Suryaa.co.in

Andhra Pradesh

గుడివాడకు గోవా సంస్కృతిని తీసుకువచ్చిన బూతుల మంత్రి

– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

నందిగామ : గుడివాడలో జరిగిన క్యాసినో మీద తెలుగుదేశం పార్టీ తరఫున నిజ నిర్ధారణ కమిటీ గుడివాడకు వెళ్ళింది,ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు నోరు తెరవడం లేదు? ముఖ్యమంత్రి దీనిమీద ఎందుకు స్పందించడం లేదు? ఇవాళ విచ్చలవిడిగా 500 కోట్ల రూపాయల జూదం జరిగితే ముఖ్యమంత్రికి బాధ్యత లేదా?

మొదటి సంవత్సరం ఎడ్ల పందాలకు గుడివాడకు ముఖ్యమంత్రి వచ్చాడు. బూతుల మంత్రి మాట్లాడుతున్నాడు పేకాడితే ఏం పీకుతారు ఉరేస్తారా అంటున్నారు. ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ ఎంతో మంది మహానుభావులు గుడివాడ నుంచి వస్తే ఈరోజు గుడివాడను ఒక గోవా చేశారు. ఈ రోజు గుడివాడలో గంజాయ్, డ్రగ్స్, మహిళలు,గుట్కా,మట్కా విచ్చలవిడితనం అయిపోయాయి.

ఎన్ని వందల కోట్ల రూపాయలు దాన్యం డబ్బులు రైతులకు రావాలి. ధాన్యం కొనుగోలు ఇప్పటికీ పూర్తి కాలేదు.సివిల్ సప్లైస్ మంత్రి నీకు ఏమైనా బాధ్యత ఉందా? ప్రతి ఇంట్లో కూడా గుడివాడ క్యాసినో గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర సంస్థలు అన్ని కూడా ఈ క్యాసినో బాగోతంపై స్పందించాలి.

27 ఎకరాల లేఅవుట్ల ప్రాంగణంలో పెద్ద ఎత్తున జూదం జరిగితే శాసనసభ్యుడిగా, మంత్రిగా నీకు బాధ్యత లేదా? ఏ మాత్రం నీకు సిగ్గున్నా వెంటనే రాజీనామా చేయాలి. జిల్లాస్థాయి అధికారులను అడిగితే మౌనమే సమాధానం. సన్న బియ్యం ఇస్తానన్న సన్యాసి క్యాసినో ఆడించాడు.

సామాన్య, మధ్య, పేద తరగతులకు తగ్గట్లుగా ఏ వర్గానికి సంబంధించి ఆ వర్గానికి 10 వేల రూపాయల టిక్కెట్లు, గంజాయి సప్లై చేసే వాడు ఒకడు, గుట్కా సప్లై చేసే వాడు ఒకడు ఏందయ్యా ఇది?ఈ ప్రభుత్వాన్ని ప్రజలు వైసీపీ ప్రభుత్వం అనడంలేదు క్యాసినో ప్రభుత్వం అంటున్నారు.గంజాయి, డ్రగ్స్ కి సంబంధించి ఏ దర్యాప్తు సంస్థలు మాట్లాడటం లేదు. ముఖ్యమంత్రిని సంతోషపెట్టే ఆలోచనతో అహంకారంతో అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. గుడివాడలో క్యాసినో జరిగితే గుడివాడ డిఎస్పి విచారణ చేయకుండా నూజివీడు డిఎస్పి విచారణ చేస్తాడు.

విచారణ ఏమి చేశారు దానికి సంబంధించిన సమగ్ర నివేదిక ఇప్పటికీ బయటికి రాలేదు. చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకొని రెండు సార్లు ఎమ్మెల్యేగా అయ్యి పార్టీ మారి మంత్రి అయినా 32 నెలలకే ఇంతా అహంకారమా? పండగ ముసుగులో మీరు చేసిన ప్రతి తప్పును ఎండగడతాం. బూతుల మంత్రి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బూతుల మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి.

LEAVE A RESPONSE