– నయ వంచక కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగట్టాలి
– వివిధ పథకాల ద్వారా ప్రజలకు కాంగ్రెస్ బాకీ పడ్డ డబ్బులు చెల్లిస్తేనే ఓటు వేస్తాం అని మీ ఇంటికి ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నీలదీయండి
– రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపి రెండు కలిసి పనిచేస్తున్నాయి
– కాంగ్రెస్ పార్టీ ని రేవంత్ రెడ్డి తో ప్రజల పక్షాన నీలదీసి కోట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే
– వేల్పూర్ మండల కేంద్రం లోని కేసీఆర్ కాలనీలో ప్రజలకు స్వయంగా కాంగ్రెస్ బాకీ కార్డు పంచిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే వేముల
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్ : కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలకు బాకీ ఉన్న హామీలను కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో ప్రజలందరికీ చేరవేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నయవంచక హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు “కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమం” ను బాల్కొండ నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతంగా చేపడతామని ఎమ్మెల్యే అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను పూర్తిగా మోసం చేసిందని, ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు. ప్రజల పట్ల ఈ కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని,వంచనను బయటపెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ “బాకీ కార్డు” రూపంలో ప్రజల్లోకి తీసుకు వస్తోందని పేర్కొన్నారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కింది అని ఎమ్మెల్యే అన్నారు. మేము అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్ని అమలు చేస్తాం అని ఎన్నికల్లో ప్రతి వేదికలో చెప్పారు.
ప్రజలను నమ్మించడానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులను పంచి ప్రజలను మభ్యపెట్టి అధికారం లోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తుంది కానీ ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయలేదు. పథకాల అమలు తక్కువ… ప్రచారం ఎక్కువ అన్న తీరున కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతుంది.
కాంగ్రెస్ పార్టీ ని రేవంత్ రెడ్డి తో ప్రజల పక్షాన నీలదీసి కోట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ప్రతి మహిళకు 2500 ఇస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు. 22 నెలలుగా 2500 చొప్పున 55000 కాంగ్రెస్ ప్రతి మహిళకు బాకీ పడింది
వృద్దులకు, బీడీ పెన్షన్ వాళ్లకు అధికారం లోకి రాగానే 4000 పెన్షన్ చేస్తాం అన్నారు కానీ కేసీఆర్ ఇచ్చిన 2000 మాత్రమే ఇస్తున్నారు. 22 నెలలుగా వృద్ధులకు బీడీ పెన్షన్ దారులకు కాంగ్రెస్ 44,000 బాకీ పడింది. దివ్యంగులకు పెంచుతామన్న 6000 పెన్షన్ అమలు చేయక ప్రతి దివ్యంగునికి 44,000 కాంగ్రెస్ బాకీ పడ్డది.
రైతు భరోసా 15,000, కౌలు రైతులకు 19 వేలు, రుణమాఫీ 2,00,000 బాకీ ఉంది. బోనస్ ప్రతి ఎకరాకు 12500 చొప్పున నాలుగు పంటలకు 50,000 రైతుకు కాంగ్రెస్ బాకీ పడింది. విద్య భరోసా కార్డు 5,00,000 ఇస్తామన్నారు ఇవ్వలేదు. ఉపాధి హామీ కూలీలకు, ఆటో డ్రైవర్లకు సంవత్సరం కు 12,000 చొప్పున రెండు ఏండ్లకు 24,000 కాంగ్రెస్ బాకీ ఉంది.
విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు, 22 నెలలుగా ఇవ్వని నిరుద్యోగ భృతి 88,000 కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇప్పటి వరకు పెళ్లిళ్లు అయినా ఆడబిడ్డలకు తులం బంగారం విద్యార్థులకు స్కూటి లు, ఫీ రియంబర్స్మెంట్ 8000 కోట్లు కాంగ్రెస్ పార్టీ బాకీ పెట్టింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ రెండు ఏండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాలు ద్వారా ప్రజలకు ఎంత బాకీ పడిందో తెలిసేలా కాంగ్రెస్ బాకీ కార్డు లను ప్రజలకు పంచుతం అని ఎమ్మెల్యే అన్నారు.