Home » కాంగ్రెస్‌ను కూలుస్తున్నారా?.. కూల్చుకుంటున్నారా?

కాంగ్రెస్‌ను కూలుస్తున్నారా?.. కూల్చుకుంటున్నారా?

వారం క్రితం వర్తమాన రాజకీయాల మీద మంచి అవగాహన ఉన్న ఒక బ్లాగర్ ఇలా వ్యాఖ్యానించాడు!
ఆంటోనియో మైనో .. ఉరఫ్ సోనియా మొత్తానికి ఎక్కడో ఒక చోట దొరికిపోయి ఉంటుంది మోడీ షా ద్వయానికి.
కానీ విషయం బయటపడకుండా ఉండడానికి , కాంగ్రెస్ ని మెల్లగా మూసేసి పక్కకి తప్పుకునేలా ఒప్పందం జరిగిపోయి ఉంటుంది.
అయితే వరసగా జరుగుతున్న పరిణామాలని నిశితంగా పరిశీలిస్తే మాత్రం అది పుకారు కాదు నిజమే అని అర్ధమయిపోతుంది.
అది పంజాబ్ కానీ,రాజస్థాన్ కానీ, జార్ఖండ్ కానీ ఒకే తరహాలో తమ పార్టీని భూస్థాపితం చేసే దిశగా, నిర్ణయాలు తీసుకుంటున్నది సోనియా.
గత 2017 ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ ని చూసి, పంజాబ్ ఓటర్లు కాంగ్రెస్ ని గెలిపించారు. అమరీందర్ సింగ్ పాటియాలా రాజ వంశంకి చెందినవాడు. పాటియాలా రాజు మీద పంజాబ్ ప్రజలలో ఇప్పటికీ గౌరవాభిమానాలు ఉన్నాయి. అంతే కానీ సోనియా, రాహుల్ ని చూసి ఓట్లు వేయలేదు. అమరీందర్ రాజీవ్ స్నేహితుడు కూడా, ఇద్దరిదీ ఒకే ఏజ్ గ్రూప్ అలాంటిది. రాహుల్ పుట్టినప్పటినుండి అమరీందర్ చూస్తూనే ఉన్నాడు. అలాంటిది రాహుల్ చెప్పినట్లు వినడానికి ఒప్పుకోలేదు. స్వతహాగా రాజ వంశీకుడు కాబట్టి , అమరీందర్ కొంచెం ఆత్మగౌరవానికే ప్రాధాన్యత ఇస్తాడు అందులో తప్పులేదు. తన మాట వినట్లేదు అని రాహుల్.. నవజ్యోత్ సింగ్ సిద్ధూని ముఖ్యమంత్రిని చేయాలని అనుకున్నాడు. కానీ సోనియా అడ్డుపడింది. కానీ ప్రియాంక జోక్యంతో సిద్ధూ కి పంజాబ్ కాంగ్రెస్కి చీఫ్ అవగలిగాడు.
ఎప్పుడయితే సిద్ధూ ని PCC చీఫ్ ని చేశారో, అప్పటి నుండి అమరీందర్ లో అసహనం పెరిగిపోయింది. రాజీవ్ బ్రతికి ఉన్న రోజుల్లో, సిద్ధూ కి కనీసం రాజకీయం అంటే ఏమిటో తెలీదు. కానీ తనకి సలహాలు ఇవ్వడం దానిని ఆజ్ఞలాగా పాటించమనడం కాదు. అంటే రాహుల్ చెప్పాడు చేయాల్సిందే అనడం లాంటివి, సిద్ధూ చేసిన కొన్ని ముఖ్యమయిన పనులు. అమరీందర్ కి తెలుసు.. తనని పొమ్మనకుండా పొగ పెడుతున్నారు అని..కానీ తన రాజకీయ అనుభవం, వేచి చూసే ధోరణిని అలవాటు చేసింది.
ముఖ్య సంఘటన !
రైతు ఉద్యమం పేరుతో రోడ్లు బ్లాక్ చేసి, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దెబ్బ తీస్తున్నారు అంటూ రాకేష్ తీకాయిత్ ని తీవ్రంగా విమర్శించాడు అమరీందర్అక్కడితో ఆగకుండా చేసే ప్రదర్శనలు ఏవో ఢిల్లీ కి వెళ్ళి చేయండి. లేదంటే అరెస్ట్ చేసి జైల్లో పెడతాను అంటూ హెచ్చరించాడు. దాంతో సిద్ధూ ఢిల్లీ వెళ్ళి రాహుల్ తో కలిసి ఫిర్యాదు చేశాడు అమరీందర్ మీద. రాహుల్ నేరుగా జోక్యం చేసుకొని సిద్ధూ సూచనలని అమలుచేయాల్సిందే అంటూ ఒత్తిడి తెచ్చాడు అమరీందర్ మీద. దాంతో ఇక తాను కాంగ్రెస్ పార్టీలో ఉండడం కష్టం అని భావించి రాజీనామా చేసేశాడు కెప్టెన్ అమరీందర్ సింగ్.
