మీ ఇష్టాను సారంగా వార్తలు రాసి మా జీవితాలతో ఆడుకోవద్దు

-మా నేతల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరించొద్దు
-పశ్చిమ సీటు నాదే….పోటీ చేసేది నేనే
-తన సీటు మార్పు వ్యవహారం పై వస్తున్న వార్తలపై స్పందించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

నాకు సీటు లేదని, సీటు మారుస్తున్నారని రకరకాల వార్తలు వేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి క్యాంప్ ఆఫీస్ కి నేను మేయర్ రెండు రోజులు క్రిందట వెళ్ళాం. సీటు మార్పు గురించి నా దగ్గర ఇప్పటివరకు అధిష్టానం ప్రస్తావించలేదు. నేను వెస్ట్ నియోజకవర్గ నుండి మళ్ళీ పోటీ చేస్తా.విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్ళమన్నారు అనేది ప్రచారం మాత్రమే.

నేను పార్టీకి రాజీనామా చేశానని ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు..నేను జగన్ నమ్ముకున్న వ్యక్తిని.జగన్ ఏం చెప్పినా… చేయడానికి సిద్ధంగా ఉన్నాను.విజయవాడ మూడు నియోజకవర్గాలతో పాటు, ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు గెలిపించి ముఖ్యమంత్రి ఇస్తాము. పశ్చిమ సీటు నాదే….పోటీ చేసేది నేనే. అనవసరంగా లేనిపోని పుకార్లు చేస్తున్నారు…పద్దతి కాదు.

పశ్చిమ నియోజకవర్గ,విజయవాడ అభివృద్ధి కోసం రావాల్సిన నిధుల కోసం సీఎం జగన్ ను కలిశాను. సీఎం జగన్ సీటు మార్పులో ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను. మా నేతల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరించొద్దు. పశ్చిమలో నేను సెంట్రల్ లో మల్లాది విష్ణు,తూర్పులో అవినాష్… మా మధ్య చిచ్చు పెట్టొద్దు. సోషల్ మీడియా లో అనవసరంగా ప్రచారం చేస్తున్నారు. మీ ఇష్టాను సారంగా వార్తలు రాసి మా జీవితాలతో ఆడుకోవద్దు.

Leave a Reply