-మీ కేబినెట్ మంత్రులు అధికారుల కంటికి కనిపించరే?
– మీ మంత్రులు ఫోటోలకు ఫోజులే తప్ప… ప్రజలకు మేలు చేసిందేమీ లేదు
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి. సుభాష్
హైదరాబాద్: రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి నామమాత్రంగానే కనపడుతున్నట్లు ఉన్నారు. రాష్ట్రానికి సీఎం ఉన్నారా అన్న అనుమానం ప్రజల్లో గట్టిగా వినిపిస్తోంది. ప్రభుత్వాన్ని గాంధీభవన్ నుండి నడిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ కు పాలనపై ఇంకా పట్టు రాలేదు.
కాంగ్రెస్ పరిశీలకురాలే ‘షాడో సీఎం’గా వ్యవహరించడమంటే దేనికి సంకేతం? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్.. ప్రభుత్వ హోదా లేని వ్యక్తిగా సచివాలయంలో మంత్రులు, అధికారులు పాల్గొన్న అధికారిక సమీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం. గాంధీభవన్‌కు పరిమితమై ఉండాల్సిన పార్టీ పరిశీలకురాలు, సచివాలయంలో షాడో సీఎంగా అధికార వ్యవస్థను ఒత్తిడికి గురిచేయడం ఏమిటి?
రేవంత్ రెడ్డి గారు… మీ కేబినెట్ మంత్రులు అధికారుల కంటికి కనిపించరే. మీ అధికారుల్లోనైనా నియంత్రణ ఉందా? సీతారామ ఎత్తిపోతలపై జీవో ఇవ్వమంటే… ముఖ్య కార్యదర్శి ఫోన్ ఎత్తడంలేదట. ఇది ‘పబ్లిక్ సర్వీస్’ కాదు ‘సైలెంట్ సర్వీస్’.ఎవరి హోదా ఏంటి? ఎవరి బాధ్యత ఏంటి? ఏవీ స్పష్టంగా లేని పాలన – ప్రజల భవిష్యత్తుకు ప్రమాదం.
సన్నబియ్యంపై సమీక్షకు వెళ్లిన అధికారులు, లబ్ధిదారుల ఇళ్లలోకి వెళ్లి సన్నబియ్యం తినడం కాదు.. రొట్టెలు తింటున్నారు! మంత్రులేమో సన్నబియ్యం బాగుందని చెబుతున్నారు. ఫోజులకోసమేనా ఈ సర్వేలు? సన్నబియ్యం తినాల్సిన అధికారులు… రొట్టెలు తింటారు! కానీ పాపం ప్రజలతో మాత్రం సూపర్ అంటారు. ఇచ్చోడలో జరిగిన ఈ సంఘటన రేవంత్ రెడ్డి ప్రభుత్వ డ్రమా పాలనకు చిరునామా. నిజం ఏదో, నాటకం ఇంకేదో మరి.
ఇది “సన్నబియ్యం పథకం కాదు గాని… బోగస్ నాటక ప్రదర్శన. పబ్లిసిటీకి ఫోజులు ఉన్నాయి… పాలన మాత్రం నిల్.కంచ-గచ్చిబౌలిలో చెట్లు నరికి… ప్రజలదే తప్పంటారా? పర్యావరణాన్ని హరించి తలకిందులుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలు ప్రశ్నిస్తే… ‘ఫోటోలో ఏఐ ఉంది’ అంటూ తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించాల్సిన సమయాల్లో ప్రజలపైనే నేరాన్ని నెట్టడం బాధాకరం.
“కంచ గచ్చిబౌలిలో చెట్లు నరికేస్తారు… ప్రజలు ఆందోళన చేస్తే ఫోటోలో ఏఐ ఉంది అంటారు.”చెట్లు నరికింది నిజం… స్పందించాల్సింది ప్రభుత్వం… కానీ ఇప్పుడు ప్రజలే దోషులవుతున్నారు! ప్రజల డిమాండ్ ఏఐ కాదు… హక్కు! అటవీ సంరక్షణకి మిమ్మల్ని గుర్తు చేస్తే తప్పేంటి?
రేవంత్ రెడ్డి గారు.. మీ మంత్రులు ఫోటోలకు ఫోజులే తప్ప… ప్రజలకు మేలు చేసిందేమీ లేదు. అధికారులు ఏమి చేయాలో మీ మంత్రులకు చెప్పాలసిన పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారా?
ఎవరికి అధికారాలు ఉన్నాయో, ఎవరు పదువులు అనుభవిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రం పూర్తిగా దివాళా తీసిందంటూ.. ఇచ్చిన హామీలకు పంగనామం పెట్టడమేనా..? ఎన్నికలప్పుడు అప్పుల్లో ఉన్న రాష్ట్రం గురించి తెలిసీ కూడా .. ఎడాపెడా ఉచిత హామీలు.. అమలుకు నోచుకోని హామీలు గుప్పించడం ప్రజలను మోసం చేయడమే కదా?
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై అసలు ఎవరిని అడగాలో అర్థమవ్వడం లేదు.. మీ ప్రజాపాలన ఏమైంది? కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం బ్యాచ్ హల్చల్ ఓవైపు.. నల్లగొండ బ్యాచ్ మరోవైపు.. వాళ్లతోనే సరిపోతుంది. ఇక రేవంత్ రెడ్డి మార్క్ పాలన కేవలం అబద్ధపు హామీలు, హంగు ఆర్భాటాలకే పరిమితమైంది.
ఇవన్నీ ప్రజల దృష్టి మళ్లించడానికి సాగిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్. ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాల్సిన సమయంలో… పబ్లిసిటీ డ్రామాలతో ప్రజల్ని మాయ చేసేందుకు కుట్రలు నడుస్తున్నాయి.