అసలు మొదటి నుండి సిద్ధూ అంటే పడదు కెప్టెన్ కి. పాకిస్థాన్ వెళ్ళి పాక్ సైన్యాధ్యక్షుడు తో చెట్టా పట్టాలు వేసుకొని తిరగడం కెప్టెన్ కి అసలు ఇష్టం లేదు. ఎంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తాను కూడా సైన్యంలో పనిచేశాడు కదా? మరో వైపు సరిహద్దుల్లో పాకిస్థాన్ లోన పంజాబ్ ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టాల్సిందిగా, తరుచూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం రాహుల్ కి నచ్చలేదు. వెరసి అన్నీ కలిసి తన పదవికి రాజీనామా చేయాడానికి దారి తీసాయి.
రాహుల్ – సిద్ధూ –ప్రియాంక!
రాహుల్,ప్రియాంక లు ఇద్దరూ సిద్ధూ ని ముఖ్యమంత్రి ని చేయాలని గట్టి పట్టుదలగా ఉండగా, సోనియా పంజాబ్ లో పార్టీని భూస్థాపితం చేయాలి కాబట్టి.. తన పిల్లల అభిప్రాయాన్ని పక్కన పెట్టేసి, అనూహ్యంగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.
ఈ చన్నీ ఎంపిక అటు పంజాబ్ కాంగ్రెస్ ఎంఎల్ఏ లతో పాటు, సిద్ధూకి నచ్చలేదు. తనని ముఖ్యమంత్రిని చేస్తారనుకుంటే, చన్నీ ని ముఖ్యమంత్రిగా చేయడం సిద్ధూ ని ఆలోచనలో పడేసింది. కానీ PCC అధ్యక్షుడిగా నూతన మంత్రివర్గ సభ్యులలో, తన వారిని ఇరికిద్దామని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.
చన్నీ సోనియా చెప్పిన వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తాను అని తెగేసి చెప్పడంతో, సిద్ధూకి సినిమా కధ ఏంటో అర్ధమయిపోయింది. రాహుల్,ప్రియాంక ల మాట చెల్లుబాటు కాదని.. ఇక తనకి PCC అధ్యక్షుడిగా చిల్లి గవ్వ అంత విలువ లేదని తెలుసుకొని, PCC అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. కానీ పార్టీలోనే ఒక సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని సోనియాకి ఇచ్చి రాజీనామా లెటర్ లో పేర్కొన్నాడు.
ఎవరీ చరణ్జిత్ సింగ్ చన్నీ?
గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు, 31 ఏళ్ల మహిళా IAS ఆఫీసర్ కి అసభ్యకరమయిన మెసేజ్ పంపిన ఘనుడు. విషయం బయటపడేసరికి, మెసేజెస్ పంపింది నేను కాదు.. నా PA అంటూ, తన కార్యదర్శి అయిన మణి దీప్ సింగ్ భాటియా మీదకి నెట్టేసి, చేతులు దులుపుకున్న చరిత్ర చన్నీ ది.
ముఖ్యమంత్రి కెప్టెన్ అమరరీందర్ సింగ్ హెచ్చరించడం తో తరువాత ఆ మహిళా IAS ఆఫీసర్ కి క్షమాపణ చెప్పాడు. గతంలో రామ్ రహీమ్ డేరా బాబా తో కలిసి తిరిగేవాడు చన్నీ. కానీ ఎప్పుడయితే రామ్ రహీమ్ బాబా జైళ్లోకి వెళ్లాడో, చన్నీ వెంటనే క్రిస్టియన్ మిషనరీలకి ద్వారాలు తెరిచాడు పంజాబ్ లో.
చరణ్ జిత్ సింగ్ చన్నీ దళిత సిక్కు. కానీ మతం మారిన క్రైస్తవుడు. సుదర్శన్ టీవి చన్నీ ముఖ్యమంత్రిగా ప్రకటించగానే ..సుదర్శన్ టీవి విలేఖరులు చన్నీ భార్యతో ఆయన ఇంట్లోనే ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు, అక్కడ ఉన్న గోడ మీద శిలువ కెమెరా కంటికి దొరికింది. అయితే చన్నీ క్రైస్తవుడు అయినంత మాత్రాన భారతీయుడు కాడా అనే సందేహం రావొచ్చు. కానీ ఆ విషయం బహిరంగంగా ప్రకటించి ఉండవచ్చుగా ? కేవలం మంత్రిగా ఉన్నప్పుడే తన కింద పనిచేసే మహిళా ఐఏఎస్ ఆఫీసర్ కి అసభ్యకరమయిన మెసేజ్స్ పంపిన వాడు, ముఖ్యమంత్రి అయితే ఎలా ప్రవర్తిస్తాడో ఊహించవచ్చు.
NDTV వ్యతిరేకత !
