దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖరరావు మృతి

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు చంద్రశేఖర రావు గురువారం వేకువజామున హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు.

ఊపిరితిత్తులు ఇతర వ్యాధుల కోసం హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా చంద్రశేఖర్ కి చికిత్స అందిస్తున్నారు.

మాజీ మంత్రి దేవినేని ఉమ మూడు రోజులుగా హైదరాబాదులోనే ఉండి తన సోదరుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. విషమించడంతో చంద్రశేఖర్ ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 8 గంటలకు హైదరాబాదు నుండి కంచికచర్ల ఆయన పార్థివదేహాన్ని తీసుకువస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు దహన క్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు చంద్రశేఖర్ మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం సానుభూతి తెలిపారు.

Leave a Reply