– సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు లోబడి 41ఎ నోటీసు ఇవ్వండి
– ఇన్వెస్టిగేషన్ అధికారికి హైకోర్టు ఆదేశం
అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, తెలుగుయువత నేత దండమూడి చౌదరిపై పామర్రు పోలీసులు నమోదుచేసిన 120 బి కుట్రకేసులో అరెస్ట్ చేయకుండా నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశించింది. 41ఎ సిఆర్ పిసి కింద నోటీసులు ఇవ్వాల్సిందిగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను హైకోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ను అనుసరించి ఈ కేసులో ముందుకు సాగాలన్న న్యాయస్థానం సూచించింది. గుడివాడలో క్యాసినోపై నిజనిర్థారణకు వెళ్లిన సమయంలో వర్ల రామయ్య, దండమూడి చౌదరిపై పామర్రు పోలీసులు కుట్ర కేసునమోదు చేశారు. న్యాయస్థానం తీర్పుకు లోబడి విచారణకు సహకరిస్తామన్న వర్ల పేర్కొన్నారు. పార్టీనేతల తరపున హైకోర్టులో పోసాని వెంకటేశ్వర్లు, కెఎం కృష్ణారెడ్డి వాదనలు విన్పించారు.