అమరీందర్ ని అవమానకరంగా పార్టీ నుండి బయటికి పంపడం మీద, NDTV పంజాబ్ లోని ప్రజల వద్దకి వెళ్ళి మరీ ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో.. ప్రజల నుండి ఆగ్రహా వేశాలు వ్యక్తం చేసిన తీరుని చూపించింది. ఇది NDTV సాధారణ ప్రవర్తనకి భిన్నంగా ఉంది. కాంగ్రెస్ అధినాయకత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించి మరీ, కెప్టెన్ నిష్క్రమణ ని ప్రజల ముందు ఉంచడం అనేది.. అందులోనూ NDTV ఈ పని చేసింది ఆంటే నమ్మలేమ కానీ నమ్మాలి.
కపిల్ సిబాల్…
కపిల్ సిబాల్ మళ్ళీ గొంతెత్తి వెంటనే కాంగ్రెస్ పార్టీ CWC సమావేశ పరిచి చర్చ పెట్టాలి. అమరీందర్ ని బయటికి పంపడం మీద, అంటూ ప్రకటన చేశాడు. అసలు పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు ? అనుభవం ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపేసి ఏం బావుకుందామని సోనియా,రాహుల్,ప్రియాంకా లు అనుకుంటున్నారు ? కానీ సోనియానే పార్టీని మూసేయాలనే తలపుతో ఉన్నప్పుడు ఎవరు ఎన్నివిధాల గొంతు చించుకున్నా ఉపయోగంఉండదు అని కపిల్ సిబాల్ తో పాటు, అసమ్మతి గళం విప్పిన మిగతా 23 మంది ఎప్పుడు తెలుసుకుంటారు ?
Yes. నిన్న కపిల్ సిబాల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేసినందుకు, కాంగ్రెస్ కార్యకర్తలు కపిల్ సిబాల్ ఇంటి మీద దాడిచేసి కపిల్ సిబాల్ కారుని ధ్వంసం చేశారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, భూపిందర్ సింగ్ హుడా, వివేక్ తన్కా , రాజ్ బబ్బర్ లు దాడిని ఖండించారు. అంటే అమరీందర్ సింగ్ ని అవమానకరంగా పార్టీని నుండి బయటికి పంపించడం మీద, సీనియర్ కాంగ్రెస్ నేతలకి మింగుడు పడడం లేదు అన్నది ఎప్పటినుండో తెలిసిన విషయం. రాహుల్ కి మెవాని, కన్హయ్య లాంటి తుకుడే గాంగ్ తో పాటు.. పాకిస్థాన్ చంక నాకే సిద్ధూలు కావాలి.
అమరీందర్ సింగ్ మాత్రం తన సత్తా ఏంటో 2022 ఎన్నికలలో చూపించబోతున్నాడు. పంజాబ్ వోటర్లు ఎప్పుడూ పార్టీని చూసి వోట్లు వేయరు. కేవలం ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు అన్నదే వాళ్ళకి ముఖ్యం. 2017 ఎన్నికలప్పుడు కెప్టెన్ ని చూసి వోట్లు వేశారు కానీ సోనియా,రాహుల్ లని చూసి కాదు…
కెప్టెన్ అమిత్ షా ని కలిసింది కేవలం మర్యాద పూర్వకంగానే కానీ, బిజేపి లో చేరడానికి కాదు. కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ని చావు దెబ్బ కొట్టడానికి చాలా కసిగా ఉన్నాడు అనేది సత్యం. ఈ రోజు అజిత్ దోవల్ ని కలవడం వెనుక, పంజాబ్ లోని దేశ వ్యతిరేక శక్తుల ఆచూకీ గురించి, ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడానికే !పంజాబ్ లో ఎవరు ఎవరు అనేది కెప్టెన్ కి బాగా తెలుసు కాబట్టి, అజిత్ దోవల్ తో సమావేశం చాలా ముఖ్యమయినది అనే అనుకోవాలి.
కెప్టెన్ మాత్రం.. తాను నరేంద్ర మోడీజీ ని కలిసినప్పుడు అన్న ఒక మాటని ఇప్పుడు పదే పదే ప్రస్తావిస్తున్నాడు : అమరీందర్ జీ మీ లాంటి దేశభక్తులకి కాంగ్రెస్ పార్టీ తగినంత గౌరవం ఇవ్వదు. మీకు అవమానం జరగక ముందే బయటపడండి.
మోడీజీ అన్న మాట సత్యం అని నిరూపణ అయ్యింది ఇప్పుడు. రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళని, కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవంగా చూడదు అని ఇప్పటికే సింధియాతో పాటు పైలట్ ల ఉదంతాలు చాలు.
ఇప్పుడు కెప్టెన్ వంతు అంతే !
పంజాబ్ లో కాంగ్రెస్ భూస్థాపితం అవడానికి నిర్ణయం చన్నీ రూపంలో జరిగిపోయింది. ఇక మిగిలింది రాజస్థాన్, జార్ఖండ్ లు మాత్రమే. సోనియా తన మాట మీద నిలబడుతున్నది ! కాంగ్రెస్ ముక్త భారత్ అంటే.. తనని తాను సమాధి చేసుకొని ముక్తిని పొందడం అని అర్థం.

– సంపూర్ణాచారి, జర్నలిస్టు

Leave a Reply