Home » ప్రజలు చస్తున్నా చూస్తూ నవ్వుకునే వ్యక్తి జగన్

ప్రజలు చస్తున్నా చూస్తూ నవ్వుకునే వ్యక్తి జగన్

-నార్సిస్టిక్ అనే మానసిక వైకల్యంతో ఉన్న సైకో జగన్
-ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో ఐఏఎస్ లకే చిక్కులు ఇక సామన్యులకు చుక్కలే
-జగన్ దోచిన డబ్బులు ప్రజలకు చేరాలి
-సీమలో 198 ప్రాజెక్టులను జగన్ రద్దు చేశాడు
-పాణ్యం ప్రజాగళం సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
-ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడినందుకు తనపై కేసు పెట్టారని, ఏం చేసుకుంటారో చేసుకోండని చంద్రబాబు సవాల్
-జగన్ బొమ్మ ఉన్న పట్టాదారు పాసుపుస్తకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గెజిట్ ప్రతులను తగలబెట్టిన చంద్రబాబు

పాణ్యం: రాయలసీమలో పుట్టాను. రాయలసీమ బిడ్డను నేను. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు సభకు వచ్చారు. సూర్యుడు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. రాయలసీమ మనదే. గత ఎన్నికల్లో రాయలసీమలో 52 సీట్లకు గాను 49 సీట్లు సైకో గెలిచాడు. ఇప్పుడు 52కి 52 సీట్లు మనమే గెలవబోతున్నాం. రాయలసీమలో 3 సీట్లు మాత్రమే గెలిచారని ఎగతాళి చేశారు. కాని ఇప్పుడు జగన్ కి పులివెందలలో కూడా ఎదురగాలి వీస్తుందని ఫస్ట్రేషన్ కి వచ్చేశాడు.

జగన్ కు కోసం వస్తే ఒకప్పుడు టివి పగులగొట్టేవాడంటా ఇప్పుడు ఈ ఫస్ట్రేషన్ లో ఎంత మందిని బలితీసుకుంటారో తెలియదు. సైకో జగన్ ని నమ్మినందుకు ప్రజలు మోసపోయారు, నష్టపోయారు. ప్రజల్లో బాధ, కసి, ఆవేదన, ఆగ్రహాన్ని మే 13న పోలింగ్ బూత్ లో టిడిపికి ఓటు వేసి వైసీపీని భూస్థాపితం చేయాలి.

తల్లి, చెల్లికి గౌరవం ఇవ్వని జగన్ మహిళలకు గౌరవం ఇస్తాడా?
అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి, గూండాగిరిని అణచివేయడానికి, మళ్లీ పోలవరం కట్టి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి, అమరావతిని కట్టి ప్రజానీకానికి ఉద్యోగాలు ఇవ్వడానికి కూటమి కలిసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. టిడిపి ప్రభుత్వంలో అన్ని ప్రాజెక్టుల పనులు పరిగేత్తించాం. కాని జగన్ 5 ఏళ్లు అన్ని ప్రాజెక్టుల పనులను అటకెక్కించాడు. జగన్ ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. నార్సి విధానం అనే రోగం జగన్ కు ఉంది.

అంటే వాళ్లు చెప్పిందే వినాలి, ఎదురుతిరిగితే వాళ్ల మీద దాడి చేస్తారు, చంపేస్తారని జగన్ అదే విధానం అమలు చేస్తున్నారని ఒక డాక్టర్ చెప్పారు. గతంలో ఇదే మానసిక స్థితితో ఉన్న హిట్లర్, బిన్ లాడెన్, ఆఫ్ఘనిస్థన్ తాలిబన్లు, నార్త్ కొరియాలో కిమ్ లు, ఇప్పుడు కిమ్ తాత జిమ్ జగన్ ది కూడా ఇదే పరిస్థితి. చెప్పిన అబద్దం చెప్పకుండా చెబుతూ అందరిని మోసం చేస్తాడు. వీళ్లకు తల్లికి మీద ప్రేమ లేదు. మొన్నటి వరకు తల్లి వైసీపీ గౌరవ అధ్యక్షురాలు ఇప్పుడు తల్లి ఎందుకు కనపడటం లేదు?

