కలియుగ శల్యుడు పవన్ కల్యాణ్

– జంపింగ్ జపాంగ్ బాలశౌరి.. అతనిది డేంజర్ స్కూల్
– పవన్ కల్యాణ్ గురించి ఏం మాట్లాడావో తెలియదా?
-నాదెండ్లను బజారుకీడ్చి రచ్చ రచ్చ చేశావు?
– చిరంజీవితో పవన్ కల్యాణ్ కు ఫోన్ చేయించి పవన్ దగ్గరకు వెళ్ళిన మాట వాస్తవం అవునా? కాదా?
– బాలశౌరి వస్తాడు క్షమించమని చెప్తే మనోహర్ క్షమించాడు
– మాజీ మంత్రి పేర్ని నాని

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…

కుటుంబబంధాలు, మానవసంబంధాలు గురించి కుటుంబం జీవితం గురించి పవన్ కల్యాణ్ దగ్గర నేర్చుకోవడం కంటే హాస్యాస్పదం ఏముంది? చిరంజీవి తలదించుకునేలా వ్యవహరించిన మీరు బంధాల గురించి మాట్లాడుతున్నారు. జనసైకోలు చిరంజీవిని దూషించినప్పుడు పవన్ కల్యాణ్ నోరు ఏమైంది.. ఇవాళ సన్నాయి నొక్కులు, పత్తిత్తికబుర్లు చెబుతున్నాడు.

జంపింగ్ జపాంగ్ బాలశౌరి
జగన్ అసత్యలు, అబద్దాలు మాట్లాడతాడని జంపింగ్ జపాంగ్ బాలశౌరి నోటికొచ్చినట్లు మాట్లాడాడు . 2004 నుంచి 2009 వరకు 2019 నుంచి 2024 నాకు జగన్ గురించి మొత్తం తెలుసని అన్నావ్. అంత తెలిసినవాడివి జగన్ దగ్గరకు ఎందుకు వచ్చావు. సిగ్గుశరం లేదా? 2014లో జగన్ సింబల్ మీద ఆయన ఫోటో పెట్టుకుని గుంటూరులో ఓట్లు ఎందుకు అడుక్కున్నావు. 2019లో వైయస్ఆర్ సీపీ సింబల్ మీద బందరులో ఎందుకు పోటీ చేశావు? అన్నీ తెలిసి రావడానికి సిగ్గుండాలిగా?

మా బందరు ఎంపీ .. దేనికి సిద్ధం? పారిపోవడానికి సిద్ధమా? పారిపోయే బతుకులు ఎవరివి? 2004 మన బతుకు ఎక్కడ? తెనాలి, తెనాలి నుంచి 2009 లో నరసరావుపేటకు పారిపోయింది ఎవరు? 2014లో గుంటూరుకు పారిపోయింది ఎవరు? 2019లో గుంటూరు నుంచి బందరుకు పారిపోయింది ఎవరు? పారిపోయే బతుకులు ఎవరివి? నాడు రాజశేఖర్ రెడ్డ లేకపోతే నీకు బతుకు లేదు?
చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గురించి, కేవీపీ రామచంద్రరావు గురించి సాయంత్రం 8 తర్వాత ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నావో కేవీపీకి తెలియదు అనుకుంటున్నావా? ఎంత అసహ్యంగా, జుగుప్సాకరంగా జగన్ గురించి ఏం మాట్లాడావో, ఏం మాట్లాడుతున్నావో తెలియదు అనుకుంటున్నావా? పవన్ కల్యాణ్ గురించి ఏం మాట్లాడావో తెలియదా?

