– ‘ సబల’ ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్ – 2022 కార్యాచరణ
– సబల వాట్సప్ నంబర్ 6302666254
– రాజమహేంద్రవరంలో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత సదస్సు’
నేడు సమాజంలో మహిళలకు రక్షణ, భరోసా తీసుకుని వచ్చిన దిశా యాప్ వలన మహిళలకు రక్షణ నిలవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శం అని జిల్లా ఇంఛార్జి, బిసి సంక్షేమం, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ లు పేర్కొన్నారు.
గురువారం స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో మహిళా కమిషన్ ఏడాది కార్యాచరణ – 2022 (‘సబల’ ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్ ) సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జి మంత్రి, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు తదితరులు హజరయ్యారు.
సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ, మహిళలను అబలలుగా కాదు సబలుగా ఉండాలనే ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానీ విధంగా సంక్షేమ పథకాలను మహిళలుపేరునే అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మహిళా సాధికారిత ను మరింత పెంపొందించే విధానంలో దిశా చట్టాన్ని రూపుదిద్దాడం జరిగింది. మనది వేద భూమి, కర్మ భూమి అని, మహిళ అపర శక్తిగా దేవతలు రక్షించి ఆదిపరాశక్తి గా కొలుస్తున్నామన్నారు. జగన్ మోహన్ రెడ్డి వోచ్చాక మహిళలను సబలలుగా మార్చేందుకు ఎన్నో చట్టాలు అమలు చేయాలని సంకల్పం చేశారన్నారు. మహిళలు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకోవాలని పిలుపు నిచ్చారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ నిర్వహిస్తున్న సబల కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనడం లో సందేహం లేదన్నారు. రాష్ట్రంలో మహిళల కు అన్ని రంగాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
అమ్మఒడి, విద్యా కానుక, పౌష్టికాహార పథకం, జగనన్న గోరుముద్దలు, ఇంగ్లీష్ మీడియం లో భోధన, వంటి కార్యక్రమాలు ద్వారా మహిళలు ఆత్మాభిమానం పెంచే దిశలో అడుగులు వేయడం జరుగుతోందన్నారు. ఇతరులకు ఇచ్చే గౌరవం, సంస్కారం మహిళలు నుంచే నేర్చుకుంటామని అది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం అన్నారు. చదువు, విజ్ఞానం సమాజం పట్ల సంస్కారాన్ని నేర్పిస్తుందన్నారు. నేను నా తల్లి నుంచే ఆ సంస్కారం నేర్చుకుని, మా పిల్లలకు కూడా నేర్పించాన్నారు. . భర్తను కోల్పోయిన స్త్రీని విధవ రాలుగా సమాజంలో స్త్రీలపై వివక్ష భావన ఉందని, అలాంటి దురాచారాలు క్షమించ జాలవన్నరు. తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. బాలికలు చిన్ననాటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు.
సదస్సుకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షత వహిస్తూ, నేడు సమాజంలో మహిళలకు రక్షణ, భరోసా తీసుకుని వచ్చిందని దిశా యాప్ , మహిళలకు రక్షణ గణనీయంగా పెరిగిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. దిశాయాప్ ను ఆడపిల్లకు అండగా నిలిచేలా రక్షణ వ్యవస్థ ను జగన్ మోహన్ రెడ్డి తీసుకుని వోచ్చారన్నారు. మహిళలు పై నేరాలు, దాడులు వ్యక్తిగతం కాదు, ఉమ్మడి భాద్యతగా నేడు సమాజం స్పందించాల్సి ఉందన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ మహిళలకు కలుగ చేస్తున్న దిశా యాప్, దిశా చట్టం, దిశా పోలీస్ స్టేషన్ భరోసా కల్పిస్తున్నారని, అవి మిగిలిన చోట్ల, మిగిలిన రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు చెయ్యలేక పోతున్నారో ఒక ఆలోచన చెయ్యాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా ముఖ్యమంత్రి పెద్ద పీట వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకుని రాని పరిస్థితి చూస్తున్నాం. మహిళలు పట్ల నేడు సమాజం దృక్పధం మారాల్సి ఉందని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు పట్ల ఎలా ప్రవర్తించాలి, ఎలా స్పందించాలి అనే అంశాన్ని అన్ని కోణాల్లో చర్చించి పరిస్థితి మార్పు తీసుకుని రావాలని కోరారు. ప్రభుత్వ ఆఫీసు ల్లోనే దాడులు జరుగుతున్నాయని, ఇంక అసంఘటిత కార్మిక రంగం లో పనిచేసే మహిళల స్థితి గురించి కూడా ఆలోచించాలన్నారు.
సీఐడీ అడిషనల్ ఎస్పీ కెజివి సరిత మాట్లాడుతూ మహిళలు అబలలు కాదు సబల అని అందుకు రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు నిదర్శనం అన్నారు. జాతీయ మానవ వనరుల లో మహిళలు అగ్ర గామిగా ఉన్న మనం నేడు సమాజాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాం అని పేర్కొన్నారు. ఇటువంటి చైతన్య సదస్సుల్లో పురుషులతో ప్రత్యేక సదస్సును నిర్వహించాలని కోరగా అందుకు వాసిరెడ్డి పద్మ గారు అంగీకరించడం జరిగిందన్నారు. మహిళా పక్షపాతిగా నాకు ప్రశంసలు వస్తుంటే దానిని గర్వకారణంగా భావిస్తాను. మహిళా సాధికారిత కోసం వారిలో ఉన్న శక్తి ని గుర్తించి ప్రోత్సహించాలి. రాజకీయ, సామాజిక నేపథ్యంలో వారికి తగిన విధంగా తెలియచేయాలి ఉంది. మనకి మనం తెలుసుకుని మనలో ఉన్న శక్తి, బలం మనకు మనం తెలుసుకోవాలి. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఎలా ఉండాలి తెలుసుకోవాలి. “నో” చెప్పగలగాలి.. మనకు ఇష్టం లేకపోతే ఖండించగలిగితే తప్పకుండా మార్పు వస్తుంది. మహిళలల్లో న్యూనత భావం తొలగాల్సి ఉందన్నారు. గర్భస్త శిశువు ఆడపిల్ల అని తెలిసిన సమయం నుండే ఆడపిల్ల వివక్ష గురిఅవ్వడం నేడు చూస్తున్నాం అని పేర్కొన్నారు. ప్రశ్నించే దైర్యం మహిళలు పెంచుకోవాలి. సాంకేతికంగా కూడా అవగాహన పెంచుకో వలసిన అవసరం ఉందన్నారు. దిశా యాప్ ద్వారా ఎన్నో విజయగాథలు నేడు చూస్తున్నాం.. చట్టం కంటే ముందే శిక్షా పడేలా యాప్ ద్వారా సాధించ గలిగాం ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను అని పేర్కొన్నారు.
రుడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు ఈ ప్రభుత్వం లో మహిళల హక్కులపై కల్పిస్తూన్న భరోసా, దిశా యాప్ తీసుకుని వొచ్చి అండగా నిలిచారని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా , ప్రతిపథకంలో వెన్నుదన్నుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.మహిళా సాధికారికత కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న తీరు , నవరత్నాల లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. మహిళా చైతన్య కార్యక్రమా ల ద్వారా ఏదైనా సాధించగలం అన్నారు.
కాలేజ్ ప్రిన్సిపల్ సౌదర్య మాట్లాడుతూ, సమాజంలో మహిళలు పట్ల వివక్ష భావం ఉండకూడదని పేర్కొన్నారు.
కాకినాడ దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పి మురళి మాట్లాడుతూ ఎక్కడైతే స్త్రీలు గౌరవించ బడతారో అక్కడ దేవతలు తిరుగుతారని నమ్మే అతి పవిత్రమైన దేశం భారతదేశం అన్నారు. యువత చెడు మార్గాల వైపు లోను కాకుండా చాగంటి కోటేశ్వరరావు అలాంటి వారు చెప్పే మంచి ప్రవచనాలను విని వాటిని ఆచరించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు వారే నిర్ణయించి సన్మార్గంలో పెంచాలని కోరారు.
మహిళా సాధికారత సదస్సులో విద్యార్థుల స్పందన
చోడవరపు కావ్య రాజమహేంద్రి జూనియర్, డిగ్రీ కాలేజ్, రాజమహేంద్రవరం :
ప్రతి మహిళ తనకు తాను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఆత్మ గౌరవం ఉందన్నారు.ఎప్పుడు మహిళలు రక్షణ పై మాట్లాడు కుంటున్నాము, అంటే అబ్బాయిలకు రక్షణ అవసరం లేదా అంటే ఇద్దరికీ రక్షణ కల్పించాల్సి ఉందన్నది వాస్తవం. అయితే ఆడపిల్లలకు రక్షణ ఉందా అంటే ఉందనే చెప్పాలి వస్తుందన్నారు. ఆడపిల్ల ఎప్పుడు ముగ్గురు రక్షణ వలయంలో జీవిస్తున్నా విషయం కాదనలేము, చిన్నప్పుడు తండ్రి సంరక్షణ, తండ్రి లేకపోతే అన్నదమ్ముల సంరక్షణా, పెళ్లి తరువాత భర్త రక్షణ లోనే మహిళ ఉంటుందని పేర్కొన్నారు. మహిళా సాధికారిత కావాలంటే శక్తి అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎవరికి వారు స్వంత కాళ్లపై నిలబడ గలిగితెనే ఆర్థిక, సామాజిక సాధికారిత పొందగలుగుతారు అన్నది కాదనలేని వాస్తవం అని పేర్కొన్నారు. ఆడ, మగ పిల్లలు ఇద్దరికీ సమాన అవకాశాలు ఇచ్చి ప్రోత్సాహం ఇస్తేనే మహిళలు కోసం ప్రభుత్వాలు, మహిళా కమిషన్ లు వేసే ప్రణాళికలు కార్యరూపం దాల్చడం సాధ్యం అవుతుందన్నారు.
చెరుకూరి కిరణ్మయి, ఆదిత్య ఉమెన్స్ కాలేజీ, రాజమహేంద్రవరం
మహిళా సాధికారికత అంటే మహిళలు సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ఎదగాల్సి ఉందని, తగిన గుర్తింపు ఇవ్వవలసి ఉంటుందన్నారు. అందుకు ఇంటి నుండి మహిళకు మద్దతు లభిస్తే నే అది సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. నేడు ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు ప్రతిభ చూపుతున్నరని, ఐతే అందుకు అనుగుణంగా సరైన గుర్తింపు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇంట్లో అబ్బాయిలకు ఇచ్చే స్వేచ్చ విషయం లో, అమ్మాయిలకు ఇచ్చే స్వేచ్ఛ విషయం లో తేడా లేకుండా సమానత్వం చూపడం ద్వారా ఇంటి నుంచే సాధికారికత కు పునాది వేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మహిళా సాధికారత గురించి తెలుసుకో కలగాలని కిరణ్మయి పేర్కొన్నారు.
ఈ సదస్సుకు రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇల్లా శివప్రసాద్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ అఫ్లియేటెడ్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి , మహిళా కమిషన్ సభ్యులు జయశ్రీ, బి. వినిత, గెడ్డెం ఉమా, లాయర్ హసీనా, సూర్యప్రభ, పద్మావతి తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, దిశాపోలీస్ స్టేషన్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల, విద్యావేత్తలు, విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు.