ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం

3

-ముస్లిం రిజర్వేషన్ల కోసం టీడీపీ పోరాడుతోంది
– పెద్దిరెడ్డి పాపాలు సీఎంకు కనబడవు..వినబడవు
– నారా లోకేష్‌

అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపల్లి క్రాస్ వద్ద యువ‌నేత నారా లోకేష్‌తో ముస్లింలు సమావేశం అయ్యారు.

తంబళ్లపల్లి నియోజకవర్గం, ముస్లిం మైనారిటీల స‌మ‌స్య‌లు, విన‌తులు:
• ఉర్దూ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి.
• ముస్లింల రిజర్వేషన్ ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..మీరు పోరాడాలి.
• దుల్హన్ స్కీంకు కఠిన నిబంధనలు పెట్టారు. అర్హుల‌కి అందేలా చూడాలి.
• స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ముస్లిం మహిళలకు ఉపాధి కల్పించాలి.
• ముస్లిం పిల్లలు పెద్దచదవులు చదవాలంటే హైదరాబాద్, విజయవాడ వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగా ముస్లింలకు విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి.
• వైసిపి పాలనలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదు.
• మసీదు, ఈద్గా ల అభివృద్ది కి నిధులు ఇవ్వడం లేదు. ఖబర్ స్తాన్ ల వద్ద కనీసం మౌలిక వసతులు కల్పించడం లేదు.

సమావేశంలో నారా లోకేష్ ప్రసంగం :
మైనార్టీల్లో పేదరికం లేకుండా చేయడమే టిడిపి లక్ష్యం
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం
వక్ఫ్ ఆస్తులు కాపాడటానికి జ్యుడిషియల్ పవర్ కల్పిస్తాం
తంబళ్లపల్లె లో తాలిబాన్ పాలన నడుస్తుంది.
• ముస్లింల అభివృద్ధికి కృషి చేసింది ఒక్క టీడీపీనే.
• దేశంలోనే మొదటి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టిడిపి.
• అధికారంలోకి వచ్చాక ఉర్దూ టీచర్ల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం.
• 2025 జనవరి 1న జాబ్ కేలండర్ విడుదల చేస్తాం..అందులో ఉర్దూ టీచర్ల పోస్టులు కూడా ఉంటాయి.
• ఏపీలో ఎప్పుడూ లేనంతగా మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి.
• సమాజాన్ని వైసీపీ – వైసీపీ కాని వాళ్లుగా జగన్ విభజించారు.
• ముస్లింలపై దాడులు చేసిన ఎవర్నీ వదలను.
• ముస్లిం రిజర్వేషన్ల కోసం టీడీపీ పోరాడుతోంది. చిన్నాన్నను చంపిన వ్యక్తి తరపున ప్రభుత్వ లాయర్లను పెడుతున్నారు. కానీ ముస్లిం రిజర్వేషన్ల కోసం మాత్రం ఈ సీఎం పోరాడటం లేదు.
• అమ్మ ఒడి, పెన్షన్లు కూడా ముస్లిం సంక్షేమంలో చూపిస్తున్నారు.
• అధికారంలోకి వచ్చాక ముస్లిం కార్పొరేషన్ బలోపేతం చేస్తాం.
• దుల్హన్ కింద రూ.50 వేలు మేము ఇచ్చాం..కానీ జగన్ లక్ష ఇస్తా అని మోసం చేశారు.
• ఇప్పుడు ఏకంగా నాలుగేళ్ల తర్వాత దుల్హన్ పథకాన్ని ప్రవేశపెట్టి కఠిన నిబంధనలు పెట్టారు.
• అధికారంలోకి వచ్చాక ఎలాంటి నిబంధనలు లేకుండా పేదలకు దుల్హన్ అమలు చేస్తాం.
• విద్యా దీవెన, వసతి దీవెన తొలగించి..పాత ఫీజురీయింబర్స్ మెంట్ విధానం ప్రవేశపెడతాం. జగన్ తెచ్చిన పథకం వలన పేద తల్లిదండ్రుల పై భారం పడుతుంది.
• అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.
• బి.కొత్త కోటలో రూ.50 లక్షలతో షాదీ ఖానా నిర్మించాం.
• మదనపల్లిని జిల్లా కేంద్రం చేస్తాం. ముస్లింలకు రెసిడెన్షియల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తాం.
• కుప్పంనకు పరిశ్రమలు వచ్చాయి..కానీ తంబళ్లపల్లె కి రాలేదు. దీనికి కారణం పాపాల పెద్దిరెడ్డి కుటుంబమే.
• పరిశ్రమలు పెట్టాలంటే వాటా ఎంతిస్తారని అడుగుతున్నారు. పాపాల పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడించకపోతే నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు పేదరికంతోనే జీవించాల్సి వ‌స్తుంది.
• లారీలు, డెయిరీలు, జేసీబీలు, ట్రాక్టర్లు, క్వారీలు..ఏమి చూసినా పెద్దిరెడ్డి కుటుంబానివే ఉన్నాయి.
• ఒక్క కుటుంబం ఎంత ప్రజాధనాన్ని దోచుకుంటుందో ఆలోచించాలి.
• రూ.10 వేల కోట్లను నాలుగేళ్లలో దోచుకున్నారు. నిరూపించడానికి నేను సిద్ధం
• రూ.1500 కోట్లతో తంబళ్లపల్లెని అభివృద్ధి చేసింది చంద్రబాబే.
• ఇక్కడికి ఒక్కసారైనా సీఎం జగన్ రెడ్డి వచ్చారా.? పెద్దిరెడ్డి పాపాలు సీఎంకు కనబడవు..వినబడవు.
• పరిశ్రమలు వచ్చి ఉద్యోగ, ఉపాధి కావాలంటే టీడీపీని గెలిపించాలి.
• నియోజకవర్గాల వారీగా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి మైనార్టీలకు ప్రత్యేకంగా భూములు కేటాయించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం.

అన్నమయ్య జిల్లా
నారా లోకేష్ సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు.
పాదయాత్రకు లభిస్తున్న జనాదరణకు విశేష స్పందన.
ప్రతి నియోజకవర్గంలో ఇతర పార్టీల నుండి టీడీపీలో చేరుతున్న నాయకులు, కార్యకర్తలు.
ఇటీవల టిడిపి లో చేరిన మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో 300 కు పైగా టీడీపీలో చేరిన ముస్లీం మైనారిటీలు.
పసుపు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన లోకేష్.