హిందూ ఆలయాలలో అపచారం జరుగుతోంది
నెల్లూరు లో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్
పోలింగ్ బూత్ కమిటీల సభ్యులు తో సమావేశం
నెల్లూరు మహాకవి తిక్కన నడియాడిన నేలలోకి రావడం చాలా సంతోషంగా ఉంది.ఆయన మహాభారతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు.నరేంద్ర మోడీ అందిస్తున్న చక్కటి పాలన చూసి పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీని వదిలి బిజెపిలోకి వస్తున్నారు.దేశంలోనే కాదు విదేశాలకు వెళ్లినా ప్రజలంతా మోడీ మోడీ అని స్మరిస్తున్నారు. మధ్యప్రదేశ్లో బిజెపి ఓడిపోతుందని అందరూ అన్నారు కానీ అక్కడ ప్రజలు బిజెపిని గెలిపించారు. అదేవిధంగా చత్తీస్ ఘడ్ రాజస్థాన్ లో కూడా బిజెపి గెలిచింది.
ఇండియా కూటమి గురించి ప్రజలు పట్టించుకోవడం లేదు. మేమంతా మోడీ కుటుంబం అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ డి.ఏ. కూటమి 400 స్థానాలను గెలవబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో బి.జె.పి.ప్రభుత్వం ఏర్పడేలా కార్యకర్తలు కృషి చేయాలి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఇలాంటి ప్రభుత్వాన్ని తొలగించాల్సి ఉంది
ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు.. దోపిడీలు..కబ్జాలు. పెరిగిపోయాయి. ఎమ్మెల్యేలు.. ఎంపీలు మాఫియా లాగా భూములను దోచుకున్నారు.లిక్కర్ మాఫియా తో ప్రజల చేత బాగా తాగిస్తున్నారు. జగన్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. హిందూ ఆలయాలలో అపచారం జరుగుతోంది. కేంద్ర పథకాలకు వాళ్ళ పేర్లు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు.ప్రజలపై పన్నుల భారాన్ని ప్రభుత్వం గణనీయంగా పెంచింది.. చివరకు చెత్తపై కూడా పన్ను విధించింది. ఇలాంటి ప్రభుత్వాన్ని తొలగించేందుకు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలి.
రాష్ట్రంలో పాలన అధ్వానం
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
నరేంద్ర మోడీ అందించిన సుపరిపాలనను ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకువెళ్లాలి. ఎన్నో పథకాలను అమలు చేస్తున్నార. వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చారు.రాష్ట్రంలో పాలన అధ్వానంగా ఉంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలపై అప్పుల భారాన్ని మోపారు. అప్పులు తీసుకోవడానికి సెక్రటేరియట్ ను కూడా. తనఖాగా పెట్టి 350 కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నారు. దేవాలయంగా భావించే సెక్రటేరియట్ ను ఇలా చేయడం బాధాకరం. గనులను కూడా తాకట్టుపెట్టి వేల కోట్లను అప్పుగా తెచ్చారు. ఈ పాలనకు చరమగీతం పాడేలా బిజెపి కార్యకర్తలు పని చేయాలి.