తల్లిని చూడలేని జగన్ రాష్ట్ర మహిళలను ఏం చూస్తారు? ఆస్థిలో సమాన హక్కు చెల్లిలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టారు. ఆయన చెల్లిలు దయాదాక్షిణ్యాలపై బ్రతకాలి. కక్షతీర్చుకోవాలి, ఆఖరికి చెల్లిలు కట్టుకున్న చీర గురించి జగన్ మాట్లాడుతున్నారు. ఆయన నాన్నతో పాటు పిల్లలను సైతం ప్రేమించరు. ఆఖరికి వాళ్లను వాళ్లు కూడా ప్రేమించుకోరు. ఇదే నార్సీ విధానం, మానసిక వైకల్యం అవునా కాదా?

ఐదేళ్ల పాటు పరదాల మాటున దాటిన జగన్
ఒక ఎంపీ జగన్ కు వ్యతిరేకంగా తిరగబడ్డాడని ఆయనపై సీఐడీ కేసులు పెట్టి పోలీస్ కస్టడీలో అతనిని కొడుతూ ఉంటే తాడేపల్లి కొంప నుంచి చూస్తూ బలే కొడుతున్నారు, ఇంకా కొట్టమని అంటున్నాడు ఈ సైకో. నంద్యాలలో ఏ కేసు లేకుండా నడిరాత్రి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామన్నారని, ఎందుకు అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. చివరకు నాకే దిక్కు లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అదే నార్సి విధానం. బాబాయ్ ని గొడ్డలితో లేపెయ్యడం, గులకరాయి డ్రామా, కోడికత్తి నాటకం, తండ్రి లేని బిడ్డ అని చెప్పుకొని ఆ తరువాత తండ్రిని చంపిన వాళ్లకే ఎంపీ పదవి కట్టబెట్టారు.

జగన్ దేవుడు కంటే గొప్పవాడు అని అనుకుంటారు. పాలించమని అధికారం ఇస్తే ఒక్క రోజు సెక్రటేరియట్ రాలేదు. ఇది నార్సీ విధానం. ఎన్నికల ముందు రాజధాని అమరావతి అని చెప్పి అధికారంలోకి వచ్చాక మూడు రాజధాని అంటూ మాటమార్చాడు. ఇది నార్సి విధానం కాదా? ఎమ్మెల్యే, ఎంపీలకే ఐదేళ్లు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఐదేళ్లు పరదాలు, బార్ కేడ్లు కట్టుకొని తిరగాడు. అంతేకాదు ఆయన దారిలో పచ్చని చెట్లు కూడా ఉండకుండ నరికేశారు. ఆయనకు ప్రజలన్నా, చెట్లన్నా, పుట్లన్నా భయం. ఇప్పుడు మాత్రం ఎన్నికల కోసం వస్తున్నారు. ఐదేళ్లు మీడియా ప్రశ్నిస్తుందని కేసులు పెట్టారు. ఒక్క రోజు ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి సైకో. ప్రతిపక్షాలు మాట్లాడకూడదని జీవో నెం.1 తెచ్చారు. ఈ నార్సీ విధానం వలన ప్రజలు నష్టపోయారు.

జే బ్రాండ్లతో జనాల ప్రాణాలను హరిస్తున్న జగన్
ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదట కలెక్టర్ల సమావేశం పెట్టిన ప్రజా వేదికనే కూల్చి విధ్వంశానికి నాంది పలికారు. రూ. వేలకోట్లతో నిర్మించిన రాజధాని అమరావతిని చదలు పట్టించారు. రాయలసీమలో 198 ప్రాజెక్టులను రద్దు చేశారు. పోలవరాన్ని సర్వనాశనం చేశారు. ప్రాజెక్టులకు మరమ్మత్తులు చేయకపోవడంతో కొట్టుకుపోయాయి. రూ.13 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరు బాగుపడలేదు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు, ఆదాయం పెరగలేదు, ఖర్చులు పెరిగాయి. కానీ జగన్ ఆదాయం పెరిగింది.

గతంలో క్వార్టర్ రూ.60 ఇప్పుడు రూ.200 పెంచారు. రూ.140 జగ్గూభాయ్ జేబులోకి వెళుతున్నాయి. ఒకటి దాటితో కిక్క ఎక్కదు, రెండు తాగితే కడుపులో మంట, మూడోది తాడితే గోవిందా? నాశిరకం మద్యంతో ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. జగ్గుభాయ్ బ్రాండ్ తో శ్మశాలకు పంపిస్తున్నారు. మా ఆడబిడ్డల మంగళసూత్రాలు తెగుతున్నా, ప్రజలు చస్తూ ఉన్నా, చూస్తూ నవ్వుకునే వ్యక్తి జగన్.

నన్ను చంపేందుకు కుట్ర చేసిన జగన్
నన్ను కూడా చంపే కుట్ర చేశారు. 24 క్లోమోర్ మైన్స్ తో నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఏడు కొండలు దిగివచ్చి నన్ను కాపాడారు. గులకరాయి కనపడదు, కాని దెబ్బ మాత్రం తగులుతుంది కాని ఆయనను హత్యా ప్రయత్నం నేను చేయించానని డ్రామాలాడారు. ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక రూ.1000, ఇప్పుడు రూ.5000కి పెరిగింది. రూ.4000 జగ్గూభాయ్ కి పోతుంది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు చంపేయాలని చూస్తున్నారు. ఒక్క రోడ్డు వేయలేదు, కాలవలో పూడిక తియ్యలేదు, ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. నార్సి విధానం అంటే ఇదే. జగన్ రెడ్డి దోచేసిన డబ్బులపై నేను క్యాష్ వార్ చేస్తున్నాను. ప్రజా మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చాను.

భూమి మీది బొమ్మ జగన్ దా?
భూమి మీదా? జగన్మోహన్ రెడ్డిదా? పట్టాదారు పాసుపుస్తకంపై జగనన్న భూహక్కు చట్టం అని జగన్ ఫోటో వేసుకున్నారు. ప్రజలకు వాళ్ల భూములు వాళ్ల ముత్తాతలు ఇస్తే జగన్ ఇచ్చినట్లుగా జగన్ బొమ్మ ముద్రించుకుంటున్నారు. అందుకే ఈ కాపీని చించి తగులబెడతాను. మీ భూములన్ని జగన్ అకౌంట్లో వేసుకుంటారంటా? మీ భూమి అమ్మాలంటే జగన్ పర్మిషన్ కావాలంటా? అందుకే ఈ నల్లచట్టం కాగితాలను కూడా తగులబెట్టాలి. మీ ఆస్తులు కొట్టేసేవాడు మీకు కావాలా?

ఐఏఎస్ లను వదలని భూ చట్టం
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ప్రత్యక్ష బాధితుణ్ని అంటూ ఒక ఐఏఎస్ మాజీ రెవిన్యూ ఛీప్ సెక్రటరీగా పని చేసిన అధికారి ట్వీట్ పెట్టారు. కృష్ణా జిల్లా విన్నకోటలో పట్టాభూముల మ్యుటేషన్‌కు ఇబ్బందిపడ్డాను. చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూముల మ్యుటేషన్కు‌ నిరాకరించారు. పట్టా భూముల మ్యుటేషన్కుల రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. పోస్టు ద్వారా ఆర్డీవో పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగిచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్లు ఏపీకి సేవలందించిన నాకే ఇలాంటి పరిస్థితి. ఇక సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేమని మెసేజ్ పెట్టారు. అందుకే ప్రజలందరిలో స్పూర్తి రావాలి.

కూటమి ప్రజా మేనిఫెస్టో సూపర్ హిట్
ప్రజా మేనిఫెస్టో మీ జీవితాలను మార్చే సూపర్ సిక్స్ తో పాటు మరోపక్క మోదీ గ్యారెంటీతో అనుసంధానం చేస్తున్నాం. ఆడబిడ్డలకు మంచి రోజులు వస్తున్నాయి. అన్న క్యాంటీన్ రావాలన్నా, రంజాన్ తోఫా కావాలన్నా, ముస్లిం ఆడ బిడ్డలకు దుల్హన్ రావాలన్నా, పండుగ కానుకలు రావాలంటే తెలుగుదేశం రావాలి. డీఎస్సీలో అప్రంటీస్ రద్దు చేస్తాం.ఒక్కో ఆడబిడ్డకు నెలకు రూ.1,500 ఇస్తాం. తల్లికి వందనం కింద చదువుకునే ఒక్కో విద్యార్ధికి రూ.15,000 ఇస్తాం. అందరిని చదివించే బాధ్యత మాది.3 వంట గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తాం. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. కేంద్రం ఆడబిడ్డలు లక్షాదికారులు అయ్యేందుకు పథకాలు తెచ్చారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ వస్తుంది.