బాలశౌరీది డేంజర్ స్కూల్
2023 జనవరి, ఫిబ్రవరిలో చంద్రబాబు దగ్గరకు నీవు కబురు చేస్తే ఇది మన స్కూల్ కాదు, ఇది చాలా డేంజర్ కేసు మనకు వద్దు. పవన్ కల్యాణ్ దగ్గరకు తోసేయండి అని చెప్తే మార్చి, ఏప్రిల్ లో పవన్ కల్యాణ్ దగ్గరకు ఒక ప్రొడ్యూసర్ తో హరీష్ శంకర్ మైత్రీ మూవీస్ సినిమా షూటింగ్ జరుగుతుంటే అక్కడకు కబురు చేసిన మాట వాస్తవం అవునా? కాదా? పవన్ కల్యాణ్ ఛీ కొట్టిన మాట వాస్తవం అవునా? కాదా? తర్వాత చిరంజీవి కాళ్ళు పట్టుకుంటే.. చిరంజీవితో పవన్ కల్యాణ్ కు ఫోన్ చేయించి జూన్, జులైలో పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్ళిన మాట వాస్తవం అవునా? కాదా?

2004-09 కాలంలో… పవన్ కల్యాణ్ పక్కన కూర్చునే నాదెండ్ల మనోహర్ ని నీవు ఎంత ఏడిపించావు? ఎంత కాల్చుకుతిన్నావు? నాదెండ్లను బజారుకీడ్చి రచ్చ రచ్చ చేశావు? చిరంజీవి నాదెండ్ల మనోహర్ కు ఫోన్ చేసి, బాలశౌరి వస్తాడు క్షమించమని చెప్తే మనోహర్ క్షమించాడు … నాదెండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకుంటే కదా ఆయన కరిగి నిన్ను క్షమించింది ఇన్ని సర్కస్ లు , పిల్లి మొగ్గలు వేసి ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నావు.

బందరు పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలతో తగువులేని నియోజకవర్గం లేదు బందరులో కాపులు ఎక్కువున్నారు. ఇక్కడైతే ఇబ్బంది అవుతుందని వెళ్ళిపోవచ్చు తప్పులేదు, రాజకీయాల కోసం గోడలు దూకుతున్నారు, పార్టీలు మారుతున్నారు.. ఇది కలియుగం. పదవుల కోసం గడ్డి కరుస్తున్నారు. కానీ అటువైపు వెళ్ళి ఇలా మాట్లాడడం సరికాదు. సిగ్గుశరం ఉన్నవాళ్ళైతే నాదెండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకుంటావా? నాదెండ్లను, ఆయన శ్రీమతిని ఎన్ని దుర్భాషలాడి కాళ్లుప్టటుకునే పరిస్థితి.

గోడలు దూకేవాడికి దేవుడు మేలు చేస్తాడా?
జగన్ ఏం పుట్టుమచ్చలు నీకు తెలుసు… అన్నీ తెలిసినవాడివే అయితే వైయస్ఆర్సీపీ తరఫున రెండు సార్లు ఎందుకు పోటీ చేయాలి? పవన్ కల్యాణ్ కు బాలశౌరి నిజస్వరూపం త్వరలోనే తెలుస్తుంది. రాజధాని ఇక్కడే ఉంచుతామని ఊరూరు తిరిగాడంటావా? అసలు ఏడు నియోజవకర్గాల్లో ఎన్ని ఊళ్ళు ఉన్నాయో చెప్పగలవా? ఏ ఊరిలో సర్పంచ్ ఎవరు, ఎంపీటీసీ ఎవరు? బందరులో కార్పొరేటర్ ఎవరు? ఎవరినైనా ఓటు అడిగామా? ఆశ్రయం ఇచ్చి , అర్హత, అధికారం ఇచ్చిన వారిని కించపరుస్తూ మాట్లాడటం మంచిదికాదు. నీలాంటి వాడికి దేవుడుంటాడా?, గోడలు దూకినవాడికి, వెన్నుపోట్లు పొడిచినవాడికి ఇంతమందిని మోసం చేసినవాడికి దేవుడుంటాడా?. తెనాలిలో, నరసరావుపేటలో, గుంటూరులో, బందరులో ఎంక్వాయిరీ చేస్తే తెలుస్తుంది ఎవరు ఏంటో?

కాపుల్ని మోసం చేయొద్దు, వారు అమాయకులు అని హరిరామజోగయ్య మాట్లాడుతున్నారు అది ఆయన గోల, ఇది వైయస్ఆర్సీపీకు సంబంధించిన గోల కాదు. కులపరంగా మాట్లాడుతున్నారు.

Leave a Reply