Suryaa.co.in

Andhra Pradesh

మీరు ఎంత మందితో వచ్చినా డోంట్ కేర్

-కార్పొరేట్‌ విద్యను కామన్‌మెన్‌ కాళ్ల వద్దకు చేర్చిన చరిత్రకారుడు జగనన్న
-జగనన్న పాలనలో పేదల చదువులకు ఢోకా లేదు

-అనేక సంక్షేమ పథకాల రూపకర్త, అభివృద్ధికి దిక్సూచి సీఎం వైయస్‌ జగన్‌ 
-నాలుగేళ్ల పాలనలో కేవలం విద్యారంగంపైనే రూ.60 వేల కోట్లు ఖర్చు
-చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జనమంతా జగనన్న వెంటే..
-2019లో హిస్టరీ క్రియేట్‌ చేశాం.. 2024లో రిపీట్‌ చేస్తాం
-వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

కార్పొరేట్‌ విద్యను కామన్‌ మెన్‌ కాళ్ల దగ్గరకు తీసుకువచ్చిన చరిత్రకారుడు సీఎం వైయస్‌ జగన్‌ అని, కేవలం పేద పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో అనేక పథకాలు, నాణ్యమైన చదువు కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారని శింగనమల నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. జగనన్న పాలనలో పేదవారి చదువుకు ఢోకా లేదని, ఉన్నత విద్య డబ్బున్నవారికే కాదు.. అర్హత ఉన్న ప్రతి పేదవాడూ పొందే అవకాశం దక్కిందన్నారు. అభివృద్ధి అంటే ఎల్తైన బిల్డింగ్‌లు కాదు.. పేద ప్రజల కళ్లలో ఆనందం చూడటం అని చాటిచెప్పిన సీఎం వైయస్‌ జగన్‌కు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన నిధుల విడుదల బహిరంగ సభలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పాల్గొని మాట్లాడారు.

ఎమ్మెల్యే పద్మావతి ఇంకా ఏం మాట్లాడారంటే..
ప్రపంచాన్ని మార్చాలంటే చదువు ఒక్కటే ఆయుధమని నెల్సన్‌ మండేలా అన్నారు.. సీఎం వైయస్‌ జగన్‌ కూడా అదే ఆలోచనతో మన రాష్ట్ర స్థితిగతులను మార్చేలా విద్యారంగంలో అనేక వినూత్న మార్పులు తీసుకువచ్చారు. పేద విద్యార్థి ఉన్నత విద్యను పొందాలంటే ఎన్ని కష్టాలు పడాలో ప్రతి తల్లికీ తెలుసు. మా బిడ్డలు ఉన్నత చదువులు చదవాలనే కోరిక ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. సరస్వతి కటాక్షం ఎంతున్నా.. లక్ష్మీ కటాక్షం లేకపోతే చదువుకోలేని పరిస్థితి. కానీ, జగనన్న పాలనలో పేదవారి చదువుకు ఢోకా లేదు. ఉన్నత విద్య డబ్బున్నవారికే కాదు.. అర్హత ఉన్న ప్రతి పేదవాడూ పొందే అవకాశం దక్కింది. కార్పొరేట్‌ విద్యను కామన్‌ మెన్‌ కాళ్ల దగ్గరకు తీసుకువచ్చిన చరిత్రకారుడు సీఎం వైయస్‌ జగన్‌. కేవలం పేద పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో అనేక పథకాలు, నాణ్యమైన చదువు కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. అందులో భాగమే వైయస్‌ఆర్‌ ప్రీప్రైమరీ స్కూల్స్, జగనన్న అమ్మ ఒడి, ఇంగ్లిష్‌ మీడియం, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, స్కూల్స్‌లో స్మార్ట్‌ టీవీలు, ఇంటరాక్టీవ్‌ ప్లాట్‌ ప్యానల్స్, డిజిటల్‌ క్లాస్‌రూమ్స్, ప్రతి ఏటా 8వ తరగతి పిల్లలకు ఉచిత ట్యాబ్‌లు, బైజూస్‌ కంటెంట్‌తో సహా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన వంటి అద్భుతమైన పథకాలు రూపొందించి వాటిని పటిష్టంగా అమలు చేస్తూ కేవలం విద్యారంగంపైనే కేవలం ఈ నాలుగేళ్లలో దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేశారు.

గతంలో శింగనమల నియోజకవర్గంలో కరువు కోరలు చాచి, నేలలు బీటలు బారి, చెరువులు ఎండిపోయిన పరిస్థితులు చూశాం. అలాంటిది జగనన్న నాయకత్వంలో మనందరి ప్రభుత్వం ఏర్పడ్డాక శింగనమల నియోజకవర్గంలో సమృద్ధిగా వర్షాలతో చెరువులు నిండి పచ్చటి పైర్లతో, ఆర్బీకేల ద్వారా రైతులకు అందించే సహాయ సహకారాలతో, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక తోడ్పాటుతో లాభసాటి వ్యవసాయాన్ని చూస్తున్నాం. ఇవన్నీ కేవలం నాలుగేళ్ల పాలన సాధ్యం చేశారు.

