వయోపరిమితి పెంచి నిరుద్యోగుల అవకాశాలను దెబ్బకొట్టవద్దు

– భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(DYFI)

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 60ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచడం నిరుద్యోగుల అవకాశాలను దెబ్బకొట్టడమే అని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఏఫ్ఐ) రాష్ట్ర కమిటీ విమర్శించింది.

రాష్ట్రంలో 25లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్, ప్రతి ఏడాది డీఎస్సీ పేరుతో గత మూడేళ్ల నుండి మోసం చేస్తూనే ఉంది. రాష్ట్రంలో 2.30లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయకుండ మోసం చేస్తునే ఉంది. చివరికి జాబ్ లేస్ క్యాలెండర్ విడుదల చేసి, దానిని కూడా అమలు చేయలేదు. నిరుద్యోగులను మోసం చేస్తునే ఎవరు అడగకుండా ఉద్యోగులకు వయోపరిమితి రెండేండ్లు పెంచి వయోవృద్దులకు పనిబారం వేసి, పని చేసేందుకు సిద్ధంగా ఉన్న నిరుద్యోగుల అవకాశాలను గండి కొట్టడం చాలా దారుణం. ఇలాంటి మోసపూరిత చర్యలు ఆపి, నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి క్యాలండర్ విడుదల చేయడంతో పాటు, వయోపరిమితి పెంపు అంశాన్ని వెంటనే రద్దు చేయాలని డివైఏఫ్ఐ డిమాండ్ చేస్తున్నది.

జి. రామన్న,రాష్ట్ర అధ్యక్షులు,
ఎం. సూర్యారావు,రాష్ట్ర కార్యదర్శి.

Leave a Reply