Suryaa.co.in

Telangana

తెలంగాణలో పార్టీ లేకుండా చేయాలనే కుట్ర

-టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌ను ట్యాప్‌ చేశారు
-పవన్‌కళ్యాణ్‌, షర్మిల కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితులే
-జగన్‌మోహన్‌రెడ్డికి కేసీఆర్‌ సాయం
-దీనిపై సమగ్ర విచారణ జరపాలి
-బీఆర్‌ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలి
-దీనిపై త్వరలో కేసు పెట్టనున్నాం
-రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తమ నాయకుల ఫోన్లను ట్యాప్‌ చేశారని తెలంగాణ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ భవన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత పది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ అనే అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. మా నాయకుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటి ముందు కూడా ఒక వాహనాన్ని పెట్టి ఆయన కదలికలను ట్యాప్‌ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే పవన్‌ కళ్యాణ్‌, షర్మిల కదలికలను కూడా ఎప్పటికప్పుడు జగన్‌మోహన్‌రెడ్డికి అందజేయడానికి వారి ఫోన్‌ కూడా ట్యాప్‌ చేసినట్లుగా తెలుస్తుందన్నారు.

టీడీపీని టార్గెట్‌ చేసి తెలంగాణలో రూపురేఖలు లేకుండా చేయాలని ఈ ఫోన్‌ ట్యాపింగ్‌కు గతంలో కూడా పాల్పడ్డారన్నారు. గత ఎన్నికలలో టాస్క్‌ఫోర్స్‌ వాహనాలలో డబ్బులను తరలించినట్లు అధికారులు చెప్పిన ట్లు వార్తలు వచ్చాయని, దీనివల్ల మొదట బలైంది తమ పార్టీ అని అన్నారు. గత ఎన్నిక లలో కేసీఆర్‌ జగన్‌మోహన్‌రెడ్డికి డబ్బులు సహాయం చేసినట్లు వార్తలు వచ్చాయి… దీనిపై కూడా సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నామన్నారు. తమ నాయకుల ఫోన్‌లను ట్యాప్‌ చేసి తెలుగుదేశం పార్టీని ఇక్కడ నామరూపాలు లేకుండా చేయాలనే కేసీఆర్‌ ప్రణాళికపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఆయారామ్‌.. గయారామ్‌లను చూశాం.. ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే కొత్త విధానాలను ప్రస్తుతం చూస్తున్నాం.

ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ అధినేతలు ప్రభుత్వ అధికారులను తొత్తులుగా వినియోగించుకోవడం చూస్తున్నాం. 300 సీట్లకుపైగా గెలుచుకున్న ఇందిరాగాంధీ రాయబరేలి నుంచి లక్షకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని రాజ్‌నారా యణ్‌ కేసు పెట్టడంతో అలహాబాద్‌ కోర్టు ఇందిరాగాంధీ ఎన్నికను రద్దు చేయడం జరిగిందన్నారు. ఇలాంటి అనర్హత వేటును తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాల్సి ఉందన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారంద రినీ ఎన్నికల నిబంధనల ప్రకారం అనర్హులుగా చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఎన్నికలపై ప్రజలకు భరోసా ఇచ్చేలా, ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

హీరోయిన్ల ఫోన్‌లను కూడా ట్యాపింగ్‌ ఎందుకు చేయాల్సి వచ్చింది? విచారణ చేయాలన్నారు. వారసత్వ సొత్తులాగా ప్రజల సొత్తును కొల్లగొడుతూ వెళ్లారు. రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత అనే ప్రాథóమిక హక్కులను కాలరాయడాన్ని ఈ ఫోన్‌ట్యాపింగ్‌ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో చూస్తుండటం సిగ్గుచేటని వ్యాఖ్యా నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టాలని చూసిన ఆ అధికార రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేయాల్సిన అవసరముందన్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, షర్మిల, ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లోని నాయకుల కదలికలపై ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన దానిపై సమగ్ర విచారణ జరపాలని, త్వరలో దీనిపై కేసు పెట్టనున్నట్లు వెల్లడిరచారు.

సుమోటాగా కేసు తీసుకుని విచారించాలి
తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి
ఫాంహౌస్‌కే పరిమితమైన ఓ పెద్ద మనిషి తన కుటుంబమే శాశ్వతంగా రాజ్యం ఏలాల నే స్వార్థంతో ప్రతిపక్ష పార్టీల స్వేచ్ఛను తుంగలోతొక్కి హిట్లర్‌లా అధికారులను ఉపయోగించుకున్నారు. ప్రణిత్‌రావు, భుజంగ్‌రావు, రాధాకిషన్‌రావు, ప్రభాకర్‌ రావు తదితర అధికారులు ప్రజలను కాపాడాల్సింది పోయి ప్రభుత్వ పెద్దలకు అడుగులకు మడుగులొత్తే విధంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. పోలీసులే రైడ్‌ చేసి పోలీసులే డబ్బులు తీసుకుని వెళ్లి పంచుతారా? సిగ్గు ఉందా? 1985లో రామకృష్ణ హెగ్ధే ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మీ ఆవిడ, మీ కూతురు, మీ కోడలు ఫోన్‌లను ట్యాప్‌ చేస్తే మీకు ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలి. ఫోన్‌ట్యాపింగ్‌కు ఇజ్రాయిల్‌ టెక్నాలజీని వాడారని అంటున్నారు.

ఇజ్రాయిల్‌ దేశం అగ్రికల్చర్‌ టెక్నాలజీలో ప్రపంచంలో బెస్ట్‌ టెక్నాలజీ అని పేరు. మేము ఇజ్రాయిల్‌ టెక్నాలజీని వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగించాం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇలాంటి లుచ్చా Ûపనులకు ఉపయోగించడం ఏమిటి? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటువంటి పనులను చేయడానికేనా ప్రజలు మిమ్ములను ఎన్నుకున్నది? మీకు తగిన శిక్ష తప్పదు. కోర్టు కూడా సుమోటోగా ఈ కేసును తీసుకుని విచారించాలి. ఈ విలేకరుల సమావేశం లో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాసులు నాయుడు, మీడియా కమిటీ చైర్మన్‌ ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.

LEAVE A RESPONSE