Suryaa.co.in

Andhra Pradesh

న్యాయం వైపు ప్రజలు నిలబడాలి

-హత్యలు చేయడానికి అధికారాన్ని వాడుతున్నారు
-పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి

పులివెందుల: ఒక వైపు వైఎస్‌ బిడ్డ..మరోవైపు వివేకా హత్య నిందితుడు. హత్యలు చేయడానికి అధికారం వాడుకుంటున్నారు. ఇది అన్యాయం కాదా? అని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తుం ది. జగన్‌కు అధికారం ఇచ్చింది అవినాష్‌ రెడ్డిని కాపాడటానికే…రాష్ట్ర ప్రజల కోసం కాదు. 10 ఏళ్లు ఎంపీగా అవినాష్‌ ఉండి కడప స్టీల్‌ గురించి పట్టించుకోలేదు. ఒక్క ఉద్యమం చేయలేదు. వైజాగ్‌ స్టీల్‌ ఎలానో…రాయలసీమకి కడప స్టీల్‌ అంత ప్రాధాన్యం ఉంది. న్యాయం వైపు నిలబడాలని కడప ప్రజలను కోరుతున్నాను.

జైలులో ఉండే నాయకుడు అవసరమా: సునీత
వివేకాను దారుణంగా హత్య చేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యం అవ్వొచ్చు. ప్రజా తీర్పు చాలా పెద్దది. ప్రజా తీర్పు కోసం షర్మిల ఎంపీగా పోటీ చేస్తుంది. న్యాయం వైపు షర్మిల నిలబడిరది. అవినాష్‌ రెడ్డి కనీసం ఓటు అడిగే పరిస్థితి లేదు. ంపో మాపో జైలుకు పోతాడు. ఇలాంటి వాడికి ఓటు వేయడం అవసరమా? మనకు కడపలో ఉండే నాయకుడు కావాలి. జైల్లో ఉండే నాయకుడు అవసరం లేదు. షర్మిలను గెలిపించి వివేకా ఆత్మకు శాంతి కలిగించాలని కోరారు.

LEAVE A RESPONSE