కూటమిది విజన్ జగన్ ది పాయిజన్
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బిడ్డ శబరిని ఆశీర్వదించాలి. చరితమ్మ కష్టం వస్తే పలుకుతుంది, ఇబ్బంది వస్తే ఊ కొడుతుంది. అడ్డం వస్తే ఎదురుతిరుగుతుంది. పనుల్లో చాలా దిట్ట. వైసీపీ కబ్జా కోరు జాగ్రత్త. మా శబరి, చరితమ్మ దుర్గాదేవిలా మారి భూబకాసురుల అంతం చూస్తారు. జాబు రావాలంటే బాబు రావాలి. మెగా ఎస్సీపైనే తొలి సంతకం చేస్తాను. ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు నోటిఫై చేస్తాను. ఉద్యోగం వచ్చే వరకు రూ.3వేల భృతి ఇస్సాను. ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఓర్వకల్లు విమానాశ్రయం కట్టించాను. ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ టౌన్ షిప్ తీసుకువచ్చాను. అందుకే కొన్ని కంపెనీలు వచ్చాయి.

30 వేల ఎకరాల భూమిలో హైదరాబాద్ కు సెట్ లైట్ హబ్ గా తయారు చేసి హైదారబాద్ లో ఉంటే ఉద్యోగులు ఓర్వకల్లుకు రావాలని కలలు కన్నాను. కాని జగన్ హయాంలో పెట్టుబడులు పారిపోయాయి. అమర్ రాజా బ్యాటరీస్ తిరుపతి నుంచి పారిపోయింది. నేను వచ్చిన వెంటనే కియా పరిగెత్తుకుంటూ వచ్చింది. అది నా బ్రాండ్ ఇది జగన్ విధ్వంసం. జాబు కావాలా? గంజాయి కావాలా? గంజాయి వద్దు జాబు ముద్దు. నాది విజన్ జగన్ ది పాయిజన్. ఓర్వకల్లు విమానాశ్రయం దాని పక్కనే ఇండస్ట్రియల్ హబ్, పక్కనే నేషనల్ హైవే, అక్కడే సోలార్ తో కరెంట్ ఉత్పత్తి పెట్టాం.

ఏషియాలోనే అతి పెద్ద పోలార్ ప్లాంట్ ఇక్కడే పెట్టాం. అందుకే కరెంట్ ఎక్కువ వచ్చేది బిల్లులు తక్కువ వచ్చేవి. కాని జగన్ హయాంలో 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచారు. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో ప్రజలు బాధపడుతుంటే కాని నార్సి జగన్ కు ఆనందపడుతున్నాడు. రూ.200 పింఛన్ రూ.2000 పెంచితే నార్సి జగన్ మాత్రం రూ.1000 నుంచి రూ.3000 వేశానని చెబుతున్నారు. ఒక అబద్దాన్ని చెప్పి చెప్పి నిజం చేయాలనే చూడటమే నార్సి విధానం. నేను ఏప్రిల్ నుంచి రూ.4వేల పింఛన్ ఇస్తానంటే జగన్ మాత్రం 2028 నుంచి రూ.250 పెంచుతానని అంటున్నాడు.

జూన్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే జులై నెల రూ.4వేలతో పాటు ఏప్రిల్, మే, జూన్ ల రూ.3వేలు కలిసి రూ.7వేలు మొదటి తారీఖునే మీ ఇంటి వద్దనే ఇస్తాను. వాలంటీర్ల లేదనే నెపంతో సచివాలయానికి రమ్మని 33 మంది వృద్ధులను పొట్టనపెట్టుకున్నారు. నేడు బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారు. శవరాజకీయాలు చేయడమే జగన్ నార్సి విధానం. వాలంటీర్లులందరికి రూ.10వేలు పెంచుతాం. పోస్టలో బ్యాలెట్ లో ఓట్లు వేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 80 శాతం మంది ఉద్యోగస్థులు కూటమికే ఓట్లు వేశారు. ఎండ ఉందని వెనకడుగు వేయవద్దు ఓటు వేయడానికి కదలిరా ముందు.

