Suryaa.co.in

Andhra Pradesh

రాజకీయ ప్రకటనలు నిషిద్ధం

పోలింగ్‌ రోజు, పోలింగ్‌కు ముందు రోజు ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్‌ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదని ఎలక్షన్‌ కమిషన్‌ ఉత్వర్వులు జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతంలో పలు సందర్భాల్లో ప్రింట్‌ మీడియాలో అభ్యంత రకరమైన, తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమైనట్లు ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. అటువంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ఎలక్షన్‌ కమిషన్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం తనకున్న అధికారాలను ఉపయోగించకుంటూ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా రాజకీయ ప్రకటనలలోని విషయాలు రాష్ట్ర/జిల్లా స్థాయిలో ఎంసీఎంఈ కమిటీ వారి నుంచి ముందస్తుగా ధృవీకరించబడినట్లయితే తప్ప ఏ రాజకీయ పార్టీ, అభ్యర్థి, ఇతర సంస్థ లేదా వ్యక్తి పోలింగ్‌ రోజున, పోలింగ్‌కు ఒక రోజు ముందు ప్రింట్‌ మీడియాలో ఎలాంటి ప్రకటనను ప్రచురించకూడదని స్పష్టం చేశారు. దీనికి సహకరించాలని కోరారు.

LEAVE A RESPONSE