Suryaa.co.in

Andhra Pradesh

పాత పింఛను విధానం పైనే చర్చలు ప్రారంభించాలి…

– ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి…తక్షణమే బకాయిలపై టైంలైన్ విడుదల చేయాలి
– ఆర్ధికేతర అంశాలు తక్షణమే పరిష్కారం చేయాలి.. బొప్పరాజు

ఈ రోజు తేదీ 6.12.2022 న ఉద్యోగుల సమస్యలపై మంత్రి వర్గ ఉపసంఘం తో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలు ముందుగా CPS పై మాత్రమే అని చెప్పినా, చివరి నిమిషంలో ఉద్యోగుల పెండింగ్ అంశాలు అన్నిటిపై చర్చలు జరుపుతామని జిఏడి సెక్రెటరీ గారు తెలుపగా ఈ సమావేశానికి బొప్పరాజు, వైవీ రావు, కే. మల్లిశ్వరరావు, కే. సుమన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బొప్పరాజు గారు మాట్లాడుతూ సీ.పీ.యస్ పై జరిపే సమావేశాలకు హాజరు కాబోమని 18/08/2022 న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలోనే లేఖ ఇవ్వటం జరిగిందని తరువాత ది 07/09/2022 న జరిపిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కు కూడా హాజరు కాలేదని బొప్పరాజు పేర్కొన్నారు. అలాగే ఈ రోజు ఏర్పాటు చేసిన CPS సమావేశానికి కూడా హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నాము.

కానీ అధికారులు లెటర్ తయారు చేయటంలో పొరపాటు జరిగిందని వెంటనే సరిచేసుకొని ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై కూడా చర్చ జరుగుతుందని మరల మెసేజ్ పెట్టటం జరిగింది. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పై చర్చించే దానికోసం వచ్చామని చెబుతూ అనేక సమస్యలను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ దృష్టికి బొప్పరాజు గారు తీసుకొని రావటం జరిగింది.

అందులో ప్రధానంగా….
భవిష్యత్తులో, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద మాత్రమే చర్చలు జరపాలని కోరడమైనది.
11వ పీఆర్సీ ఆమోదించిన పే స్కేల్స్ ను శాఖల వారీగా నేటికీ ఆర్ధిక శాఖ నుండి పంపలేదు.
ప్రతి నెల జీతాలు, పెన్షన్లు ఒకటవ తరీకున గత కొంతకాలంగా రాకపోవడం బాధాకరం. గతంలో ఎప్పుడూ ఇలా జరుగలేదు. కనుక ముందుగా పెన్షన్లు, జీతాలు ఒకటవ తేదీన చెల్లించాలి. ప్రభుత్వం నుండి ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు… జీపియఫ్, 11 వ పి అర్ సి బకాయిలు, DA బకాయిలు, సరండర్ లీవ్ అమౌంట్, APGLI లోన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ సెటిల్మెంట్స్, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు సెటిల్మెంట్ లాంటి బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరటం జరిగింది. ఈ చెల్లింపులకు సంబంధించి వెంటనే ఒక టైమ్ షెడ్యూల్ ఇవ్వాలని కోరటం జరిగింది. అలాగే త్వరలో జరిగే కేబినెట్ మీటింగ్ నందు 2022 జనవరి & జూలై DA లను ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఉత్తర్వులు ఇప్పటికే ఆలస్యం అయినందున, వెంటనే క్రమబద్దీకరణ ఉత్తర్వులు ఇవ్వాలని కోరడమైనది.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతభత్యాలు పెంచాలని, ప్రభుత్వ పథకాల్లో వారికి వచ్చే రాయితీలు కొనసాగించాలని కోరారు.

పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు, గురుకుల పాఠశాల వారికి, యూనివర్సిటీ ఉద్యోగులకు 60 సంవత్సరాలనుండి 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ పెంపు ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని కోరడమైనది.పాత 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ మాదిరిగా, కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ కూడా 20% హెచ్.ఆర్.ఎ ఇవ్వాలని కోరడమైనది. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల జీతాలు నుండి 1.7.2022 నుండి హెల్త్ కార్డుల కొరకు డబ్బులు చెల్లిస్తున్నప్పటికి, గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు EHS కార్డ్ లు ఇంతవరకు అందచేయలేదు. వారు వారి కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వెంటనే హెల్త్ కార్డ్ లు ఇవ్వాలి. అలాగే వారికి ట్రాన్స్ఫర్స్ కు వెంటనే అవకాశం కలుగచేయాలి.

ఉద్యోగులకు EHS వల్ల ఏ మాత్రం ఉపయోగకరంగా లేదు. వెంటనే ప్రభుత్వ పెద్దలు జోక్యంతో ఒక కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో సమావేశాన్ని ఏర్పాటు చేసి లోపాలు సరిచెయ్యాలి. ఎక్కడ ఉద్యోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందటం లేదని చెప్పటం జరిగింది. ఫైనాన్స్ మరియు జి.ఏ.డి శాఖల వద్ద పెండింగ్ ఉన్న అంశాలపై ఆయా శాఖల అధికారులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని కోరడమైనది.

ప్రభుత్వ ఉద్యోగులకు గత దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఇంటి స్థలాలు కేటాయింపు సమస్య దీర్ఘ కాలికంగా పెండింగ్ లో ఉన్నందున తక్షణమే తగు చర్యలు తీసుకుని, ఇప్పటికే మార్కెట్ విలువ చెల్లించిన పాత యన్జీఒ హౌస్ బిల్డింగ్ సొసైటీ ల అంశం ఫైనల్ చేయాలని కోరడమైనది. అన్ని అంశాలను సహృదయంతో అర్థం చేసుకున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ గారు, ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి గారు మరియు ఆర్ధిక శాఖ అధికారులు, GAD అధికారులు మాట్లాడుతూ…. సంఘ నాయకులు చెప్పిన సమస్యలను సాధ్యమైనంత వరకు వెంటనే పరిష్కరిస్తామని ప్రధానంగా…. తదుపరి సమావేశంలో పాత పెన్షన్ – సీ పీ యస్ అని కాకుండా, “పెన్షన్” విధానంపై చర్చిస్తామని… పబ్లిక్ సెక్టార్, గురుకులాలు మరియు యూనివర్సిటీ ఉద్యోగులకు 62 సంవత్సరాల వయో పరిమితి విషయంలో ముందుగా యూనివర్సిటీ, గురుకులాలు ఉద్యోగులకు 62 ఏళ్లకు పెంచుతామని, తదుపరి అడ్వకేట్ జనరల్ గారి సలహా తీసుకుని పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు.

అలాగే గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల బదిలీలు కూడా వీలైనంత త్వరలో చేపడతామని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అయ్యే విషయంలో గౌ 11ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

అలాగే ఎంప్లాయీస్ హెల్త్ కార్డుల విషయంలో త్వరలో కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యం మరియు ఉద్యోగ సంఘాల తో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కోవిడ్ ముందు, తర్వాత చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల వారసులకు తక్షణమే కారుణ్య నియామకాలు చేపట్టేందుకు అన్నీ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే గౌ 11ముఖ్యమంత్రితో చర్చించి, తదుపరి సమావేశం నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో విధి విధానాలు ఇస్తామని తెలిపారు.

అలాగే ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలపై జీ ఏ డి, ఆర్ధిక శాఖ అధికారులతో సమీక్ష ఏర్పాటు చేపిస్తామని, నెల మార్చి నెల మంత్రుల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.

LEAVE A RESPONSE