పార్లమెంట్ లో సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు వైసీపీ మద్ధుతు
పాణ్యం నియోజకవర్గంలో 1.60 లక్షల ఓట్లు 16 డివిజన్లలలో ఉన్నాయి అదే విధంగా 1.50 లక్షల ఓట్లు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. ఓటు వేయకపోతే ఏమౌతుందని అనుకుంటూ జగన్ లాంటి వాళ్లు నార్సి విధానం తెస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ఓటు వేయకపోతే చనిపోయినట్లే లెక్క. ఓటు వేయకపోతే చాలా అన్యాయం జరుగుతుంది. బీసీ డిక్లరేషన్ తెస్తాం. రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతాం. సామాజిక న్యాయం చేశాను. కర్నూలు ఎంపీ కురబ కులస్థుడు, అనంతపురం ఎంపీ బోయకు, హిందుపురం ఎంపీ కూడా కురబ కులస్థుడికి ఇచ్చాను.

నంద్యాల ముస్లిం, కర్నూలు వైశ్య, కొడుమూరు మాదిగ, ప్రత్తికొండ ఈడిగ, మంత్రాలం, ఆదోని బోయలు, ఆరూరు, లింగాయత్తులకు ఇచ్చాం. కాని వైసీపీ ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ఇచ్చారు. 4 శాతం రిజర్వేషన్ కాపాడతాను. కర్నూలు లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. ఉర్దూ భాషను రెండో భాషగా పెట్టాను. పార్లమెంట్ లో సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు వైసీపీ మద్ధుతునిచ్చారు. జగన్ ఐదేళ్లల్లో ఢిల్లీలో చీకటి ఒప్పందం గల్లీలో పోరాటం చేశారు.

కేజీఎఫ్ ను మించింది కాటసాని గ్రావెల్ ఫీల్డ్
అవినాష్ రెడ్డి గొడ్డలి వీరుడు. ఇక్కడ ఆసుపత్రికి వచ్చి ఎన్ని నాటకాలాడారో చూశారుగా? కాటసాని కబ్జాల రెడ్డి కావాలా? కేజీఎఫ్ సినిమా మాదిరి ఇక్కడ కూడా కాటసాని గ్రావెల్ ఫీల్డ్ ఉంది. జగన్నాథ గుట్ట కొల్లగొట్టాడు. జర్నలిస్టుల భూములు కబ్జా చేశాడు. నాటు సారా, సెటిల్ మెంట్లు చేశాడు. దాడులు చేయించాడు. పాణికేశ్వర స్వామి భూములు కబ్జా చేశాడు. నకిలీ పత్రాలు సృష్టించారు. గజ్జల కొండలో కోట్ల విలువ చేసే గ్రావెల్ తవ్వేశాడు. ముజాఫర్ నగర్ లో 524 సర్వే నెంబర్ లో మసీదుకు చెందిన 2 ఎకరాలు కబ్జా చేశాడు. భూమి కోసం పోరాడిన ముస్లింని బెదిరించారు. ప్రశ్నించినందుకు ఈనాడు కార్యాలయంలపై దాడులు చేశాడు. ఇద్దరు దుర్గామాతలు కబ్జాల రెడ్డిని రాజకీయ భూస్థాపతం చేస్తారు.

పాణ్యం నియోజకవర్గానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
ఈ ప్రాంతంలో రెండు రోజులకు ఒక సారి నీళ్లు వస్తున్నాయి. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రోజు నీళ్లు ఇస్తాం. హంద్రీనీవా నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేసి ఓర్వకల్లులో కల్లూరు మండలానికి నీళ్లిస్తాం. అలగనూరు రిజర్వేషన్ ను ప్రత్యేక కెనాల్ ద్వారా గడివేముల మండలానికి, పెసలవాయి కెనాల్ కి నీటిని అనుసంధానం చేస్తాం. దీని ద్వారా గడివేముల, గండిఆత్మకూరు, నంద్యాల మండలంలో 30 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఓర్వకల్లులో పరిశ్రమలు వస్తాయి. వైసీపీని ఓడించడానికి ప్రజలందరూ సిద్ధమా? పట్టుదల, సంకల్పంతో వైసీపీని చిత్తు చిత్తు ఓడించడానికి ముందుకు వెళ్లాలి.

Leave a Reply