అప్పుల కుప్పలు పేరుకుపోయి కౌలు రైతు ఆత్మహత్య

Spread the love

• రూ. లక్ష సాయం చేసిన పవన్ కళ్యాణ్ 

ఆళ్లగడ్డ నియోజకవర్గం వనికెందిన్నే గ్రామానికి చెందిన కౌలు రైతు బండి సురేంద్ర వ్యవసాయంలో వరుస నష్టాల కారణంగా అప్పుల పాలై రెండేళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. అతని భార్య నాగలక్ష్మి, తండ్రి సుబ్రహ్మణ్యంలను అడిగి బలవన్మరణానికి కారణాలు తెలుసుకున్నారు.

అనంతరం నాగలక్ష్మికి రూ. లక్ష ఆర్ధిక సాయం అందించారు. బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఆ మొత్తాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్క ళ్యాణం శివశ్రీనివాస్, జిల్లా పార్టీ నాయకులు రేఖా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply