Suryaa.co.in

Andhra Pradesh

ఫ్యాన్ గాలికి అవుటర్ కొట్టుకు పోయిందా?

-2.25లక్షల ఉద్యోగాల భర్తీ మీదే తొలి సంతకం
-నాలుగున్నరేళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయారు
-బటన్ నొక్కి ఇచ్చే డబ్బులు ఇంట్లో ఖర్చుకే చాలదు
-ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

మదనపల్లి : వైఎస్ఆర్ హయాంలో హంద్రీ – నీవా కట్టాలని అనుకున్నారు. వైఎస్ఆర్ బ్రతికి ఉన్నంత వరకు 90 శాతం పనులు జరిగాయి. హంద్రీ – నీవా పూర్తి అయ్యి ఉంటే ఇదే మదనపల్లి నియోజక వర్గంలో 80 వేల ఎకరాలకు సాగునీరు వచ్చేది. 10 శాతం పనులు పూర్తి చేయలేదు. మదనపల్లి చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు అన్నారు. ఫ్యాన్ గాలికి అవుటర్ కొట్టుకు పోయిందా ? సమ్మర్ ట్యాంక్ లు కడతాం అన్నారు..కట్టారా ? మదనపల్లి టమాటా కి ఫేమస్. ధరలు హెచ్చు తగ్గులతో ధర స్థిరీకరణ నిది అన్నాడు. 3 వేల కోట్లతో చెప్పిన ప్రత్యేక ధరల స్థిరీకరణ ఏమయ్యింది ?

టమాటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏమయ్యాయి ? చేనేతల కోసం క్లస్టర్ లు ఏర్పాటు చేస్తాం అన్నారు. ఒక్క క్లస్టర్ అయినా కట్టారా ? మదనపల్లి చీరకు బ్రాండ్ కల్పిస్తాం అన్నారు…ఎక్కడ బ్రాండ్ ? నియోజక వర్గంలో ఒక్క హామీ అమలు కాలేదు. ఇక్కడే కాదు…రాష్ట్రంలో ఎక్కడ కూడా హామీలకు దిక్కులేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదు. ప్రత్యేక హోదా…ఊసే లేకుండా చేశారు.

2.35 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని మోసం చేశారు. నాలుగున్నరేళ్లు కుంభ కర్ణుడి లెక్క నిద్ర పోయారు. 6 నెలల ముందు నిద్ర లేచి సిద్ధం అంటూ బయలు దేరారు. దేనికి దేనికి సిద్ధం అని అడుగుతున్నాం. మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేసినందుకు సిద్ధమా ? కల్తీ మద్యం అమ్మి ప్రజలు ప్రాణాలు తీసినందుకు సిద్ధమా ? బటన్ నొక్కి…మళ్ళీ వెనక్కి గుంజుకున్నందుకు సిద్ధమా ?

బటన్ నొక్కి ఇచ్చే డబ్బులు ఇంట్లో ఖర్చుకే చాలదు. ధరలు ఆకాశాన్ని అంటాయి. బాబు కి, జగన్ కి పదవులు మాత్రమే చాలు. ప్రజల సంక్షేమం పట్టించుకొనే వాళ్ళు కాదు. వీళ్లిద్దరూ బీజేపీ కి బానిసలు. బీజేపీ తో దోస్తీ కి పోటీ పడుతున్నారు. బీజేపీ కి ఊడిగం చేస్తున్నారు. బీజేపీ ఏమిచ్చింది అని ఊడిగం చేస్తున్నారు ? హోదా ఇచ్చింది అని పొత్తులకు పోయారా ? పోలవరం కట్టింది అని బీజేపీ కి బానిసలు అయ్యారా ? రాజధాని కట్టిందని బీజేపీ లవ్ స్టోరి నడుపుతున్నారా ?

రాష్ట్ర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే 10 ఏళ్లు హోదా. ప్రతి పేద మహిళలకు ఏడాదికి లక్ష. మహిళా పేరు మీద 5 లక్షల తో పక్కా ఇల్లు కట్టిస్తాం. 2.25లక్షల ఉద్యోగాల భర్తీ మీదే తొలి సంతకం.

LEAVE A RESPONSE