Suryaa.co.in

Telangana

కవితకు చుక్కెదురు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురయింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయాడాన్ని సవాల్ చేస్తూ ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు ఆమె పిటిషన్లను కొట్టి వేసింది.

తనను అరెస్ట్ చేయడం, తనను ప్రశ్నించడం రెండు అంశాలపై ఆమె రెండు పిటిషన్లు వేశారు. ఈ రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. మరోవైపు, కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ పై కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్ పై తీర్పును జడ్జి రిజర్వ్ లో పెట్టారు. కాసేపట్లో తీర్పును వెలువరించనున్నారు. కవితను కోర్టు కస్టడీకి ఇస్తే… ఆమెను సీబీఐ కార్యాలయానికి తరలిస్తారు.

LEAVE A RESPONSE