అభివృద్ధి అంటే ఎల్తైన బిల్డింగ్‌లలో కాదు.. పేద ప్రజల కళ్లలో ఆనందం చూడటం అని చాటిచెప్పిన సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు. ఈ నాలుగేళ్లలో ఒక్క శింగనమల నియోజకవర్గంలో వివిధ పథకాల ద్వారా రూ.1400 కోట్ల ఆర్థిక ప్రయోజనం కల్పిస్తూ మహిళల అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు. రూ.320 కోట్ల నిధులు మంజూరు చేసి శింగనమల నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన సీఎం వైయస్‌ జగన్‌ కృతజ్ఞతలు.

శింగనమలలో ఇటీవల జరిగిన లోకేష్‌ పాదయాత్రను టీడీపీ వాళ్లు యువగళం అంటుంటే.. చూసిన జనం గందరగోళం అంటున్నారు. నా మెజార్టీ 46,377 ఓట్లు. నాకొచ్చిన ఓట్లు 1,18,662. ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న నీ బాబు చంద్రబాబుకు కూడా ఎప్పుడూ ఇన్నీ ఓట్లు రాలేదు. జగనన్న బొమ్మ పెట్టుకొని అత్యధిక మెజార్టీతో గెలిచాను. ఓ వైపు బాబు, మరోవైపు కొడుకు ఇద్దరూ సెల్ఫీ ఛాలెంజ్‌లు చేస్తున్నారు. అది సెల్ఫీ ఛాలెంజ్‌లు కాదు.. వారి చేతగాని సెల్ఫ్‌ గోల్‌ ఛాలెంజ్‌లు. వారి ప్రభుత్వంలో ఆగిపోయిన పనులను కూడా సెల్ఫీలు తీసుకొని గోల్డ్‌ మెడల్‌ సాధించినట్టుగా చెప్పుకుంటున్నారు. శింగనమల ప్రజల తరఫున లోకేష్‌ను అడుగుతున్నా.. నీకు మా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కనబడలేదా..? గార్లెదిన్నె నుంచి శింగనమల వరకు వచ్చిన నువ్వు ప్రభుత్వం వేసిన రోడ్డు గమనించలేదా..? అక్కడెందుకు సెల్ఫీ తీసుకోలేదు. నాలుగేళ్లుగా నిండుకుండలా ఉన్న శింగనమల చెరువు పక్కన సెల్ఫీ ఎందుకు తీసుకోలేదు..?

చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎంత మీడియా గేమ్‌ ఆడినా జగనన్న వెంట జనం ఉన్నారు. ఆ జనం రాబోయే ఎన్నికల్లో జగనన్నే గెలిపిస్తారు. జగనన్న నెక్ట్స్‌ ఎన్నికల కోసం ఆలోచించే రాజకీయ నాయకుడు కాదు.. నెక్ట్స్‌ జనరేషన్‌ కోసం ఆలోచించే ప్రజా నాయకుడు. గత ఎన్నికల్లో ఏం చేస్తామో చెబితేనే ప్రజలు 151 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. ఇప్పుడు గడప గడపకూ వెళ్లి ఏం చేశామో చెప్పి ప్రజల ఆశీర్వాదం కోరుతున్నాం. అందుకే మళ్లీ చెబుతున్నాం వై నాట్‌ 175. మీరెంత మంది వచ్చినా, ముసుగు వేసుకొని వచ్చినా, ముసుగు తీసి వచ్చినా డోంట్‌ కేర్‌.. సింహం సింగిల్‌గానే వస్తుంది. 2019లో హిస్టరీ క్రియేట్‌ చేశాం.. 2024లో హిస్టరీ రిపీట్‌ చేస్తాం.

శింగనమల నియోజకవర్గానికి..
ఇప్పటికే అనుమతి మంజూరైన గండికోట నుంచి ఎల్లనూరు మండలంలో ఎస్‌.తిమ్మాపురం ద్వారా నిట్టూరు, బొప్పేపల్లి చెరువులకు నీరు అందించే లిఫ్ట్‌ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని కోరుకుంటున్నాం. ఎల్లనూరు మండలంలో నీర్జాంపల్లి గ్రామానికి తాగునీరు, సాగునీరు ఇబ్బంది ఉంది. దేవరకొండ పంప్‌ హౌస్‌ నుంచి నీరు ఇవ్వడానికి వీలుందని ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిని అడిగినప్పుడు ఆయన వెంటనే స్పందించి నీరు అందించారు. వారికి ధన్యవాదాలు. గార్లెదిన్నెలో ఉన్న డ్యామ్‌ నిర్వహణ, మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం.

ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద ఉంది. వీలైనంత త్వరగా ప్యాకేజీ అందించాలని కోరుకుంటున్నాం. ఎల్లనూరు మండలంలో రెండు బ్రిడ్జీల నిర్మాణం జరగాలి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నార్పల గ్రామంలో బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల విస్తీర్ణం అందుకు అనుగుణంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రెండెకరాల స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నాం. మీ ఆశీస్సులు మా శింగనమల నియోజకవర్గంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

 

LEAVE A RESPONSE