Suryaa.co.in

Features Food & Health

కూల్‌డ్రింక్స్ యమా డేంజరు గురూ..

వచ్చేది ఎండాకాలం డ్రింకులు అలవాటు ఉన్నవారు తాగడం మానేయండి. కొత్త జనరేషన్ కి అలవాటు చేయకండి తాగే వారిని నివారించండి. కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండాలు, మజ్జిగ, సబ్జాగింజలు, రాగిజావ లాంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగండి.

కొబ్బరి బొండాలు విస్తృతంగా తాగడం వల్ల ఆదాయం మొత్తం భారతదేశంలోనే ఉంటుంది. తిరిగి ఆ డబ్బు ఈ దేశంలోనే ఖర్చవుతుంది కాబట్టి మన సంపద మన దేశంలోనే ఉంటుంది. మన యొక్క ఆదాయం ఇతర దేశాలకి వెళ్ళిపోతుంది. మన దేశ ఆర్థిక అభివృద్ధికి మనం సహకరిద్దాం.

కోకో కోల డ్రింక్ మరియు ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. డ్రింకులు తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు పదే పదే పదే పదే హెచ్చరిస్తున్నారు. వారంలో మూడుసార్లు డ్రింకు తాగడం వల్ల చర్మవ్యాధులు, కిడ్నీ,లివర్, హార్ట్, థైరాయిడ్ అనేక వ్యాధులు వస్తున్నాయి.

నిద్ర లేకపోవడం అలసట, నపుంసకత్వం పిల్లల పుట్టకపోవడం, కళ్ళు మసకబారటం చిన్న వయసులోనే తల మెరిసిపోవడం.క్యాన్సర్ యొక్క లక్షణాల అధికంగా ఉండటం,తిన్నది ఒంటపట్టకపోవడం, ముఖ్యంగా ఆడపిల్లలు త్వరగా రజస్వల అవుతున్నారు. ఇలాంటి వాటికీ మూల కారణమైన మనం తాగకుండా నిరోధించలేమా ఆగలేమా ఒకసారి మనమందరం ఆలోచించాలి.

మనం చేస్తున్న పెద్ద పొరపాటు మనం తాగడమే కాదు ఇతరుల జాగ్రత్త తాగించడమే కాదు మన ఇంట్లో పిల్లలకు కూడా కూల్ డ్రింకులు ఇచ్చి వాళ్ళ యొక్క జీవితాన్ని చేజేతులా మనమే నాశనం చేస్తున్నాము ఇది చాలా దారుణమైన విషయం. మన ఆరోగ్యాన్ని, కూల్ గా కూల్చేసే కూల్డ్రింక్ మానేద్దాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మన పిల్లలకు ఆస్తులు కాదు ఆరోగ్యాన్ని అందిద్దాం.

– లక్కోజు అనిల్ ఆచార్య,
ఏపీ బిజెపి ఓబిసి మోర్చా జోనల్ ఇంచార్జి

LEAVE A RESPONSE