ఉండి చూడలేని కబోదుల్లా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారు. అధికారమే పరమావధిగా కాంగ్రెస్ నాయకుల వ్యవహారశైలి ఉన్నది.వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశారు.ఇప్పుడు ఎంత అభివృద్ధి జరుగుతోందో వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి .

కాంగ్రెస్ నాయకులకు అధికార యావ తప్ప మరొకటి లేదు. ఎప్పుడు అధికారంలోకి వద్దమా.. ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని దోచుకుందామా అనే ఆలోచన తప్ప కాంగ్రెస్ నేతలకు వేరే ఆలోచన లేదు. కాంగ్రెస్ నాయకుల చేతికి అధికారం ఇస్తే రాష్ట్రం కుక్కలు చింపిన ఇస్తారు మాదిరిగా అవుతుంది అని ప్రజలకు తెలుసు.

ఒకే వేదికపై కూర్చోలేని వారు,ఒక్కరితో ఒక్కరు మాట్లాడుకోలేని వారు,ఒక్కటిగా ఒక్క మాటమిద ఉండలేని వారు మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా ? .ఆత్మ విమర్శ చేసుకోండి . కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టిన తట్టుకొని తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంది అంటే అది కేవలం కేసీఆర్ పాలన దక్షితతోనే ..అభివృద్ధి నిరోదకులు అయిన కాంగ్రెస్, బిజెపి నాయకులకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరుతున్నాం . ముఖ్యమంత్రి కేసీఆర్ పాలననే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష.

LEAVE A RESPONSE