సమాధులు తవ్వే వాళ్ళు కావాలా.. పునాదులు వేసే వాళ్ళు కావాలా?

-ఛత్తీస్ గడ్ పాలన తెస్తా అంటున్న రేవంత్ రెడ్డి వలసల రాష్ట్రం చేస్తారా
-అక్కడి విధానం వలే, యాసంగి వడ్లు కొనుగోలు చేయరా
-బిజెపి ఇడి, ఐటి, ఈడి దాడులతో ప్రతిపక్షాలను భపెడుతున్నది
-చెన్నూరులో ఆర్థిక, వైద్యిరోగ్య మంత్రి హరీశ్ రావు
-మంచిర్యాల జిల్లా చెన్నూరులో 210 కోట్ల పనులకు భూమి పూజ, శంఖుస్థాపన చేసిన ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు

వడ్డీ లేని రుణాలు, అభయహస్తం, తునికాకు సేకరించే వారికి బోనస్ డబ్బుల చెక్కులు పంపిణీ చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..చెన్నూరు కాదు చెంజుడు ఊరు లాగా ఉన్నది.గతంలో చెన్నూరుకు వస్తె రోడ్లు బాగుండేవి కావుఎమ్మెల్యేగా బాల్క సుమన్ ఉండటం నియోజకవర్గ అదృష్టం.

ఉద్యమంలో సుమన్ ఎంతో కష్టపడ్డారు. ఉద్యమ స్ఫూర్తితో చెన్నూరు అభివ్రుది చేస్తున్నారు.ఉద్యమంలో నెంబర్ 1, అభివృద్ధి చేయడంలో సుమన్ నెంబర్ 1సొంత ఇల్లు లాగా అభివ్రుది చేస్తున్నారు నియోజకవర్గాన్ని సీఎం గారి ప్రేమ పొందిన నాయకుడు సుమన్.గతంలో 26 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈసారి 56 వేల మెజారిటీతో గెలిపించాలి. సుమన్ కోరిక మేరకు మాతా శిశు ఆసుపత్రి ఇస్తానని చెబుతున్నాను.పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే 3 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నము.ఆడబిడ్డ కష్టపడ కూడదు అని ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తున్నారు.అడగకుండానే కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, న్యూట్రిషన్ కిట్స్ ఇస్తున్నాం.కాంగ్రెస్ బిజెపి వాళ్ళు సొల్లు మాటలు చెబుతారు.

రేవంత్ రెడ్డి ఛత్తీస్ గడ్ సీఎంను తెచ్చి మాట్లాడించారు.ఛత్తీస్ గడ్ పాలన అంటే పింఛన్లు తగ్గిస్తారా?అక్కడ యాసంగి వడ్లు అక్కడ కొనరు. అంటే ఇక్కడ కూడా కొనకుండా చేస్తారా రేవంత్ రెడ్డి?కేసీఆర్ గారు మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక పథకాలు ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆత్మ బంధువు అయ్యారు. భూమికి బరువయ్యే పంట పండుతుంది.చత్తిస్ గడ్ నుండి కూలీలు వస్తున్నారు. వలసలు వెళ్తున్నారు, రేవంత్ రెడ్డి అదే విధానం ఇక్కడ తెస్తారా? 56 లక్షల ఎకరాల్లో వరి పండుతున్నది. తలసరి విద్యుత్ వినియోగంలో టాప్.కరువు తరిమేసి, తెలంగాణ పరువు ఆకాశం అంతా ఎత్తు నిలబెట్టారు.750 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారు. ఒకటి రెండు రోజుల్లో మీ ఖాతాలో పడతాయి.

అభయహస్తం కింద కట్టిన డబ్బులు వడ్డీ తో సహా వాపస్ ఇవ్వబోతున్నం.సీఎం గారు సంపద పెంచారు పేదలకు పంచారు.ఉచిత కరెంట్ కోసం 12 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం.బిజెపి ఈడి, సిబిఐ, ఐటి నమ్ముకున్నారుప్రతి పక్షాలను భయపెడుతున్నారు. దాడులు చేస్తున్నారు. అబద్ధాలు, గోబెల్స్ ప్రచారం చేసి బిజెపి లబ్ధి చేయాలని చూస్తున్నది. సింగరేణి ప్రైవేటు చేసే ప్రయత్నం చేస్తున్నది.చెన్నూరు నియోజకవర్గంలో రెండు బొగ్గు బావులను ప్రైవేటీకణ చేశారు.దేశంలో కాంగ్రెస్ కు కాలం చెల్లింది. మున్సిపల్ మంత్రి కే టి ఆర్ గారి చొరవతో, చెన్నూరుకు అవసరం అయిన నిధులు మంజూరు చేస్తాం.

Leave a Reply