Suryaa.co.in

Andhra Pradesh

జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కూటమి కైవసం

– డిప్యూటీ మేయర్ గా దల్లి గోవింద్ రెడ్డి

విశాఖ: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. విశాఖలోని 64వ డివిజన్ కు చెందిన జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

గోవిందరెడ్డి నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా, మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. వైసీపీ ఈ ఎన్నికకు దూరంగా ఉండటంతో గోవిందరెడ్డి నామినేషన్ మాత్రమే దాఖలయింది. దీంతో, గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవంగా గెలుపొందినట్టు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు.

LEAVE A RESPONSE