ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ టిఆర్ఎస్ రాజకీయం

– మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఖాళీ అయ్యి పెంక కుండలు ఉన్నాయని ఇటీవల మాట్లాడిన్రు. కుల వృత్తుల వారిని ఆదుకునేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘విశ్వకర్మ’ పథకం ద్వారా 18 వృత్తులకు ( చేత వృత్తులు, కుల వృత్తులు) నైపుణ్యం, శిక్షణ, గ్రాంటులోన్… వీటన్నింటికి సంబంధించి బడ్జెట్ లో రూ. 13వేల కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది.

విశ్వకర్మ టీం సభ్యులందరూ కష్టపడి అర్హులైన లక్షా 20వేల మందిని పార్టీలకు అతీతంగా ఎంపిక చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని చూస్తారు.. కాబట్టి ఆ వెరిఫికేషన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పడం జరిగింది.

గత నెలరోజులుగా మేం ప్రయత్నాలు చేసినా కూడా పంచాయతీరాజ్, మున్సిపల్ డిపార్ట్ మెంట్ అధికారులు లక్షా 20వేల మంది లబ్ధిదారులను వెంటనే వెరిఫికేషన్ చేయాలని చెప్పాo. అయినా కూడా వారు వారు స్పందించలేదు.

పంచాయతీరాజ్, మున్సిపల్ డిపార్ట్ మెంట్ అధికారుల వైఖరి వల్ల ఇప్పటివరకు 3 నుండి 4వేలు కూడా వెరిఫికేషన్ కాలేదు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తూ ఉత్తరo వ్రాస్తున్నాను.

వెరిఫికేషన్ కంప్లిట్ చేస్తే లబ్ధిదారులకు నిధులు అందుతాయి.రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. మీ ఖాళీకుండలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లంక బిందెలు ఇవే.

ఇప్పటికైనా పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులను అదేశించి వెరైఫికేషన్ చేయించండి. ఎందుకంటే ఇప్పటికే గ్రాంట్ కూడా బ్యాంకుల్లో డిపాజిట్ అయింది. వెంటనే రాజకీయాలకు అతీతంగా ఈ ప్రక్రియ పూర్తిచేయండి.

ఈ మధ్య బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు ప్రాజెక్టుల పేరుతో కొత్త రాజకీయం చేస్తున్నాయి.పోటీ పడి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఎన్నో లింకులు కాంగ్రెస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఏపీ రీ-ఆర్గనైషన్ యాక్ట్ తో తెలంగాణను ఇచ్చింది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది.నల్లగొండలో ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టుకు రూ. 500 లేదా 600 కోట్లు ఇవ్వడానికి కేసీఆర్ కు చేతులు రాలేదు. వారు డబ్బులిస్తే 3.5 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు అందేది.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదిలో అడుగు వరకు నీళ్లు తోడుకునే అవకాశం ఏపీ ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పించారు.రోజుకు 8టీఎంసీల నీరు లిఫ్ట్ చేసే సామర్ధ్యం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఉంది.

ఆ ప్రాజెక్టు పంపులు వారు ఆన్ చేస్తే పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు నీళ్ల బొట్టు కూడా రాదు.కృష్ణా నది పరివాహక ప్రాంతం ఎడారిగా మారిపోతది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టంచుకోకపోవడం ఇందుకు కారణం.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. తెలంగాణలో 10 నుండి 12 సీట్లు గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను.

వందకు వంద శాతం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి కృష్ణా, గోదావరి నీటి పంపకాలకు శాశ్వత పరిష్కారo చేసి ఆ ప్రాజెక్టులు తీసుకొచ్చే బాధ్యత మేం తీసుకుంటాం.

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్టే.. కూటమి కూలిపోతుంది. 40 నుండి 50 సీట్లు కూడా రావు.బీఆర్ఎస్ కు ఓటు వేసి శూన్యం. ఆ పార్టీ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు.

తెలంగాణ ప్రజలు 17కు 17సీట్లు గెలిపిస్తే నీటివివాదాలు, అప్పులు, ఢిల్లీలో తెలంగాణ భవన్, ఆస్తుల పంపకాల సమస్య, ప్రాజెక్టులు, స్కీంలు, బడ్జెట్ ఎక్కువ తెచ్చే అవకాశం ఉంటది.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు సాధించేలా ఆశీర్వదించాలని కోరుతున్నా.

Leave a Reply